Festival Gift : మహిళలకు శుభవార్త…! ప్రతి నెలా ఉచితంగా రూ.1500.. అర్హత, వివరాలివే..!

Festival Gift : మహిళలకు శుభవార్త…! ప్రతి నెలా ఉచితంగా రూ.1500.. అర్హత, వివరాలివే..!

Festival Gift : మన దేశంలో మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించే, పెట్టుబడులను ప్రోత్సహించే నాలుగు పథకాలు బాగా పాపులర్ అయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

Festival Gift : అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని, దేశాభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆర్థిక పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ కార్యక్రమాలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, సాంఘిక సంక్షేమం సహా విభిన్న రంగాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ లిస్టులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ పథకం నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్‌ కొత్తగా లాంచ్‌ చేసిన మాఝీ లడ్కీ బహిన్ యోజన వరకు ఉన్నాయి.

యువతుల విద్య, సంక్షేమం కోసం పొదుపు చేసేందుకు కేంద్రం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. Beti Bachao Beti Padhao Initiative లో భాగంగా ఈ పథకం ను లాంచ్‌ చేసింది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 10 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద తన గార్డియన్‌ అకౌంట్‌ తెరవవచ్చు.

Festival Gift : ఈ పథకం అత్యధికంగా ఏడాదికి 8.2 శాతం రిటర్న్స్‌ ఇస్తుంది. మినిమం రూ.250తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షలు వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇందులో లభించే వడ్డీపై కూడా పన్ను ఉండదు. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేసరికి పథకంలో పెట్టుబడి అనేది మెచ్యూర్ అవుతుంది. అయితే అమ్మాయికి 18సంవత్సరాలు నిండినప్పుడు విద్య, పెళ్లి ఖర్చులకు కొంత డబ్బు తీసుకునే అవకాశం ఉంది.

Festival Gift : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్- 2023 అనేది మహిళల కోసం లాంచ్‌ చేసిన స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. మహిళల్లో సేవింగ్స్ ను ప్రోత్సహించే ఉద్యేశ్యంతో కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ స్కీం లో బాలికలు, యువతులు, వివాహితులు ఇలా భారతీయ మహిళ ఎవరైనా సరే ఇన్వెస్ట్‌ చేయవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. చిన్న వయసు గల ఆడపిల్ల పేరిట గార్డియన్‌ లేదా మేల్‌ గార్డియన్‌ లేదా లీగల్‌ గార్డియన్‌ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో రూ.రెండు లక్షల వరకు డిపాజిట్‌ చేసే అవకాశం ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2025 March వరకు అందుబాటులో ఉంటుంది.

రాష్ట్రంలోని మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించేందుకు ఒడిశా గౌర్నమెంట్ September 2 న సుభద్ర యోజన స్కీమ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద, 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తం రెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. 5 సంవత్సరాల్లో మొత్తం రూ.50,000 చేతికి అందుతుంది. నిధులు స్వయంగా లబ్ధిదారుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్‌ అవుతాయి. డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు మహిళలకు సుభద్ర డెబిట్ కార్డులు కూడా జారీ చేస్తారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఆగస్టులో మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకాన్ని ప్రకటించింది. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి నిరుపేద మహిళలు ఈ పథకం కు అర్హులు. వీరికి ప్రతి నెలా స్టైఫండ్‌గా రూ.1,500 అందిస్తారు. 21-65 సంవత్సరాల వయసున్న వివాహితలు, విడాకులు పొందిన, నిరుపేద మహిళలు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me