Google Pixel Watch 3 : గూగుల్ పిక్సెల్ వాచ్ 3 ఫస్ట్ లుక్ అధుర్స్….20% వేగవంతమైన ఛార్జింగ్ సమర్థం..ఇంకా మరిన్ని కొత్త ఫీచర్స్ తో…

Google Pixel Watch 3 : గూగుల్ పిక్సెల్ వాచ్ 3 ఫస్ట్ లుక్ అధుర్స్….20% వేగవంతమైన ఛార్జింగ్ సమర్థం..ఇంకా మరిన్ని కొత్త ఫీచర్స్ తో…

Google Pixel Watch 3: పిక్సెల్ వాచ్ 3 గూగుల్ యొక్క యాక్చువా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది,గూగుల్ పిక్సెల్ వాచ్ 3 రెండు మోడళ్లలో గరిష్ట ప్రకాశాన్ని 2,000 నిట్‌ల వరకు ప్రకాశవంతం చేస్తుంది. ఇందులోని Google 41mm, మోడల్‌లో 20% వేగంగా ఛార్జింగ్‌ చేస్తుంది. అయినప్పటికీ, 45mm మోడల్‌కు Google ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే ఈ వాచ్ 3, యొక్క పూర్తి వివరాలు మార్కెట్ లోకి రాలేదు.ఈ వాచ్ లకు సమందించిన బ్యాటరీ లైఫ్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వాచ్ ఎప్పుడు కూడా ఆన్‌లో ఉన్న డిస్‌ప్లేతో 24 గంటల వరకు ఎలాంటి అసౌకర్య భావాన్ని వినియోగదారులకు కల్పిoచదు.ఈ వాచ్ లో మనం బ్యాటరీ సేవర్ని ఆన్ మోడ్ లో పెట్టుకుంటే 36 గంటల వరకు కూడా బాగా సమర్థవతంగా పని చేస్తుంది.

  • గూగుల్ పిక్సెల్ వాచ్ 3 లీకైన రెండర్‌లు పిక్సెల్ వాచ్ 2కి సమానమైన డిజైన్‌ను చిన్న చిన్న తేడాలతో ఒకేలాగా ఉన్నాయి.
  • రాబోయే గూగుల్ పిక్సెల్ వాచ్ 3, వాచ్ 2 కంటే కొంచెం అడ్వాన్సుడ్ వేరియేషన్స్ తో ఉంటుందని వాచ్ లవర్స్ అంచనా వేస్తున్నారు .
  • పిక్సెల్ వాచ్ 3, యొక్క బ్యాటరీ వాచ్ 2 కన్న సమర్థవంతంగా ఉండబోతుంది. ముందు కన్న 20% ఛార్జింగ్ తొందరగా అవుతుంది.


లీకైన రెండర్‌ల పరిశీలిస్తే , పిక్సెల్ వాచ్ 3 పిక్సెల్ వాచ్ 2 లాగా అదే డిజైన్‌ను కలిగి ఉంది . కాబట్టి, మీరు ఇప్పటికీ అదే వృత్తాకార బెజెల్-లెస్ డిస్‌ప్లేను వైపు తిరిగే కిరీటంతో పొందుతున్నారు. పిక్సెల్ వాచ్ 3 కూడా 1.2-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, దాని కన్న ముందు వేరియేషన్స్ లాగానే దీని ఫీచర్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్ నలుపు రంగులో మ్యాచింగ్ స్ట్రాప్‌తో వస్తుంది కానీ అధికారికంగా మార్కెట్ లోకి వచ్చినపుడు మరిన్ని షేడ్స్‌లో అందుబాటులో ఉండాలి.

OnLeaks ప్రకారం, Pixel Watch 3 పిక్సెల్ వాచ్ 2 కంటే కొంచెం అడ్వాన్స్డ్ వేరియేషన్స్ ని కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో పొందుపరిచినా బ్యాటరీ కూడా పెద్దది అన్న వూహలు కుడా వున్నాయి. పిక్సెల్ వాచ్ 3 డెక్రా మరియు సేఫ్టీ కొరియా వెబ్‌సైట్‌లలో దాని బ్యాటరీ సామర్థ్యాన్ని 307mAhగా వెల్లడించింది . ఇది పిక్సెల్ వాచ్ 2లోని 304mAh బ్యాటరీ కంటే కొంచెం పెద్దది.


కొలతల పరంగా, పిక్సెల్ వాచ్ 3 1.2-అంగుళాల మరియు 41 x 41 x 12.3 మిమీని కొలిచే పిక్సెల్ వాచ్ 2తో పోలిస్తే 40.79 x 40.73 x 14 మిమీని కొలుస్తుంది.


డీలాబ్స్(Dealabs) నివేదిక ప్రకారం, యూరోప్ లో Google Pixel Watch 3 (41mm) ధర Wi-Fi వేరియంట్ కోసం EUR 399 (సుమారు రూ. 36,500) నుండి ప్రారంభమవుతుంది, అయితే సెల్యులార్ ఎంపిక EUR 499 (సుమారు రూ. 45,600)గా ఉంటుంది.

Google Pixel Watch 3 యొక్క పెద్ద 45mm ఎంపిక ఐరోపా దేశాలలో వరుసగా Wi-Fi మరియు సెల్యులార్ వేరియంట్‌ల కోసం EUR 449 (దాదాపు రూ. 41,100) మరియు EUR 549 (సుమారు రూ. 50,200)కి విక్రయించబడుతుందని చెప్పబడింది.భారతదేశం లో దీని ధర పైన ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!