వన్డే ప్రపంచకప్ 2023 ( ICC Mens World Cup 2023 ) లో శ్రీలంక కు చెందిన స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ మంచి ఫామ్ తో తన అద్భుతమైన performance తో ఆడుతున్నాడు, ఈ రోజు హైదరాబాద్ లో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో సెంచరీ తో చెలరేగాడు, అదే విదంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో తన అద్భుతమైన సెంచరీ తో చెలరేగిపోయాడు , ఈ రోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 65 బంతుల్లోనే 4 సిక్సులు , 13 ఫోర్లతో మెండిస్ తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు.
ఇదే కాకుండా కుశాల్ మెండిస్ వన్డే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన శ్రీలంక ఆటగాడిగా అరుదైన ఘటనను తన పేరిట లికించుకున్నాడు, ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉండేది ఈ సెంచరీ ని 2015 వరల్డ్ కప్ లో 70 బంతుల్లోనే ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడు, తాజాగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓవరాల్ గా 14 ఫోర్లు , 6 సిక్సులతో 77 బంతుల్లోనే 122 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.