Guppedantha Manasu Serial Today Episode June 24 మనో , ఏంజెల్ లకు పెళ్లి చేస్తానని మాటిచ్చిన శైలేంద్ర .రంగాని రిషిలాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వసుధార…
Guppedantha Manasu Serial Today
నా కాలేజ్ నుండే నన్ను వెళ్ళమంటా! అసలు ఈ కాలేజ్ పేరొంటో తెలుసా! DBST కాలేజీ అంటే దేవేంద్ర భూషణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ . దేవేంద్ర భూషణ్ అంటే ఎవరో తెలుసా? మా తాత గారు , అసలు మా కాలేజీలోకి అక్రమంగా చొరబడి, అడ్డగోలు పనులు చేస్తుందే కాకుండా నన్నే బయటకు వెళ్ళమంటావా అని , మనో గారిమీద శైలేంద్ర కోప్పడుతూ అస్సలు నువ్వెవడ్రా అంటూ మనో గారిపైకి అరుస్తాడు. అప్పుడు మనో శైలేంద్ర భూషణ్ మర్యాదగా మాట్లాడు అని మనో అంటుంటే అప్పుడు నీకు మర్యాద ఏంట్రా అప్పుడు ఏంజెల్ శైలేంద్ర తో నువ్వు టూ ముచ్ చేస్తున్నావ్ అంటే అప్పుడు శైలేంద్ర అసలు నువ్వెవరు , ఇక్కడేందుకున్నావ్,ఈ కాలేజీ కి ఎందుకొచ్చావ్ ? నీకు ఈ కాలేజీ కి ఎం సంబంధం పోనీ నీకు ఈ మనో కి ఎమన్నా సంబంధం వుందా అని శైలేంద్ర ఏంజెల్ ని అడుగుతాడు.
అప్పుడు దానికి ఏంజెల్ అవును ఉంది. తను మా బావ. మా బావతో మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. దానికి శైలేంద్ర మీ సరసాలు సరదాలు ఏమన్నా ఉంటే, బయట చూసుకోవాలి గాని కాలేజీలో కాదు. ఏంటో ఈ కాలేజీ కర్మ ఎవరెవరో వస్తున్నారు. ముక్కు మొహం తెలియని వారు కుర్చీలో కూర్చుంటున్నారు. దిక్కులేని వాళ్ళందరికీ ఈ కాలేజీ ఏ దిక్కు అవుతుంది. అని శైలేంద్ర ఏంజెల్ మనొ ని అంటాడు. ఈ మాటలకి మను శైలేంద్ర నువ్వు నన్నే అంటున్నావని అర్థం అవుతుంది. నువ్వు అనుకుంటున్నాట్టు దిక్కులేని వారు ఎవరూ లేరు ఇక్కడ. ఎందుకు లేరు కన్న తండ్రి ఎవరో తెలియని వారు దిక్కులేని వారే అవుతారు కదా. అని శైలేంద్ర మనొ తో గొడవ పడతాడు. దానికి మనొ శైలేంద్ర అని తన మీదికి కోపంతో చేయి అప్పుడు ఏంజెల్ మనో నీ ఆపుతూ, ఇంకోసారి మనొ తండ్రి గురించి మాట్లాడితే మానో కాదు నేనే కొడతాను. అని శైలేంద్రతో ఏంజెల్ అంటుంది. అప్పుడు శైలేంద్ర అవును మరి మీరు కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను మరి, దానికి మనో ఏం చేస్తావ్, ఏం చేస్తావ్ అని గట్టిగా అంటూ శైలేంద్ర మీదకి మనొ అంటాడు. దానికి శైలేంద్ర మీది మీదికి వస్తున్నావ్ ఏంటి బ్రదర్, ఎందుకంత ఆవేశం. ఇప్పుడు నేనేమన్నానని, జస్ట్ దిక్కులేనివాడు అని అన్నాను. అంతే కదా! పోనీ ఓ పని న్ చేద్దామా మీరిద్దరూ ఎలాగూ రెగ్యులర్ గా కలుసుకుంటూ, ఇక్కడే సెటిల్ అవుతున్నారు కదా! నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను.
GuppedaGuppedantha Manasu Today Episode June 24 మనో , ఏంజెల్ లకు పెళ్లి చేస్తానని మాటిచ్చిన శైలేంద్ర .రంగాని రిషిలాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వసుధార…ntha Manasu Serial Today Episode
ఏమంటారు మీ ఇద్దరికీ ఇష్టమే కదా! నేను మీ పెళ్లి చేసినందుకు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదే ఎండి సీట్ ఉంది కదా! దాన్ని నాకు ఇచ్చేయాలి. దానికి మనో రేయ్ ఎండి సీటు గురించి దేనికైనా దిగజారి పోతావా, ఏమైనా చేస్తావా! ఛీ! అంటాడు మనొ. దానికి శైలేంద్ర ఇప్పుడు నేనేమన్నాను జస్ట్ మీ పెళ్లి చేస్తాను అని అన్నాను. పెళ్లి చేయడం అనేది పుణ్యమే కదా! అందులో మీకు ఇద్దరికీ ఇష్టమే కదా! అని శైలేంద్ర వాళ్ళిద్దరితో అంటాడు. దానికి ఏంజెల్ మేము చెప్పామా! మా ఇద్దరికీ ఇష్టమే అని నీకు చెప్పామా! దానికి శైలేంద్ర ఏంటి ఇష్టం లేదా! మరి ఎందుకు రోజు కలుస్తున్నారు. దానికి ఏంజె ల్ కలిసినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టేనా? పెళ్లి చేసుకున్నట్టేనా? దానికి శైలేంద్ర అంటే మీరు పెళ్లి చేసుకోవడం లేదా! దానికి ఏంజెల్ ల్ అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అని అంటుంది. దానికి శైలేంద్ర ఛ నేను మీ ఇద్దరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని, దానికి ఏంజెల్ నువ్వు ఏమన్నా సైకాలజిస్ట్వా అని, మా మనసులో ఏముందో చెప్పడానికి, పోనీ జాతకాలు ఏమైనా చెప్తావా, మేము పెళ్లి చేసుకుంటామని చెప్తున్నావ్. దానికి శైలేంద్ర కొంతమంది ఫ్యూచర్ చెప్పడానికి జాతకాలు తెలియని అవసరం లేదు. అని అంటాడు. దానికి ఏంజెల్ అవును మరి జాతకం ఏంటో తెలియదు గానీ, నీ ఫ్యూచర్ ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. దానికి శైలేంద్ర ఏంటి అని వెటకారంగా అడుగుతాడు. దానికి ఏంజెల్ అడుక్కొని తింటావు, అతి త్వరలోనే సర్వస్వం కోల్పోయి, అందరికీ దూరమై, తిండి తిప్పలు లేకుండా అడుక్కు తింటావ్. అడ్రస్ లేకుండా పోతావు. దానికి శైలేంద్ర శపిస్తున్నావా! శాసిస్తున్నావా అని అంటాడు. దానికి ఏంజెల్ ఏదైనా అనుకో? జరగబోయేది మాత్రం ఇదే! అని అంటుంది.
దానికి శైలేంద్ర సరేలే నువ్వు ఎన్నన్నా నేను పట్టించుకోను గాని, ఫైనల్ గా ఒకటి అడుగుతున్నాను. నాకు ఎండి సీట్ ఇచ్చారంటే మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తా అని అంటాడు శైలేంద్ర. ప్లీజ్ అర్థం చేసుకోండి. దానికి ఏంజెల్ ఛీ, ఛీ అడుక్కునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఒక్కసారి లేదని చెప్పిన అడుక్కుంటూనే ఉంటారు. దిక్కుమాలిన సంత అంటూ ఏంజెల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దానికి శైలేంద్ర మనసులో నేను ముష్టి వాడిన! అని అనుకుంటాడు. అలాగే మనో కూడా శైలేంద్రను చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇదిలా ఉండగా అక్కడ ఆటో రంగాగా ఉన్న (రిషి), రిషి కి తమ్ముడు గా ఉంటున్న అతను ఆటోను క్లీన్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రంగా తమ్ముడు ఏంటన్న ఆటో కి క్లీనర్ పెట్టుకోవడం నిన్నే చూస్తున్నా అని అంటాడు. దానికి రంగా ఏ ఆటో కి క్లీనర్లు ఉండరా అని అంటాడు. అప్పుడు లోపలి నుండి వస్తున్న వసుధారా ఉండొచ్చు కానీ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది అని ఒక సామెత చెబుతుంది. దానికి రిషి ఏంటి మేడం గారు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడుగుతాడు. దానికి వసుధార ఇంట్లో బోర్ కొడుతుంది అని అంటుంది. దానికి రంగా టీవీ చూసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు వసుధారా టీవీ కూడా బోర్ కొడుతుంది అని అంటుంది. దానికి రంగ అయితే నేనేం చేయలేను అని అంటాడు. అప్పుడు వసుధార అది కాదు రిషి సార్ అంటూ రిషి సార్ రిషి సార్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో నే రంగా మరదలు వస్తుంది. వసుధార రిషి సార్ రిషి సార్ అని పిలవడం వింటుంది. దానిని రిషి సార్ అంటే మా బావ పలకలేదు సంతోష పడుతూ, రిషి సార్ కానీ రంగ అని గట్టిగా తన మరదలు పిలుస్తుంది. అప్పుడు రంగా అని పిలిచి నిన్ను పిలుస్తుంది అని చెబుతుంది. దానికి రంగా నా పేరు రిషి కాదు రంగా అని చెప్తాడు. వసుధారతో మేడం గారు రిషి అంటే పక్క న్న గాని పలకను రంగా అంటే అల్లంత దూరాన ఉన్నా కూడా పరిగెత్తుకొని వస్తా అని చెప్తాడు.చెప్పండి మేడం గారు ఏంటి, అప్పుడు వసుధారా నన్ను కొంచెం బయటకు తీసుకెళ్తారా,! ఊరు చూపించడానికి అని అంటుంది . అప్పుడు ఋషి ఎందుకు అని అంటాడు అదేంటి సార్ ఇంట్లో బోర్ కొడుతుంది అని అన్నాను కదా! అని అంటుంది వసుధార.
Guppedantha Manasu Serial Today
అందుకే ఊరు చూపించమంటున్నాను. అప్పుడు రంగా మరదలు మా బావ ఎందుకు నీకు ఊరు చూపించాలి అని అంటుంది. అప్పుడు వసుధార మరి నువ్వు చూపిస్తావా అని అంటుంది. దానికి రంగా వాళ్ళ మరదలు వామ్మో నీతో నేను వేగలేను అని చెప్తుంది. అప్పుడు వసుధర సర్ చెప్పండి సార్ అంటూ తీసుకెళ్తారా అని అడుగుతుంది. దానికి రిసీజర్ మా ఊర్లో ఏం లేదు చూపించడానికి అని అంటాడు. దానికి తోడుగా కూడా రంగ మరదలు అవును ఏం లేదు మా ఊర్లో అని అంటుంది. అప్పుడు వసుధారా మీ ఊరు మీకు రోజు చూస్తారు కదా అందుకు మీకేం స్పెషల్ అనిపించదు కానీ నాకు చూపించండి అని పట్టు పడుతుంది. పంట పొలాలు రచ్చబండలు కాలువ గట్లు , పాడి పశువులు ఇవన్నీ చూడాలి నాకు కొత్తగా ఉంటుంది అని చెప్తుంది. దానికి రిషి సార్ సరే మీకు చూడాలనిపిస్తుంది మేడం గారు కానీ నేను కిరాయి వెళ్లాలి అనుకుంటున్నాను. ఈమధ్య సరిగా వెళ్లటం లేదు. కాసిన్ని పైసలు కూడా కావాలి కదా అని రిషి అంటాడు. దానికి వసుధార నన్నేమీ ఊరికి తీసుకెళ్లనవసరం లేదు నేను కూడా డబ్బులు ఇస్తాను అని అంటుంది. దానికి రిషి డబ్బులు ఇస్తారా ఎక్కడినుండి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు. దానికి వసుధర ఇప్పుడు కాదు మీటర్ మీద ఎంత అయిందో చెప్పండి కచ్చితంగా మీ డబ్బులు మీకు ఎప్పుడైనా సరే ఇస్తాను అని అంటుంది. అది విన్న రంగ తమ్ముడు ఇంకేంటి అన్నా డబ్బులు ఇస్తాను అని అంటుంది కదా తీసుకెళ్లండి అని అంటాడు.
Guppedantha Manasu Serial Today Episode
దానికి రంగా మరదలు ఏయ్ డబ్బులు ఇస్తే తీసుకెళ్తారా అని వాడిని తిడుతుంది. వద్దు బావ నువ్వు తనని తీసుకెళ్లొద్దు అని అంటుంది. ఇదేమో వసుధార సర్ ప్లీజ్ అని, అటేమో తన మరదలు వద్దు బావ అని, తనని తీసుకెళ్లొద్దు అని ఇలా ఇద్దరు అంటూనే ఉంటారు. దానికి రంగా సరేలే చాలాసేపటినుండి బ్రతిమిలాడుతుంది కదా తీసుకెళ్తానులే అని అంటాడు. దానికి వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు రంగా మరదలు కూడా నేను కూడా మీతో వస్తాను అని,అంటుంది దానికి వసుధార ఒప్పుకోదు. ఎందుకు నేనొస్తే నీకేమవుతుంది నువ్వు ఊరు చూడడానికి వెళ్తున్నావు కదా అని అంటుంది. అప్పుడు వసుధార నేనొక్కదాన్నే ఫ్రీగా చూడాలి అనుకుంటున్నాను. పైగా నేనే ముందు ఆటోను మాట్లాడుకున్నాను అని అంటుంది. ఇలా ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. నీ మనసులో ఇంకేదో ఉంది అని రంగా మరదలు అంటూ అయితే నేను కూడా వస్తాను అంటుంది. నీకు ఏంటి ప్రాబ్లం అని, దానికి వసుధారా నువ్వు వస్తే నేను డబ్బులు ఇవ్వను అంటుంది అప్పుడు రంగా మరదలు నీ బోడి డబ్బులు మాకు ఏమీ అవసరం లేదులే అంటుంది. నాక్కూడా ఊరు చూడాలనిపిస్తుంది అని రంగా వాళ్ళ తమ్ముడు కూడా అంటాడు. అప్పుడు వసుధర ఇదేమైనా సిటీ బస్సు అనుకుంటున్నారా అని అంటుంది. ఇంతలో రంగా మరదలు రంగ తమ్ముడికి నా ఫోన్ చార్జర్ లోపల ఉంది తీసుకురా పోరా అని వాడిని లోపలికి పంపిస్తుంది. వాడు చార్జర్ తెచ్చి లోపు మనం వెళ్దాము అని, ఆటోలో ఇద్దరు ఎక్కి కూర్చుంటారు. రంగా వాళ్ళ తమ్ముడు వచ్చేలోపే వీళ్లు ఆటో తీసుకొని వెళ్ళిపోతారు.వాడు అరుస్తూ వీళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆగిపోయి సరోజా నీ సంగతి చెప్తా లోపలికి వెళ్తాడు.
ఇలా మార్గమధ్యలో వసుధార రంగానే (రిషి) సార్ ని చూస్తూ ఉంటుంది. దానికి సరోజ కోపంగా చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో రంగా ఇదే మా ఊరు మేడమ్ అని చూపిస్తూ ఉంటాడు. దానికి వసుధర చాలా బాగుంది అని అంటున్నా. సరోజ వసుధారతో మేడ ఊరు అటుంది ఇటు చూస్తున్నారు అని అంటుంది. అప్పుడు వసుధార చూడాల్సిందే చూస్తున్నాను అంటూ రాంగానే చూస్తూ ఉంటుంది. దానికి వసుధారా మీ పని మీరు చూసుకోండి అని సరోజని అంటుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతుంటుంటే దానికి రంగా కొంచెం సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. నా మీదికి అరుస్తున్నావా అని సరోజ వాళ్ళ భావాన్ని అంటుంది. ఇంతలో రంగా మేడం గారు అటువైపు చెరువు ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. దానికి సరోజ వెళ్లి చూపించు బావా, తను అడిగితే ఆ చెరువులో ఉన్న కల్వ పూలు కూడా కోసివు అని అంటుంది. అప్పుడు రంగా తను కూసివమంటే కోసిస్తాను అని అంటాడు. అప్పుడు సరోజాకి కోపం వస్తుంది. ఆటోలో రంగా వసుధార మేడంని వసుధార రాంగానే చూస్తూ ఉంటారు. అప్పుడు రంగా మేడం గారు మీరు ఎటో చూస్తున్నారు నేను ఊరు చూపిస్తున్నాను అని అంటాడు దానికి తోడుగా సరోజ కూడా నేను కూడా అదే చెప్తున్నాను బావ అని అంటుంది. దానికి రంగా మీరు ఎలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది మేడం అంటాడు. దానికి వసుధారా మేడం నా మనసుకు నచ్చింది చూస్తున్నాను అని అంటుంది. దానికి సరోజ విసుక్కుంటూ, పద బావా ఊరు చూపిద్దాము అని అంటుంది. అసలు తన దృష్టిలో ఊరంటూ ఏంటో మరి అని అంటుంది.
వసుధార ఇక్కడ చెట్టు ఉంది చూడు, అని సరోజ చెప్తుంది. అప్పుడు వసుధర అవును చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది. అని ఇలా చెప్తూ ఉంటే సరోజ కి వసుధారకి పొడవయ్యి సరోజ మధ్యలోనే దిగిపోతుంది. దానికి రిషి చాలా దూరం వచ్చాము ఎలా వెళ్తావు అని అడిగితే నాకు ఈ ఊరేం కొత్త కాదు ఎలాగైనా వెళ్తాను. వెళ్తుంటే వసుధార జాగ్రత్త అని చెప్తుంటే వసుధార మీద కోపంతో నువ్వేంటి నాకు జాగ్రత్తలు చెప్పేది అనుకుంటూ వెళ్ళిపోతుంది. సరోజ దిగగానే ఆటోలో వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు.
సరోజ అక్కడ దిగగానే వసుధారణ వెతుకుతున్నా రౌడీలు వచ్చి తనకి వసుధార ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. అప్పుడు సరోజ చూశాను ఇప్పుడే ఆటోలో వెళ్లిపోతుంది అని అంటుంది. అయినా ఈ అమ్మాయి తో మీకేంటి పని అని అడుగుతుంది. అప్పుడు వాళ్లు నేను తన మామయ్య అని ఆ రౌడీ చెప్తాడు తను ఎక్కడుందో చూపించమని వాళ్ళు తనని అడిగితే నాకు తెలుసు నేను చూపిస్తా అని అంటే, అప్పుడు ఆ రౌడీ నువ్వు చూపించు నీకు ఫుల్ కూడా ఇస్తాను అని అంటాడు. అప్పుడు సరోజ నేనే మీకు దారి ఖర్చులకి ఇస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళుతుంది. ఇక్కడ ఆటోలో వెళ్తున్న రంగాన్ని వసుతారా ఆటో ఆపమని అంటుంది. ఎందుకు అని రంగా అడిగితే నాకు కొబ్బరి బొండం తాగాలని ఉంది. ఇలా అనగానే రంగా వర్షాకాలంలో కొబ్బరిబోండాలు ఎంటి మేడమ్ అని అంటాడు.
Guppedantha Manasu Serial Today Episode
అప్పుడు వసుధార నేను ఏ కాలమైనా సరే కొబ్బరి బొండం తాగుతా అని అంటుంది. అప్పుడు రంగ ఆటో ఆపుతాడు. అప్పుడు రంగ డబ్బులు ఉన్నాయా మరి అని అడుగుతాడు. దానికి వసుధారా మీ దగ్గర ఉన్నాయి కదా సార్ అని అంటుంది. రండి సార్ అని ఇద్దరు ఆటో దిగుతారు. కొబ్బరి బొండాల షాప్ దగ్గరికి వెళ్లి వసుధార అన్నా రెండు కొబ్బరి బొండాలు ఇవ్వండి అని అంటుంది. అప్పుడు రంగ నాకేం వద్దండి అని అంటాడు. అప్పుడు వసుధార ఎందుకు అని అడిగితే, రంగా నాకు టీ తాగడం ఇష్టం అని అంటాడు. అప్పుడు వసుధారా ఒకసారి కొబ్బరి బొండం తాగి చూడండి అని అంటుంది. దానికి రంగా నాకు వద్దు అంటున్నా కానీ, వసుధార తీసుకోండి సార్ అని బలవంతం చేసి తాగమంటుంది. వసుధారకి తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది కొబ్బరి బోండాతో స్పూన్ చేసుకొనే దానిలోని కొబ్బరిని తిన్నట్టుగా అతని చూస్తూ ఊహించుకుంటూ ఉంటుంది.
అలా చూస్తూ ఉండడంతో రిషి చాలా ఇబ్బంది పడుతూ ఏంటి మేడం అని అడుగుతాడు. దానికి వసుధారా ఏం లేచారా అని అంటూ దాంట్లో ఉన్న ఉపయోగాల గురించి రంగాకి చెప్పడం మొదలు పెడుతుంది. ఇలా చెప్తూ ఉంటుంటే రంగ అలాగే చూస్తూ ఉంటాడు. కొబ్బరి బోండా లో ఉండే పోషకాలు విటమిన్లు వాటి గురించి అన్ని చెప్తూ ఉంటే, రంగా అంటాడు ఇవన్నీ చెబుతూ ఉంటే నాకు విసుగు వస్తుంది మేడం. ఆ రిషి సార్ ఎవరో గాని మిమ్మల్ని బాగానే భరించారు. అతను మీకు దూరమవ్వడం అతను అదృష్టం అని ఇలా అంటూ , ఉంటుంటే వసుధారకి కళ్ళలో నీళ్లు తిరగడం జరుగుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.
Guppedantha Manasu Serial Today Episode