Indian Railway Rules : ట్రైన్ లలో ఈ రూల్స్ తెలియక చాలా మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో..?

Indian Railway Rules : ట్రైన్ లలో ఈ రూల్స్ తెలియక చాలా మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో..?

Indian Railway Rules: మనం చాలా సార్లు రైళ్లలో ప్రయాణిస్తుంటాం. కానీ ఇండియన్ రైల్వేస్ పెట్టినటువంటి రూల్స్ గురించి మాత్రం చాలా మంది ప్రజలకి తెలిసుండవు. మహిళలు, పిల్లలకు ఎంత భద్రత కల్పిస్తున్నాయో తెలుసా? లగేజీ పరిమితులు, రైలులో ఉన్నప్పుడు ఫోన్ ఎలా వాడాలి? ఇలాంటి వాటిపైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Indian Railway Rules: ఒక స్త్రీ తన బిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తుంటే, అది అబ్బాయి అయినా సరే లేదా అమ్మాయి అయినా రాత్రిపూట రైల్వే స్టేషన్ లో ఒంటరిగా ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ దించకూడదు.ఒకవేళ దింపితే ఆ స్టేషన్ లో సెక్యూరిటీ గార్డ్ కు గాని, రైల్వే సిబ్బందికి గాని ఆమె యొక్క రక్షణ బాధ్యతను అప్పగించాలి. మహిళలు, పిల్లల భద్రత కోసం ఇండియా రైల్వే ఏర్పాటు చేసిన కఠినమైన నియమం ఇది.

మీరు ఎక్కాల్సిన స్టేషన్లో మీరు రైలు ఎక్కలేకపోయారా.. ఏం టెన్షన్ పడకండి. అదే రైలును నెక్స్ట్ వచ్చే రెండు స్టేషన్లలో దేని నుండైనా వీలు మీరు దాన్ని ఎక్కవచ్చు. రైలు మిస్ అయినప్పుడు మీరు కంగారు పడకుండా వెంటనే స్టేషన్ బయటకు వచ్చేసి వేరే వాహనం , కారు గాని, బైక్ గాని తీసుకొని, లేదా మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చిన వారి సాయంతో అయిన తర్వాత స్టేషన్ కు చేరుకొని ట్రైన్ ని పట్టుకోవడం చేయవచ్చు.

ఇండియా రైల్వేలు లగేజీ లేదా వస్తువులను ఎంత తీసుకెళ్లాలో ప్రత్యేక నియమం ఉంది. అదేంటంటే, ఒక మనిషి రైలులో డెబ్భై కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్లకూడదు. కాని ప్రస్తుతం ఒక్కొక్కరూ నాలుగేసి మూటలు, బ్యాగులు తీసుకెళుతుంటారు. వాస్తవానికి ఇది భారతీయ రైల్వే నిబంధనలకు విరుద్ధం. రైల్వే సిబ్బంది మీకు ఫైన్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల రైళ్లో ప్రయాణిాంచేటప్పుడు మీరు అనసవర లగేజీని తీసుకెళ్లకపోవడమే మీకు మేలు.

Indian Railway Rules: మీకు భారతీయ రైల్వేల మిడిల్ బెర్త్ నియమం గురించి తెలుసా? తెలియకపోతే, Middle Berth విషయంలో భారతీయ రైల్వేలో ఉన్న ఈ రూల్ గురించి తెలుసుకోండి. మిడిల్ బెర్త్ సాధారణంగా వెనక్కు జారి ఉంటుంది. దాన్ని ఆనుకొనే ప్రయాణికులు కూర్చుంటారు కదా. మరి ఆ బెర్త్ Book చేసుకున్న వ్యక్తికి నిద్ర వస్తే మరి ఏంటి పరిస్థితి.అని అనుకుంటున్నారా.. దీని కోసమే ఓ నియమం ఉంది. అదేంటంటే, రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు మిడిల్ లో ఉండే బెర్త్ పై నిద్రించవచ్చని అనే రూల్. అంటే మీరు ఉదయం ఆరు గంటల తర్వాత మిడిల్ బెర్త్‌లో పడుకోవడానికి మాత్రం వీలు ఉండదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు లేచి కూర్చోవాల్సిందే.

మన జనాభాలో ఎక్కువ మంది ప్రయాణాల కోసం రైళ్ల పైనేనే ఆధారపడుతూ ఉంటారని, చాలామందికి తెలుసు. ప్రతి ఒక్కరి యొక్క భద్రత కోసం భారతీయ రైల్వేలలో మరో ముఖ్యమైన నియమం కూడా ఉంది. అదేంటంటే మీరు మీ ఫోన్ లౌడ్ స్పీకర్‌ని ఉపయోగించి పాటలు వినకూడదు. మాట్లాడకూడదు. నైట్ 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ ఆడియో లేదా వీడియోలు లౌడ్ స్పీకర్‌ని ఉపయోగించి వినకూడదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున ఈ నియమాన్ని రూపొందించడం జరిగింది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ఇలా ఇబ్బంది పెడితే మీరు ఈ నియమాన్ని చెప్పి, వారిని వారించొచ్చు.

Indian Railway Rules: మీరు ఎక్కువగా రైలులో ప్రయాణించే వారైతే ఈ సమాచారం మీకు యూస్ ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా రైల్వే నిబంధనల ప్రకారం రైల్వేస్టేషన్ లో ఆహార పదార్థాలు, వస్తువులు అమ్మేటువంటి వ్యాపారి ప్యాకెట్ పై ఉన్న MRP ధర కంటే ఎక్కువ ధర వసూలు చేయకూడదు. అలా చేస్తే నేరంగా పరిగణించి, వారికి రైల్వే అధికారులు ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భం ఎదురైతే మీరు వెంటనే రైల్వే సిబ్బందికి కంప్లయింట్ చేయవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me