Guppedantha Manasu Today Episode June 22 వసుధార తన రిషి పై ఉన్న ప్రేమను చూసి రంగా లో పొంగిన ప్రేమ… ఈ కథలో మలుపు

మన రెండు గుండె చప్పుళ్ళు ఒక్కటే వసుధారా అని పద మన ఇంటికి వెళదామని రిషి తన చేయి పట్టుకొని బయల్దేరినట్టు హడావిడిగా వసుధారా డోర్ తీసుకొని బయటకురావాడoతో తన చేయి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడుతుంది అప్పుడు అందరూ ఉలిక్కిపడి లేస్తారు రిషి సార్ అని వసుధార అంటుంది అప్పుడు రంగా వాళ్ళ నాన్నమ్మ అమ్మ వచ్చివసుదారా ఏంటమ్మా ఏదైనా కలగన్నావా అని అడుగుతుంది. రిషి సార్ అని వసుధార అంటుంది అప్పుడు రంగా వాళ్ళ నాన్నమ్మ రిషిసార్ అంటే రంగనే కదమ్మా ఇక్కడే ఉన్నాడు కదా అంటే ఇదంతా నా కల అని వసుధారా తన మనసులో అనుకుంటుంది. అప్పుడు రంగ వాళ్ళ నాన్నమ్మ వసుధారని అమ్మ నువ్వు ఏం ఆలోచించకు నువ్వు వెళ్లి పడుకో అని అంటుంది. రా అని వసుధారని వాళ్ళ నాన్నమ్మ తన గదిలోకి తీసుకుని వెళుతుంది. తన రూము నుండి బయటకు వచ్చిన రంగా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తమ్ముడిని ఏంట్రా సన్నాసి అలా వనికి పోతున్నావు అని అంటుంది.

ఆ పిల్లకి ఏమన్నా దయ్యం పట్టిందేమోనని అని,తనని చుస్తే నాకు భయమేస్తుంది. రాత్రి పూట చితక్కొట్టుడు కొడుతుందేమో? తన రిషి సార్ రిషి సార్ అని అంటుంటే నా గుండె గుబెల్ గుబెల్ మని అంటుంది. రేయ్ ఊరుకోరా సన్యాసి అని వాళ్ళ నానమ్మ తిడుతుంది. దయ్యం లేదు ఏమీ లేదు ఒరేయ్ రంగ ఆ పిల్ల ప్రతిసారి రిషిసార్ రిషిసార్ అని అంటుంది అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్టు ఉంది రా తన భర్త అచ్చం నీలాగే ఉంటాడేమో రా దానికి రంగా కూడా అవును నాలాగే ఉంటాడేమో అని, అనిపిస్తుంది. తను ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. తన కంటే ఎక్కువగా ప్రేమించే భార్య తన జీవితంలో ఉంది. ఆ అదృష్టం అందరికీ దక్కదు. కొంతమందికె ఆ ప్రేమ అదృష్టం దక్కుతాయి నానమ్మ అని రంగ అంటాడు. వాళ్ళ నానమ్మ తో అప్పుడు రంగా వాళ్ళ తమ్ముడు ఏంటన్న నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు అని అంటాడు. కొంపదీసి రిషి సారివి నువ్వేనా అని అడుగుతాడు. అప్పుడు రిషి సార్ ఏ ఏంట్రా నేను రంగాన్ని అని అంటాడు. నేను మా నానమ్మ మనవన్నీ అని రంగా అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ సరే ఇక వెళ్లి పడుకోండి అని అంటుంది. తను కూడా వెళ్లి పడుకుంటుంది.

Guppedantha Manasu

Guppedantha Manasu Today Episode

అక్కడ మనో గారికి ఫోన్ మోగుతుంది ఫోను లిఫ్ట్ చేయగానే ఏంజెల్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ విషయము మాట్లాడాలి అని అంటుంది దానికి మను ఈ టైంలో నా కుదరదు.దానికి ఏంజెల్ ప్లీజ్ ప్లీజ్ బావ అని అంటుంది. అంత దూరం నేను రాను నువ్వు రావద్దు అని అంటాడు. అంత దూరం నేను రాను అని అంటాడు ఎంత దూరం అవసరం లేదు మీ ఇంటి బయటే ఉన్నాను వస్తే కనిపిస్తాను అని అంటుంది. మనో బయటకి వెళ్ళగానే కారు దిగి హాయ్ అని చెప్తుంది. ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయం అని మనం అడుగుతాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని ఉంటుంది. దానికి మనో ఒక రకంగా చూస్తూ ఇది ఇంపార్టెంట్ విషయమా అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని అంటాడు. దానికి ఏంజెల్ బానే కనిపిస్తున్నావు మంచి హెయిర్ స్టైల్, మంచి ఫిజిక్, డ్రెస్సింగ్ సెన్స్ బానే ఉంది. చాలా బానే మెయింటైన్ చేస్తున్నావు. చాలా బానే కనిపిస్తున్నావు అని అంటుంది అప్పుడు దానికి మనో జోకులు వేయకుండా ఉంటే జోకులు కాదు సీరియస్ గానే అంటున్నాను నాకు ఐస్ క్రీం కావాలి అని, దానికి నేనేం ఏం చేయాలి అంటాడు .

అప్పుడు మనో డబ్బుల్లేవా డబ్బులు ఇస్తాను అని జేబులో చేయి పెట్టి డబ్బులు ఇవ్వబోతాడు. మరి అంత జోక్స్ వేయకు అని, మనం నేను కాదు జోక్స్ వేసేది నువ్వు మంచి టైంలో వేస్తావు జోక్ అని అంటాడు.బావ ప్లీజ్ వస్తే ఇద్దరం కలిసి తిందాము అని ఏంజెల్ అంటుంది. దానికి మనో నాకు తినాలని లేదు అని అంటాడు అప్పుడు ఏంజెల్ తినాలని లేకపోతే వచ్చి నాకు కంపెనీ ఇవ్వు అని అంటుంది. ఎదురుగా కూర్చుని ఉంటే నేను ఐస్ క్రీమ్ తింటాను. దాని మనో నేను ఖాళీగా ఉన్న ఎదుటివారి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేను చూడలేను నాకు ఇబ్బందిగా ఉంటుంది. దానికి ఏం చేయాలో అయితే నువ్వు నన్ను చూడకు దిక్కులు చూస్తూ ఉండు అంటుంది. నేను నిన్ను చూస్తూ ఐస్క్రీమ్ తింటాను. అని ఏంజెల్ అంటుంది. నేను ఇప్పుడు రాను అని మనో లోపలికి వెళ్తుంటే తన చేయి పట్టుకుని ఇప్పుడు నువ్వు రాకపోతే ఏం చేస్తానో తెలుసా అని ఏంజెల్ అంటుంటే దానికి మనం ఏం చేస్తావ్ అలుగుతావా, బుంగమూతి పెడతావా లేదంటే వెళ్ళిపోతావా ఏమి చేయలేవు కాలి చేతులతో ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా వచ్చిన పనిని కంప్లీట్ చేయకుండా వెళ్లిపోయేది ఏంజెల్ కాదు. నిన్ను ఎత్తుకెళ్లిపోతా అని ఏంజెల్ అంటుంది. లాస్ట్ కి సరే నాతో వస్తావా లేదా అని ఏంజెల్ అడిగితే మనో నేను రాను అని అంటాడు దానికి ఏం చేయాలి చూడు నువ్వు ఎలా రావో చెప్తా అని వాళ్ళ అత్తయ్యని ను అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. దానికి మనో ఇప్పుడు ఆ మేడం ని ఎందుకు పిలుస్తున్నావు అని అంటాడు .

Guppedantha Manasu Today Episode june 22

కానీ గట్టిగా ఏంజెల్ అత్తయ్య అత్తయ్య అని పిలవడం మొదలుపెడితే మనో దానికి ఆగు వస్తానని అని చెప్తాడు . దానికి ఏంజెల్ నవ్వుతూ అది ఏంజెల్ అంటే అని, అనుకున్నది సాధిస్తుంది అని కార్ తీసుకోని వెళ్తారు. దానికి మనసులో మనో రాక్షసి అని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. తనే తీసుకొచ్చాను ఇష్టం లేదన్న ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాను కదా బావ. నీ జీవితం గురించి ఒక క్లారిటీ వచ్చిందా అని ఏంజెల్ మనో తో అంటుంది దానికి మనో నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది . అదంత నాకు తప్ప ఎదుటి వారికి నా జీవితం అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడా అయినా ఎందుకు ఆ విషయం అడిగావు అని మనో అంటే ఏంజెల్ ఏదో తెలుసుకోవాలనిపించింది . అని చెప్పి ఏంజెల్ మనోతో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు అని ముందు నేను చెప్పేది విను బావ అని అంటుంది.సరే ఏంటో చెప్పు అని మనో అంటున్నా డు దానికి ఏంజెల్ విశ్వం నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని చెబుతుంది.

అప్పుడు మను చేసుకోవచ్చు కదా అని అంటాడు. దానికి ఏంజెల్ నాకు పెళ్లంటే ఇష్టం లేదు అసలు పెళ్లి చేసుకోవాలనే ధ్యాస కూడా లేదు కానీ విశ్వం కోసం నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అనిపించింది నాకు సరైన జోడిరిషి అని. ఈ విషయం విశ్వానికి చెప్పేశాను తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత తెలిసింది రిషి వసుధారా పెళ్లి చేసుకున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. వాళ్ళ ప్రేమ విషయం నా దగ్గర దాచినందుకు చాలా గిల్టీ గా ఫీల్ అయ్యాను తెలుసా కొన్ని రోజులైతే చాలా కోపంగా ఉన్నాను అని ఏంజెల్ లి అంటుంది. అప్పుడు మనో సరే కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు అప్పుడు ఏంజెల్ తర్వాత నాకు ఇవన్నీ చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతావు కదా అని అంటుంది. దానికి నేను ఎందుకు ఫీల్ అవుతానని మనో అంటాడు. బావ నాకు ఇరిటేట్ తెప్పించకు అసలు మట్టిబుర్ర అనుకుంట నీది ఇంత చెప్పినా కూడా నీకేం అర్థం కావట్లేదా? నన్ను ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత తీరికగా కూర్చొని నేను ఇదంతా నీకెందుకు చెప్పాను అని ప్రశాంతంగా ఆలోచించుకో అప్పుడు అర్థమవుతుంది అని పో బావ అని ఏంజెల్ బుంగమూతి పెడుతుంది దానికి మనో నవ్వుతూ ఐస్క్రీం తింటుంటాడు.

ఇంతలో అక్కడ కాలేజీలో స్టూడెంట్స్ అందరు కలిసి వి వాంట్ జస్టిస్ టిస్ అని అరుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి మహేంద్ర ఆపుతూ వస్తాడు ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అని అడిగితే, మాకు న్యాయం కావాలి అని స్టూడెంట్స్ అంటారు. ఏం కావాలి మీకు అని అంటే శైలేంద్ర మాకు ఎండి కావాలి అని అంటారు. వి వాంట్ శైలేంద్ర సార్ వి వాంట్ శైలేంద్ర సార్ అని అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. ఇంతలోనే మనో కూడా వస్తాడు శైలేంద్ర కూడా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈ దృశ్యం అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర వీళ్లంతా కాలేజ్ స్టూడెంట్స్ కాదు వీళ్ళందర్నీ శైలేంద్రే అరేంజ్ చేసినట్టు ఉన్నాడు. అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో శైలేంద్ర చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఈ సీను కొంచెం రసవత్తరం చేద్దామని రంగంలోకి ఎంట్రీ అయ్యి ఆగండి ఆగండి అరవకండి మీరు ఇలా అరిస్తే క్లాసులు డిస్టర్బ్ అవుతాయి. అని శైలేంద్ర అంటాడు. అప్పుడు స్టూడెంట్స్ మీరే మాకు ఎండి కావాలి సార్ అని నినాదాలు చేస్తూ ఉంటారు శైలేంద్ర మీరు గొడవ చేయొద్దు రోడ్డెక్కి ర్యాలీ చేయకండి. అని హింట్ ఇస్తూ ఉంటాడు. మన కాలేజీ పరువు పోతుంది మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకున్నాక చెప్తుంది కదా. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నారు చెప్తారు కదా అని శైలేంద్ర అంటాడు అప్పుడు స్టూడెంట్స్ మీరే మాకు ఏం డి కావాలి సార్ అని అంటుంటారు.

Guppedantha Manasu Today Episode

మా భవిష్యత్తు బాగుంటుంది అని స్టూడెంట్స్ అంటారు. మీరు ఇలా చేయకండి బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని శైలేంద్ర స్టూడెంట్స్ తో చెప్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అలాగే నినాదాలు చేస్తూ ఉంటారు. శైలేంద్ర సార్ ఎండి కావాలి శైలేంద్ర సార్ ఎండి కావాలి అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఇంతలో మనో లాస్ట్ స్టూడెంట్ ని అరే మీరు ఇవన్నీ చేయడానికి మీకు ఎంత డబ్బులు ఇచ్చారు అని అడిగితే నాకు 200 రూపీసె ఇచ్చారు సార్ అని చెప్తాడు. మిగతా వాళ్లకి ఎక్కువిచారని మనో తనకి చెప్పగానే వాడు ముందుకెళ్లి ఆగండి నాకు 200 లే ఇచ్చారు అందరికీ 500 ఇచ్చారు అని అడుగుతాడు . వాడు దానికి శైలేంద్ర రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా అని అంటాడు. దానికి వాడు రేయ్ మనని మోసం చేస్తున్నారు రా కొంతమందికి 500 ఇచ్చారు. కొంతమందికి 200 ఇచ్చారు వీడు పెద్ద మోసగాడిలా ఉన్నాడు రా పోదాం అని స్టూడెంట్స్ అక్కడినుండి వెళ్ళిపోతారు. రేయ్ ఆగండి ఆగండి అని శైలేంద్ర వాళ్ళని అంటుంటాడు దానికి మహేంద్ర మనో ఇద్దరూ కలిసి నవ్వుతూ శైలేంద్ర MD అని నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు శైలేంద్ మొహం కోపంగా పెట్టుకొని చూస్తాడు. ఇంతలో అసలైన ఒరిజినల్ స్టూడెంట్స్ వస్తారు ఏంటి సార్ గొడవని అంటారు. అప్పుడు మనో మీకు శైలేంద్ర సార్ ఎండి గా ఉండడం ఇష్టమేనా అని అడుగుతాడు అప్పుడు స్టూడెంట్స్ శైలేంద్ర సారా ఆయనకేం తెలుసు ఆయనకి ఎండి అయ్యే అర్హత ఉందా? అవును సార్ మాకు తెలిసినంత కూడా సార్ కి తెలియదు అని అతను MD ఏంటి సార్ మాకు మీరే ఎండి కావాలి అని మనో సార్ తో స్టూడెంట్స్ అంటారు. దానికి మనం సరే సరే మీరందరూ క్లాస్ లోకి వెళ్ళండి. అని స్టూడెంట్స్ కి చెప్తాడు. ఓకే సర్ అని స్టూడెంట్స్ క్లాస్ లలోకి వెళ్ళిపోతారు. మహేంద్ర అంటాడు ఇంత పిచ్చిగా దిగజారి పోయావురా బయట వాళ్ళను పురమాయించి ఇలా గొడవ చేసావని మీ డాడీకి చెప్తాను అని అంటాడు. అప్పుడు శైలేంద్ర వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ అని బ్రతిమిలాడుతాడు.
లేదురా నేను చెప్తాను లేకపోతే నువ్వు ఇంకా రెచ్చిపోతావు అని అంటాడు. అప్పుడు శైలజ లేదు బాబాయ్ ఇంకెప్పుడు ఇలా చేయను అని ప్లీజ్ బాబాయ్ నీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర తప్పులు చేయడం తప్పులు చేశాక కాళ్ల వేళ్ళ పడడం నీకు అలవాటే కదా ఇప్పటికైనా మారు అంటూ మహేంద్ర ,మనో లోపలికి వెళ్తారు.

Guppedantha Manasu Today Episode june


మనో క్యాబిన్లోకి ఏంజెల్ హాయ్ బావ అంటూ వస్తుంది. Good Morning అంటూ వచ్చి కూర్చుంటుంది . విష్ చేస్తే తిరిగి విష్ చేయాలనీ తెలవదా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్తుంది. సరే గుడ్ మార్నింగ్ అని మనో చెప్తాడు. ఏదో కుక్కకు బిస్కెట్ పారేసినట్టుగా నేను అడిగాక చెప్తున్నావా అని అంటుంది . సరే నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు అని అంటాడు మను నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి ఇస్తావా ఇవ్వగలవా అని ఏంజెల్ మనోని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు అని మనో తనని అడిగితే నిన్ను బయటకు తీసుకెళ్లాలి అని చెప్తుంది. ఆఫీస్ టైం లో బయటికి వెళ్లడం ఏంటి నేను రాను. చాలా పెండింగ్ ఫైల్స్ చూస్తున్నాను వర్క్ ఉంది అని చెప్తాడు. అప్పుడు ఏంజెల్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నావ్ కదా పెండింగ్ ఫైల్స్ పెండింగ్ లోనే పెట్టు అని అంటుంది. పదా వెళ్దామని అంటుంది ఏంజెల్ దేనికి అని మనో అడిగితే దానికి ఏంజెల్ బజ్జిలు తినడానికి అని చెప్తుంది. దానికి మనో నిన్న night ice cream ఇప్పుడు బజ్జిలా అని అంటూ నాకు బజ్జిలు తినాలని లేదు అంటాడు. దానికి ఏంజెల్ నువ్వు తినకు నాకు company ఇవ్వు అని లాక్కెళ్తుంది. ఇదంతా చుసిన శైలేంద్ర చప్పట్లు కొడుతూ వావ్ వాటే రొమాంటిక్ సీన్ అని కాలేజీ లో ఐడెమ్ పని అంటూ, అసలు DBST కాలేజీ అంటే దేవేంద్ర భూషణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ . దేవేంద్ర భూషణ్ అంటే ఎవరో తెలుసా మా తాత గారు , మా కాలేజీలోకి అక్రమంగా చొరబడింది కాకుండా నన్నే వెళ్ళమంటావా అని , మనో గారిమీద శైలేంద్ర కోప్పడుతాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Guppedantha Manasu Today Episode

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Scroll to Top