Apricot in Telugu – ఆప్రికాట్ నేరేడు పండు ప్రయోజనాలు – Dry Fruits

Spread the love

ఎన్నో పోషకాలు ఉండే ఈ ఆప్రికాట్లు Apricot in Telugu దాదాపు 400 సంవత్సరాల క్రిందట చైనా లో ఉద్బవించాయని నమ్ముతారు తరువాత మధ్యదరా ప్రాంతానికి అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా పరిచయం చేయబడింది అలాగే నేడు ప్రపంచదేశాలైన ఇటలీ , ఇరాన్ , టర్కీ , స్పానిష్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో సాగు చేయబడుతుంది. ఈ ఆప్రికాట్లు ప్రూనస్ జాతికి చెందిన ఒక రకమైన రాతి పండు గా పేర్కొంటారు. ఇందులో రేగు పండు, చెర్రీస్ మరియు పీచెస్ కూడా ఉన్నాయి అవి కొద్దిగా ఓవల్ ఆకారంలో లేదా గుండ్రంగా ఉంటాయి అలాగే బంగారు నారింజ రంగుతో , ఎరుపు లేదా గులాబీ రంగుతో వెల్వెట్ రంగుతో ఉంటాయి, ఈ పండు తీపిగా, జ్యుసీ గా, మరియు కొద్దిగా టార్ట్ ఫ్లేవర్ అలాగే దృఢమైన ఇంకా లేత ఆకృతిలో ఉంటుంది. ఈ apricot ని నేరేడు పండు అని కూడా అంటారు. ఎన్నో పోషకాలు ఉండే ఆప్రికాట్ లను మన రోజువారీ ఆహార పదార్థాలలో Dry Fruits గా తీసుకోవచ్చు,

ఆప్రికాట్ నేరేడు పండు ప్రయోజనాలు – Apricot in Telugu -Dry Fruits

Apricot Uses in Telugu – ఆప్రికాట్ ఉపయోగాలు

ఈ పండ్లను బహుముఖ పండ్లుగా పేర్కొంటారు వీటిని ఎండబెట్టి లేదా తాజాగా కూడా వివిధ రకాల వంటలలో కూడా వాడవచ్చు అలాగే వీటిని స్మూతీస్, సలాడ్ లు లేదా సొంతంగా అయినా తినవచ్చు ఇవి సహజ తీపిని కలిగి ఉంటాయి, ఎండిన ఆప్రికాట్ లను డ్రై ఫ్రూట్ లాగా తీసుకుంటారు అలాగే తరచుగా బేకింగ్ మరియు వివిధ వంటలలో ఉపయోగిస్తారు. వీటిని జామ్ గా, కాక్ టెయిల్ మరియు పానీయాలలో మిక్సర్ గా కూడా ఉపయోగించవచ్చు. apricot in telugu name : ఈ పండు ను నేరేడు పండు అని పిలుస్తారు

Health Benefits of Apricots in Telugu – ఆరోగ్య ప్రయోజనాలు

ఈ పండును రోజువారీ ఆహారంగా తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవి.

సంవృద్ధి పోషకాలు : ఈ ఆప్రికాట్ లలో అత్యధికంగా విటమిన్లు ఉంటాయి అందులో విటమిన్ A, C ఉంటాయి, అలాగే ఇనుము, ఫైబర్, పొటాషియం వంటి ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడుతాయి

జీర్ణ వ్యవస్థ మెరుగు : ఈ నేరేడు పండు లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది కావున ఇది జీర్ణక్రియను ప్రోత్సహించి మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది

గుండె ఆరోగ్యానికి : ఈ ఆప్రికాట్ లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కావున ఇది రక్త పోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది

రోగనిరోధక శక్తి పెంచుతుంది : ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కావున ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరిచి అంటువ్యాదులు మరియు ఇతర వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది.

మంటను తగ్గిస్తుంది : ఈ నేరేడు పండ్లలో ఫైనాలిక్ సమ్మేళనాలు మరియు కెరోటినాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడమే కాకుండా శరీరంలోని మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి

చర్మం ఆరోగ్యం : ఈ పండ్లలో విటమిన్ ఆ అధికంగా ఉండడం వలన ఇవి ఆరోగ్యమైన చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిదంగా అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో ఎంతో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి

కంటి ఆరోగ్యం : ఈ apricot పండ్లలో కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉంటాయి ఇది కంటి రుగ్మతల నుండి అలాగే వయస్సు సంబంధిత మచ్చల నుండి కాపాడడంలో సహాయపడతాయి.

ఎముకల ఆరోగ్యానికి : ఇందులో పాస్పరస్, క్యాల్షియం ఉంటాయి ఇవి బలమైన ఎముకల కోసం అలాగే ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి

Read More Articles

Conclusion

ముగింపు

ఈ ఆప్రికాట్ పండ్లు అనేవి రుచికరమైన మరియు పోషకాహార పండు ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వీటిని ఉడికించి,ఎండబెట్టి లేదా తాజాగా కూడా తినవచ్చు, వీటిని ఎక్కువగా స్వీట్లు వివిధ రకాలైన వంటకాలలో ఉపయోగిస్తారు, మంచి తీపి మరియు ఎన్నో పోషకాలు ఉండే ఈ పండును క్రమం తప్పకుండా మీ ఆహారంలో తీసుకున్నట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి, అలాగే వీటిని తీసుకోవడం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది తద్వారా రోగాల బారినుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?