గ్రీన్ టీ అనేది మొదటగా చైనా లో ఉద్బవించింది ఇది ఒకరకమైన టీ, దీనిని కామెల్లియ సైనెన్సిస్ అనే మొక్కల ఆకుల నుండి తయారు చేస్తారు, Green Tea Benefits in Telugu దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల ఇది వేల సంవత్సరాల నుండి వినియోగించబడుతుంది, దీని ఆరోగ్య ప్రయోజనాల వల్ల మరియు ఆహ్లాదకరమైన రుచి వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. గ్రీన్ టీ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటైనటువంటి అధిక ఆంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగి ఉండడం ఈ ఆంటీ ఆక్సిడెంట్ లు అనేవి ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడే సమ్మేళనాలు,
గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు – Green Tea Benefits in Telugu
గ్రీన్ టీ రకాలు మరియు తయారీ విధానం :
ఈ గ్రీన్ టీ ని ఆక్సిడైజ్ చేయని ఆకుల నుండి వీటిని తాయారు చేయడం జరుగుతుంది అలాగే ఇది ఊలాంగ్ మరియు నలుపు టీ ల నుండి వేరుగా ఉంటుంది దీని ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా తాజాగా పండించినటువంటి ఆకులను స్టీమింగ్ చేయడం లేదా పాన్ లో వేసి వేయించడం ద్వారా ఆక్సీకరణను ఆపివేయడం అలాగే టీ యొక్క శక్తివంతమైన ఆకుపచ్చ రంగు మరియు సహజ సమ్మేళనాలు సంరక్షించడం అలాగే టీ తయారీలో భాగంగా ఈ ఆకులను రోల్ చేసి ఎండబెట్టి కాచుటకు గాను సిద్ధంగా ఉంచుతారు.
గ్రీన్ టీ రకాలు
గ్రీన్ టీ అనేక రకాలు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ప్రత్యేకమైన లక్షణాలు మరియు రుచులలో ఉంటాయి చాలా ప్రసిద్దిగాంచిన కొన్ని రకాలు :
మచ్చా : నీడలో పెరిగినటువంటి టీ ఆకులను మెత్తగా అలాగే పొడిగా చేయడం ద్వారా వీటిని తాయారు చేస్తారు దాని స్పష్టమైన ఆకుపచ్చ రంగు మరియు ఆచార ప్రాముఖ్యత కోసం ప్రసిద్ధి చెందింది.
సెంచ : ఇది జపాన్ లో వాడే అత్యంత సాధారణ రకం గ చెప్పుకొంటారు, సెంచా మొదటి లేదా రెండవ ఫ్లష్ లో పండించినటువంటి ఆకుల నుండి దీనిని తాయారు చేస్తారు ఇది రిఫ్రెష్ అలాగే గడ్డి రుచిని ఉత్పత్తి చేస్తుంది.
లాంగ్ జింగ్ : ఈ లాంగ్ జింగ్ టీ చాల సున్నితమైనది ఇది చెస్ట్ నుత్ లాంటి రుచికి బాగా ప్రసిద్ధియే చెందింది
Green Tea Benefits in Telugu
గ్రీన్ టీ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి దాని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్. యాంటీఆక్సిడెంట్లు అనేవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు, ఇవి కణాల నష్టాన్ని కలిగించే మరియు క్యాన్సర్, గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేసే అస్థిర అణువులు. గ్రీన్ టీలో ముఖ్యంగా కాటెచిన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ రకం పుష్కలంగా ఉంటుంది, ఇవి శక్తివంతమైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రభావాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు.
ఆరోగ్య ప్రయోజనాలు :
గ్రీన్ టీ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి దీనిని మన రోజువారీ అలవాటుగా చేసుకున్నట్లయితే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి అలాగే ఈ పానీయంలో పాలిఫెనాల్స్ ముక్యంగా కాటెచిన్స్ వంటి బయో యాక్టీవ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఇవి శక్తి వంతమైన ఆంటీ ఆక్సిడెంట్ లుగా పని చేస్తాయి ఈ సమ్మేళనాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉన్నాయి వాటిలో ముక్యంగా.
1. మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది :
గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ అలాగే ఎమినో ఆసిడ్ ఎల్ థియనైన్ మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది అదే విదంగా చురుకుదనం , ద్రుష్టి మరియు మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది.
2. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది :
పలు అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన గుండె జబ్బులు అలాగే స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది అదే విదంగా అధిక రక్తపోటును తగ్గించడానికి ఎల్ డి సి కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువ చేయడానికి అలాగే మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచంలో దోహద పడుతుంది.
3. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్
గ్రీన్ టీ ని తీసుకోవడం వలన దాని యొక్క పాలిఫెనాల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతగానో సహాయపడతాయి, ఇది కొన్ని కాన్సర్ లు , గుండె జబ్బులు, న్యూరో డిజెనెరేటివ్ డిజార్డర్స్ వంటి దీర్ఘ కాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
4. మెటబాలిజం పెంచుతుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ జీవక్రియ ను మెరుగుపరుస్తుంది అలాగే కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహిస్తుంది దీనిని తీసుకోవడం వలన బరువు తగ్గడం లేదా బరువు అదుపులో ఉండడం కోసం దీన్ని ఎంచుకోవడం కోసం ఇది సరియైన ఎంపిక
ఈ గ్రీన్ టీ వాడకంలో ఒక్కో దేశంలో ఒక్కో సాంస్కృతిక సంప్రదాయాలను కలిగి ఉంది, ఇది జపాన్ లో సాడో లేదా చానోయు అనే టీ వేడుక ఇది తాయారు చేసే కళను ప్రదర్శించే అత్యంత ఆచారబద్ధమైన ఆచారం. అలాగే జపాన్ లో వడ్డిస్తున్న మాచా ఇది ఒక వేడుక సామరస్యం ఇది స్వచ్ఛత , గౌరవం , ప్రశాంతతను కలిగి ఉంటుంది ఇది జాపనీస్ సాంస్కృతిక వారసత్వం లో ముఖ్యమైన భాగంగా మిగిలిపోయింది. అలాగే ఇది చైనీయుల దైనందిన జీవితాలలో చాల లోతుగా పాతుకుపోయింది మరియు ఈ గ్రీన్ టీ శతాబ్దాల కాలం నుండి అతిత్యాన్ని ఇచ్చేదిగా మరియు తరుచుగా అతిథులకు గౌరవ సూచకంగా అందించబడుతుంది.
Best Green Tea Brands in India
భారతదేశంలో గ్రీన్ టీ యొక్క ఉత్పాదనలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యకాలంలో వీటి వాడకం అధికంగా అయిందని చెప్పవచ్చు. భారత దేశంలో చాల రకాల గ్రీన్ టీ కంపెనీ లు ఉన్నాయి, వాటి ఉత్పాదనను బట్టి వాటి రుచిని బట్టి మనకు అందుబాటులో ఉన్నాయి.
1.lipton green tea
మన దేశంలో దొరుకుతున్న గ్రీన్ టీ బ్రాండ్ లలో ఇది ఒకటి ఇది వివిధ రకాల ప్యాక్ లలో లభ్యం అవుతుంది.
2. tetley green tea
ఇది కూడా ఎక్కువ అందుబాటులో ఉండే గ్రీన్ టీ
3. Organic India Tulsi Green Tea
4. Saffola Fittify Moringa Green Tea
5. Girnar Green Tea Desi Kahwa
6. Typhoo Green Tea
7. Eco Valley Organic Green Tea
8. Twinings Green Tea
9. Taj Mahal Green Tea
10 .Basilur Green Tea
పైన తెలిపిన గ్రీన్ టీ బ్రాండ్ లు వాటి రుచిని బట్టి మరియు సైజు ను బట్టి అందుబాటులో ఉన్నాయి
Raead More Articles :
సి విటమిన్ లభించే పదార్థాలు వాటి ప్రయోజనాలు – C Vitamin Foods in Telugu
అవిసె గింజలు ఉపయోగాలు – Avise Ginjalu – Flax Seeds in Telugu
Apricot in Telugu – ఆప్రికాట్ నేరేడు పండు ప్రయోజనాలు – Dry Fruits
Conclusion – ముగింపు:
ఈ అద్భుతమైన గ్రీన్ టీ పానీయంతో ముడిపడి ఉన్నటువంటి సాంస్కృతిక ప్రాముఖ్యత, గొప్ప చరిత్ర, ఎలా ఆరోగ్య ప్రయోజనాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది, గ్రీన్ టీ వాటి భిన్నమైన రుచుల వలన ప్రజలను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది, మీ దిన చర్యలో భాగంగా గ్రీన్ టీ ని చేర్చుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది, ఇది అందించే రుచిని ఆస్వాదిస్తూ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి అలాగే మీ ఇంట్లో గాని ఆఫీస్ పనిలో గాని దీనిని చక్కగా సేవించవచ్చు.