Lab Technician : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Lab Technician : నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ సర్కారు తాజాగా మరో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌కు అనుమతినిచ్చింది. 1284 పోస్టుల ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరని సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా, 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్యారోగ్య సేవల Recruitment Board Notification విడుదల చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు ఉండగా, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
Lab Technician : ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21 తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు ఉండగా, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయని వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.
ముఖ్యమైన తేదీలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ అప్లికేషన్ 21.9.2024 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేందుకు చివరి తేదీ 5.10.2024 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దరఖాస్తులు సవరణ తేదీలు. 7.10.2024 ఉదయం 10 గంటల నుంచి 8.10.2024 సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్‌లో మార్పలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష 10.11.2024 ఉంటుంది.
వేతనం :
పోస్టును బట్టి వేతనం ఉంటుంది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులకు ఎంపికయిన వారికి నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు వేతనం ఉంటుంది. వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులకు సంబంధించి నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు పే స్కేల్ ఉంటుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులకు గాను నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు వేతనం ఉంటుంది.Lab Technician