Travel Insurance తీసుకుంటే ఇన్ని లాభాలా ?

మనం అప్పుడప్పుడు ప్రణాళిక బద్దమైన ప్రయాణం లేదా అనుకోని ప్రయాణాలను చేస్తూవుంటాం లేదా కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి లేదా విభిన్నమైన సంస్కృతులలో లీనమై జీవితకాల మధురజ్ఞాపకాలను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక అద్భుతమైన అనుభవమే ప్రయాణం. అయితే ఇలాంటి అద్భుతమైన క్షణాలలో మన ప్రయాణంలో జరిగే ఊహించని సంఘటనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం, ఇలాంటి సమయాలలోనే Travel Insurance ఎంతగానో ఉపయోగపడుతుంది, ట్రావెల్ ఇన్సూరెన్సు మనకి ఒక భద్రతా వలయంలా ఉపయోగపడుతుంది , మన ప్రయాణ ప్రణాళికలకు అనుకోని అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆర్థిక రక్షణ అలాగే మనశాంతిని కూడా అందిస్తాయి.

ఎలాంటి కవరేజ్ లు ఉంటాయి ?


ట్రావెల్ ఇన్సూరెన్సు అనేది ప్రయాణ సమయంలో లేదా ప్రయాణానికి ముందు ఎదురయ్యే ఊహించని పరిస్థితులు లేదా ప్రమాదాల నుండి ప్రయాణికులను రక్షించడానికి రూపొందించినటువంటి ఒక ప్రత్యేకమైన భీమానే ప్రయాణ భీమా ( Travel Insurance ), ఈ ప్రయాణ భీమా అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే మెడికల్ ఎమర్జెన్సీ, ట్రిప్ లో అంతరాయం లేదా ట్రిప్ Cancellation, ఆలస్యమైనా లేదా పోయిన సామాను , ప్రయాణ జాప్యం లేదా వ్యక్తిగత బాధ్యతల వంటి విషయాలలో ఈ ప్రయాణ భీమా కవరేజి అందిస్తుంది అలాగే ఇది చాలా ఉపయోగపడుతుంది .

ప్రయాణ బీమా యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు :

ట్రిప్ లో అంతరాయం లేదా ట్రిప్ రద్దు కవరేజ్ : కొన్ని కొన్ని సార్లు మనకు ఊహించలేని పరిస్థితులు ఎదురుకావచ్చు అలాంటి సమయాలలో ప్రయాణాన్ని రద్దు చేయడం లేదా తగ్గించుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు అనారోగ్యం లేదా గాయం లేదా కారణాల వలన ట్రిప్ లో అంతరాయం లేదా ట్రిప్ రద్దు అయ్యే అవకాశం ఏర్పడినప్పుడు విమాన టిక్కెట్లు , టూర్ ప్యాకేజీ లేదా హోటల్ బుకింగ్ వంటి వాపసు చేయని ఖర్చులను మనము తీసుకున్న ప్రయాణ భీమా reimbursement అందిస్తుంది

మెడికల్ కవరేజ్ : విదేశాలకు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే వైద్య ఖర్చులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి, ఇలాంటి సందర్భాలలో ఆసుపత్రి లో చేరడం మీకు అవసరమైన వైద్య చికిత్స , డాక్టర్ ఫీజు , వైద్య పరంగా అత్యవసరంగా తరలింపు లేదా మీ స్వదేశానికి తిరిగి వెళ్లడం వంటి ఖర్చులను ప్రయాణ భీమా కంపనీ కవర్ చేస్తుంది.

సామాను ఆలస్యం లేదా సామాను కోల్పోవడం : మీరు ప్రయాణిస్తున్న సమయంలో మీ యొక్క సామాను ఆలస్యం అయినా లేదా పోగొట్టుకున్నా మీకు అసౌకర్యంగా లేదా నిరాశకు గురిచేస్తుంది, అలాంటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్సు దొంగిలించబడిన , పోయిన లేదా పాడైపోయిన సామాను కోసం కవరేజ్ అందిస్తుంది అలాగే ఆలస్య సమయంలో మీకు అవసరమైన వస్తువులకు reimbursement అందిస్తుంది.

ప్రయాణం ఆలస్యం : విమానం రద్దు లేదా ఆలస్యం వలన మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించవచ్చు లేదా అదనపు ఖర్చులకు దారి తీయవచ్చు. సమ్మెలు , తీవ్రమైన వాతరరణ మార్పులు , మెకానికల్ బ్రేక్ డౌన్ వంటి కారణాల వల్ల జరిగే వసతి , భోజనం , అలాగే రవాణా ఖర్చులతో సహా ఊహించని ఆలస్యలకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్సు భీమా పరిహారం అందిస్తుంది

వ్యక్తిగత భాద్యత : ట్రావెల్ ఇన్సూరెన్సు లో వ్యక్తిగత బాధ్యత కవరేజ్ కూడా ఉండవచ్చు, మీరు అనుకోకుండా ఇతరుల యొక్క ఆస్తిని పాడుచేసినా లేదా ఇతరులకు హాని కలిగించినా చట్టపరమైన ఖర్చులు మరియు నష్టాల నుండి ఈ పాలసీ మిమ్మల్ని రక్షించడం

కొన్ని ముఖ్యమైన ట్రావెల్ ఇన్సూరెన్సు పాలసీ లను చెక్ చేసినట్లయితే మార్కెట్ లో చాలా పాలసీ కంపెనీ లు అందుబాటులో ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన కంపెనీ లు చూసినట్లయితే

1 ) tata aig travel insurance
2 ) reliance travel insurance
3 ) bajaj allianz travel insurance
4 ) icici travel insurance
5 ) hdfc ergo travel insurance

ఇవే కాకుండా ఇంకా చాలా రకాల కంపెనీ లు ఉంటాయి, మీరు మీకు నచ్చిన కంపెనీ ని అవి ఇచ్చే సర్వీస్ ని ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.

ముగింపు :

ప్రయాణ భీమా అనేది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మనశ్శాంతి ని ఆర్థిక రక్షణని అందిస్తుంది, ట్రిప్ Cancellation కానీ మెడికల్ ఎమర్జెన్సీ, సామాను పోగొట్టుకోవడం, ట్రిప్ అంతరాయం లేదా ప్రయాణం ఆలస్యం వంటి ఊహించని పరిణామాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది సరైన Travel insurance పాలసీ ని ఎంచుకోవడం ద్వారా మీకు ఎదురయ్యే పరిస్థితులకు మీరు అన్ని విధాలుగా ఎదుర్కోవచ్చు అనే నమ్మకంతో ప్రయాణించవచ్చు, గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ట్రావెల్ ఇన్సూరెన్సు అనేది ఒక విలువైన ఆస్తి. అందుకే మీరు పాలసీ తీసుకునే టప్పుడు అన్ని చెక్ చేసుకుని పాలసీ ని ఎంచుకోవడం ఉత్తమం.

Read More Articles

Online ద్వారా నిజంగానే లక్షలు సంపాదించవచ్చా ? – How to Earn Money From Home in Telugu గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు – Green Tea Benefits in Telugu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me