ICC World Cup 2023 లో వరుస విజయాలతో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతుంది ఆదివారం న్యూజిలాండ్ తో ధర్మశాల లో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడించి పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉంది, అలాగే ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది అలాగే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో గెలుపొందినందున పాయింట్ల పట్టికలో 5 మ్యాచ్ లు ఆడి అన్ని మ్యాచ్ లలో గెలుపొందినందున 10 పాయింట్ల తో ముందు వరుసలో ఉంది అలాగే ఇప్పటివరకు ముందు వరుసలో ఉన్న న్యూజిలాండ్ జట్టు 8 పాయింట్లతో 2 వ స్థానానికి వెళ్ళింది.
సెమిస్ కి వెళ్లాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి
ఇకపోతే ఈ ప్రపంచ కప్ లో ప్రతి జట్టు వేరే ఇతర జట్టుతో పోటీ పడాల్సి ఉంటుంది, ఒక జట్టు సెమీ ఫైనల్ కి వెళ్లాలంటే కనీసం 6 మ్యాచ్ లైనా గెలవాల్సి ఉంటుంది, ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ లలో టీమిండియా 5 మ్యాచ్ లలో గెలుపొందింది, టీమిండియా సెమీ ఫైనల్ కి వెళ్లాలంటే ఇంకొక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది, ఇంకా టీం ఇండియా ఆడాల్సిన మ్యాచ్ లు 4 మిగిలి ఉన్నాయి కావున ఇందులో ఏ ఒక్క మ్యాచ్ లో గెలుపొందినా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.
భారత జట్టు ఇంకా ఎన్ని మ్యాచ్ లు ఆడనుంది
2019 లో జరిగిన వరల్డ్ కప్ లో 4 మ్యాచ్ లు రద్దు అయ్యాయి, ఈ వరల్డ్ కప్ లో మ్యాచ్ లు రద్దు అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి, భారత్ ఇలాగె జైత్ర యాత్ర కొనసాగిస్తే భారత్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం, ఇంకా భారత్ ఆడే ఆ 4 మ్యాచ్ లు చూసినట్లయితే అక్టోబర్ 29 తారీఖున ఇంగ్లాండ్ తో లక్నో లో, నవంబర్ 2 వ తేదీన శ్రీలంకతో ముంబయి లో , నవంబర్ 5 న సౌత్ ఆఫ్రికాతో కలకత్తా లో , నవంబర్ 12 న నెదర్లాండ్ తో బెంగళూరు లో తలపడనుంది.
ముగింపు
భారత జట్టు ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో దూసుకుపోతుంది, ఈ ప్రదర్శన ఇలాగె కొనసాగితే భరత్ ICC World Cup 2023 గొలుపొందే అవకాశాలు బాగా కనిపిస్తుంది, మరి రోహిత్ సేన ఈ ప్రపంచకప్ గెలుస్తుందో లేదో ఫైనల్ వారికి వేచి చూడాల్సిందే. ఇంకా జరగాల్సిన అన్ని మ్యాచ్ లలో భారత జట్టు గెలుపొందాలని కోరుకుందాము