పెళ్లి రోజు శుభాకాంక్షలు – Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu

Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu

పెళ్లి అనేది మూడు ముళ్ళు ఏడూ అడుగులతో జీవితాన్ని ప్రారంభించి ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ కష్ట సుఖాలను అనుభవిస్తూ, బరువు బాధ్యతలని గుర్తుచేస్తూ జీవితాంతం నీతో కలిసి జీవిస్తాను అని తెసియజేసే బంధమే పెళ్లి, మరి అలాంటి గొప్ప పెళ్లి రోజును మీ స్నేహితులకు , బందువులకు , శ్రేయోభిలాషులకు ఈ మనసుకి హత్తుకునే Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu శుభాకాంక్షలని తెలియజేయండి.

 Marriage Day Wishes in Telugu

పెళ్లి అనే బంధంతో ఒక్కటై ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ కలకాలం హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. పెళ్లి రోజు శుభాకాంక్షలు .

“మరో వసంతం పూర్తి చేసుకున్న మీ అపురూప జంట మరెన్నో ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.. వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ..”

“భార్యాభర్తల అనురాగానికి ప్రతిబింబాలు మీరు.. అన్యోన్యంగా, ఆదర్శమూర్తులుగా వెలుగొందాలని కోరుకుంటూ ముచ్చటైన మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..”

“సంసారం అంటే ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ .. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ .. సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు .”

“ఆదర్శ ప్రాయం మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట.. పండాలి మీ పంట.. ప్రేమానురాగాలతో ఒక్కటైన మీ అనురాగ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు …”

“ఎన్ని వసంతాలు గడిచినా చెదరని మీ అనురాగ దాంపత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ..”

“మీ వైవాహిక జీవితంలో ప్రేమ. సంతోషం, ఆనందం , ఆప్యాయత సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ..”

“అవధులు లేని మీ ప్రేమానురాగాలకి , ఆప్యాయతలు పంచె మీ అపురూప జంటకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.”

“ఒక్కటైన మీ రెండు మనసులు, మూడుముళ్ల బంధంతో, నాలుగు దిక్కులు ఆశీర్వదించగా, పంచభూతాల సాక్షిగా ఆరు జన్మలు తోడుంటానంటూ ఏడడుగులు వేయగా అష్ట దిక్పాలకులు ఆశీర్వదించగా నవగ్రహాలు నేలపై ఉన్న ఈ పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా పది కాలాల పాటు కలిసుండాలని మనసారా కోరుకుంటూ .. పెళ్లిరోజు శుభాకాంక్షలు..”

“చెరగని ప్రేమకు శ్రీకారంగా.. మమతానురాగాలు పంచె మీ అపురూప జంటకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..”

“మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మీ వైవాహిక జీవితం సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పెళ్లి రోజు శుభాకాంక్షలు .”

“ముచ్చటైన మీ అన్యోన్య జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు ..”

“ప్రేమానురాగాల మీ వైవాహిక జీవితం ఆనందాలతో , సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ .. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.”

“పెళ్లితో ఒక్కటై, ఒకరినొకరు తోడుంటూ, ప్రేమానురాగాలను పంచుకుంటూ, అందరికి ఆదర్శ0గా నిలిచే మీ అపురూప జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు .”

“చిలకా గోరింకల్లా కలిసుంటూ , ప్రేమ అనురాగాలను పంచుకుంటూ ఇలాంటి ఎన్నో వసంతాలను పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ..”

“అంతులేని ఇష్టం , అమితమైన మీ ప్రేమ కలకాలం ఇలాగె సంతోషాలతో హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ..”

“ఒకరికొకరు ఇష్టాంగా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికి ఆదర్శనంగా ఉండే మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు ..”

“అందమైన ఈ జీవితంలో మీ అన్యోన్యమైన జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు .”

Podupu Kathalu in Telugu : పొడుపు కథలు Riddles in Telugu

Moral Stories in Telugu | 5 మోరల్ స్టోరీస్ తెలుగు నైతిక కథలు | short Stories

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me