Horse Gram in Telugu : వీటిని తింటే , ఈ అనారోగ్యాలు అన్నీ దూరం అవుతాయ్..!

Horse Gram in Telugu : వీటిని తింటే , ఈ అనారోగ్యాలు అన్నీ దూరం అవుతాయ్..!

Horse Gram in Telugu : ఉలవలు వీటిని ఎక్కువగా పశువులకు దానగా మాత్రమే పెడతారని చాలా మంది అనుకుంటూ,ఉంటారు. ఉలవలను చాలా తక్కువ మంది మాత్రమే వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు. ఉలవలతో చారు, వలడలు ఇలా చాలా రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు.

Uluvalu in Telugu :ఒక సారి ఉలవచారును టేస్ట్‌ చేస్తే,అస్సలు వదిలి పెట్టం. ఎందుకంటే , ఉలవలలో ఉండే పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్‌ ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కాల్షియం, ఇనుము , పాస్ఫరస్‌, జింక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో Anti-adipogenic, anti-inflammatory, anti-hyperglycemic, anti-hypercholesterolemic లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలం ఉలవలు మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని కొందరి నిపుణులు చెబుతున్నారు.

Horse Gram in Telugu : ఉలవల్లోని కరిగే ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఉలవలు మన ఆహారంలో చేర్చుకుంటే, జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఇది మలబద్ధకం, Gas వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు వైద్యం చేయడంలో సహాయపడుతుంది. ఉలవలు ఆకలిని కూడా పెంచుతాయి. పిల్లలకు ఉలవులను పెడితే మంచిది.

Horse Gram in Telugu : ఉలవల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిక్‌ పేషంట్స్ తరచుగా ఉలవలు తీసుకుంటే మంచిది. దీనిలో ఆల్ఫా-అమైలేస్ ఇన్హిబిటర్‌ ఉంటుంది. ఇది సీరం గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు సహాయపడుతుంది.

ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ కరగడానికి సహాయపడుతుంది. ఉలవలు లితోజెనిక్ పిత్తం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అందుకే ఇది యాంటీలిథోజెనిక్‌గా పని చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకుంటే,శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఉలవలు తరచుగా తీసుకుంటే.. కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కీళ్ల నొప్పులూ, ఎముక సంబంధిత సమస్యలతో భాధ పడే వారూ, మహిళలూ మరియు పిల్లలూ వీటిని కనీసం రెండు చెంచాలైనా తీసుకుంటే, ఒక రోజుకు సరిపడా క్యాల్షియం శరీరానికి అందుతుంది. ఎముకలకు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.

ఉలవల్లో యాంటీ- మైక్రోబియల్‌ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. గ్రామ్-పాజిటివ్, గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది Bacillus subtilis, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియాకు ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది.

నెలసరి సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలు అన్ని చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును కూడా అదుపులో ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.Horse Gram in Telugu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a comment

error: Content is protected !!