Moral Stories in Telugu | 5 మోరల్ స్టోరీస్ తెలుగు నైతిక కథలు | short Stories

కథలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి Moral Stories in Telugu లో చదవడానికి చాలా మంది ఇష్టపడతారు అది పిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఈ నైతిక కథలు ముఖ్యంగా పిల్లల్లో చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని కలిగించి వాళ్ళ మెదడును చురుకుగా పని చేయడానికి దోహదపడతాయి, అందుకే ఇలాంటి కథలని ఎక్కువగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకి ఏదైనా ఉదాహరణ రూపంలో చెప్పదలుచుకుంటే ఇలా కథల రూపంలో చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటారని అలా చెప్తూ ఉంటారు ఇలా చేయడం వలన వారిలో తెలివితేటలు , జ్ఞాపకశక్తి బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాతకాలంలో నానమ్మలు తాతయ్యలు పిల్లలకి ఎన్నో కథలు చెప్పేవారు కానీ ప్రస్తుత కాలంలో అందరూ బిజీ గా ఉండడం వలన పిల్లలకి మోరల్ స్టోరీస్ ఎవ్వరు చెప్పడం లేదు, పిల్లలకి కథలు చెప్పడం వలన వారిలో పఠన శక్తి పెరుగుతుంది అలాగే వారి ప్రేమ అనురాగాలను అందించగలుగుతారు. నిజంగా కథలు చెప్పడం అనేది ఒక కళ మనం ఎక్కడో విన్నదాన్ని చెప్పడం లేదా అప్పటికప్పుడు సృష్టించి చెప్పే కథలు పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి మరి పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపోంచించాలంటే ఎప్పటికప్పుడు వారికి కథలు చెప్తూ ఉండాలి.

Moral Stories in Telugu | మోరల్ స్టోరీస్ తెలుగు నైతిక కథలు | short Stories

#1. సమయస్ఫూర్తి

రాయపురం అనే ఊరిలో గోవిందుడు అనే పల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్నగారు పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి గురించి చెపుతూ తన దగ్గర ఒక చిన్న పెట్టె ఉందని వాళ్ళ ఇంటికెలితే తాను ఆ పెట్టెను నీకు ఇస్తాడని చెప్పాడు అలాగే ఆ పెట్టెను జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మని చెపుతాడు. అప్పుడు తన తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం గోవిందుడు వాళ్ళ నాన్న గారి స్నేహితుడి ఇంటికి చేరుకుంటాడు. అయన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉన్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ.. దార్లో దొంగలు ఉంటారు జాగ్రత్త.. ఈ పెట్టెను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి పంపిస్తాడు, అప్పుడు గోవిందుడు ఇంటికి వెళ్లే క్రమంలో తన తనను వెనకాల నుండి అడుగుల శబ్దం వినబడుతుంది అప్పుడు ఎవరో దొంగ తనను వెంబడిస్తున్నాడని తెలుసుకుంటాడు. అంతలోనే భయపడుతూ కాస్త వేగంగా నడవడం మొదలెడతాడు గోవిందుడు.. ఆ అడుగుల శబ్దం కూడా వేగం పెరిగేసరికి ఎం చేయాలో అర్ధం కాలేదు గోవిందుడికి.. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపిస్తుంది. ఆ నదిని చూడగానే అతడికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నదికి పక్కనే ఉన్న పొదల్లోకి తన దగ్గర ఉన్న వస్తువుల పెట్టెను విసిరేసి నది పక్కన నిలబడి ఉన్నాడు, ” నా పెట్టె నీళ్లలో పడిపోయింది అని గట్టిగా ఏడవడం మొదలెట్టాడు, గోవిందుడి వెనకాల వచ్చిన దొంగ ఆ పెట్టెను ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను తీసిస్తానంటూ నది లోకి దూకి వెతకడం ప్రారంభిస్తాడు. అదే అవకాశంగా భావించిన గోవిందుడు ముళ్ల పొదల్లో ఉన్న తన పెట్టెను తీసుకొని సమయస్ఫూర్తి తో అక్కడినుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు.

నీతి : ఆపద కాలంలో మంచి ఆలోచన తో దొంగ నుండి గోవిందుడు తప్పించుకుని వాళ్ళ నాన్నకి ఆ పెట్టెని అప్పగిస్తాడు.

#2. మొదటికె మోసం

అనగనగా ఒక అడవిలో సింహం, చిరుత పులి ఉండేవి ఆ రెండింటికి వయసైపోవడంతో పెద్ద గా వేటాడలేకపోయేవి ఏదోలా ఉన్నదాంట్లో సరిపెట్టుకునేవి. ఒకానొకరోజు వాటికీ వరుసగా వారం రోజులపాటు తినడానికి ఏమి దొరక లేదు అవి ఆకలితో అలమటించిపోయాయి అదే సమయంలో వాటికి ఒక జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం అన్నది .. మిత్రమా , మనం ఎవరికివారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి కదా .. ఈ సారి వేటాడేటప్పుడు ఇద్దరం కలిసి చెరోవైపు నుండి దాడిచేద్దాం అని చెప్పింది.. దానికి ఆ చిరుతపులి సరేనని ఒప్పుకుంది రెండు కలిసి తెలివిగా వేటాడటం మొదలుపెట్టాయి అప్పుడు ఒక జింక పిల్ల దొరికిపోయింది దానితో ఆ రెండింటి సంతోషానికి అవధులు లేవు అయితే ఆ సింహం ఇలా అంటుంది .. ” కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటగా నాకే వచ్చింది అందుకే ముందు నేనే తినేస్తానని అంటుంది”. దాంతో చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది.. అసలు “అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందుగా నువ్వు తింటే నాకేం మిగల్చకుండా తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడాం కాబట్టి ఇద్దరం కలిసే తిందాం ” అని చెప్పింది అలాగే రెండింటికి మాటా మాటా పెరిగింది. అప్పుడు చిరుత అంటుంది ” నీకు ఇందులో వాటానే ఇవ్వను మొత్తం నేనే తినేస్తా” అని అంటుంది. ఈ గొడవంతా ఓ గుంటనక్క చెట్టుచాటునుండి గమనించసాగింది. అసలే వాటికి వృద్ధాప్యం ఆపైన ఆకలితో అలమటిస్తున్నాయి ఆ రెండు కూడా ఎక్కువ సేపు గొడవపడలేవన్న విషయం దానికి అర్థమైంది. ఆ రెండు గొడవ పడీ పడీ అలసి పోయి గొడవపడ్డాయి. అదే అనువైన సమయం అనుకున్న నక్క గబాలున జింక పిల్లను లాక్కుని పారిపోయింది! . అయ్యో కలిసి పంచుకుని తినకుండా గొడవపడి మన ఆహారాన్ని పోగొట్టుకున్నామే ” అని సింహం, చిరుతపులి బాదపడ్డాయి.

నీతి : జీవితంలో ఉన్నదానితో తృప్తిగా బ్రతకాలి లేదంటే ఉన్నది పోతుంది అని ఈ సింహం , చిరుతపులి కథ ద్వారా తెలుస్తుంది.

#3. సహాయం మంచిదే !

అనగనగా ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో విజేయుడు , అజేయుడు అనే యువరాజులు గురువుగారి వద్ద విద్యాబ్యాసం పూర్తి చేసారు. వారిని తిరిగి రాజ్యానికి పంపించేముందు గురువుగారు వాళ్ళకి ఓ చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నాడు.. అప్పుడు ఇద్దరినీ పిలిచి. ” నాయనలారా , మన ఆశ్రమనానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతులు వారి గుహలు ఉన్నాయి వాటిలో ఒక అమూల్యమైన మరకథమని ఉంది దానిని ఎవరైతే తొందరగా తీసుకు వస్తారో వారే ఈ పరీక్షలో విజేత” అని చెప్పారు గురువుగారు. అప్పుడు ఆ యువ రాజులిద్దరు ఆ గుహలను వెతుక్కుంటూ బయలుదేరుతారు, దారిలో వెళ్తూ ఉండగా వారికీ తీవ్ర గాయాలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అక్కడ ఆగిపోతే ఆలస్యం అవుతుందని అజేయుడు వెళ్ళిపోయాడు కానీ విజేయుడు మాత్రం అక్కడే ఆగి అతనికి సపర్యలు చేసి అతను ఎవరో కనుక్కుంటాడు. ఆ వ్యక్తి కాస్త స్థిమిత పడి వెళ్ళిపోయాక వేజేయుడు మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలెడతాడు, కొంత దూరం వెళ్లిన తర్వాత అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా ఉండడం కనిపించాడు. వెంటనే విజేయుడు ఆ తెగల వారితో స్నేహంగా మాట్లాడి చాకచక్యంగా అజేయుడిని విడిపించాడు.. అంతే కాకుండా విజేయుడిని గుహల దగ్గరికి తీసుకువెళ్లి ఆ మరకథమని ని కూడా ఇప్పించారు. అజేయుడికి ఇదంతా కూడా ఎలా సాధ్యమైందో అర్ధం కాలేదు.. అదే విషయాన్నీ అడిగాడు. అప్పుడు విజేయుడు అన్నాడు” దారిలో మనకు గాయాలతో ఒక వ్యక్తి కనిపించదు కదా ఆ వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో అతడే నాకు వివరంగా చెప్పాడు. ఆలా చెప్పిందాన్ని బట్టి నేను వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను.. వాళ్ళ ద్వారా నే ఆ మణిని కూడా సంపాదించగలిగాను” అని చెప్పాడు. ఎప్పుడైతే పక్కవారికి సహాయం చేస్తే అది మనకు కూడా మంచే అన్న విషయం అప్పుడే అర్ధం అయింది అజేయుడికి.

నీతి : ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా ఎదో రకంగా సహాయం అందుతుందని ఈ కథ యొక్క సారాంశం.

#4. స్నేహమే బహుమతి

సింగనమల అనే అడవిని బాహు అనే సింహం పాలిస్తుండేది, ఆ సింహానికి అనుచరులుగా కాకి, నక్క ఉండేవి, ఒక రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి సింహంతో నక్కతో ఇలా అన్నది.. మన అడవికి దూరంగా ఉన్న ఒక ఎడారిలో ఒక ఒంటెను చూసాను దాన్ని మనం వేటాడగలిగితె మనకు వారం రోజుల పాటు ఆహారానికి ఎలాంటి సమస్య రాదు అని చెప్పింది అలా చెప్పగానే నక్క, సింహం మరియు కాకి ఎడారికి వేట కోసం బయలుదేరాయి ఇంతలో అడవి రానే వచ్చింది అడవిలోకి అడుగు పెట్టగానే సింహం , నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకికి ఒక ఉపాయం వచ్చింది అప్పుడు కాకి ఒంటె దగ్గరికి వెళ్లి ఇలా అంది. మిత్రమా ! మా మంత్రి నక్కని అలాగే మా రాజు సింహాన్ని అడవిలో దించగలవా అని అడిగింది దానికి సరేనన్న ఒంటె నక్కను, సింహాన్ని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తీసుకువచ్చింది, అప్పుడు ఒంటె యొక్క మంచి తనం సింహానికి బాగా నచ్చింది. అప్పుడు సింహం ఒంటెతో అన్నది .. మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అన్నది.. అప్పుడు ఉన్నపలంగా సింహం తీసుకున్న నిర్ణయం నక్కకు, కాకికి నచ్చలేదు.. అప్పుడు వాటికి ఓ ఉపాయం వచ్చింది మహారాజా ! కాళ్ళు కలడం వలన మీరు ఇప్పట్లో వేటాడలేరు అలాగే మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము కాబట్టి మమ్మల్ని తినండి అని సింహం దగ్గర బుకాయించాయి . అప్పుడు ఇవన్నీ విన్న ఒంటె లేదు మహారాజా వాళ్ళని వదిలేయండి నన్ను చంపి తిన్నట్లయితే మీ ముగ్గురికి వారం రోజులకి సరిపడా ఆహారం దొరుకుతుంది అని ముందుకొచ్చి నన్ను తినండి అని అంది.. కాకి మరియు నక్క ఒంటె నుండి ఈ మాటను రాబట్టడం కోసమే ఈ నాటకం ఆదాయాన్ని సింహానికి అర్ధం అయింది. అప్పుడు సింహం తెలివిగా.. నేను చిన్న దాని నుండి మొదలుపెడతాను ఒక్కొక్కరు వరుసగా రండి అంది అప్పుడు కాకిని ముందు రమ్మని పిలిచింది అప్పుడు కాకి తుర్రుమని పారిపోయింది నక్కేమో పరుగున లంఘించింది. అప్పటినుంచి ఒంటె సింహం ఎంతో స్నేహంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించాయి.

నీతి : మంచి స్నేహితులు ఎక్కువగా దొరకరు కాబట్టి మంచి స్నేహితులను ఎప్పటికి వదులుకోకూడదు.

#5. బంగారు నాణెం

రాముడిపెట అనే గ్రామంలో బంగార్రాజు ఉండేవాడు అతనికి యుక్త వయస్సు వచ్చింది, తన మిత్రులు మాత్రం వారికి నచ్చిన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు . బంగార్రాజు కి మాత్రం ఏ పని మీద శ్రద్ధ ఉండేది కాదు , అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్లి కూడా అయింది. తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాల రాజుని అడిగాడు. అప్పుడు తన తండ్రి అన్నాడు ” నువ్వు ఎప్పుడైతే నీ కాళ్ళ పైన నిలబడతావో అప్పుడే నీ పెళ్లి చేస్తాను అని.. ఒక పని చెయ్యి “ఓ బంగారు నాణెం తీసుకువచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను ” అని చెప్పాడు తండ్రి. ” అంతేనా “.. అనుకుంటూ వెళతాడు బంగార్రాజు.. మర్నాడు ధనవంతుడైన తన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఒక బంగారు నాణెం తన తండ్రి చేతిలో పెడతాడు. ” ఈ నాణెం పనికి రాదు అంటూ నదిలోకి విసిరేస్తాడు ముత్యాలరాజు. తన తండ్రి ఎందుకు ఆలా చేసాడో అర్ధం కాలేదు బంగార్రాజు కి, మళ్ళీ కొద్దీ రోజులకి తన తల్లి దగ్గర డబ్బులు అడిగి మరొక బంగారు నాణెం తెచ్చి తన తండ్రి చేతిలో పెడతాడు, ” ఇది కూడా పనికి రాదు” అని నీటిలోకి పడేస్తాడు. తండ్రి చేసిన పనికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు బంగార్రాజు. ఆలా కొద్దీ రోజులు గడిచిన తర్వాత ఓ రోజు బంగారునాణెం తెచ్చి తండ్రి చేతిలో పెడతాడు బంగార్రాజు. ఆ నాణేన్ని ముత్యాలరాజు చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసి చివరికి నీటిలోకి విసురుదామని చెయ్యి పైకి ఎత్తుతాడు. అప్పుడు బంగార్రాజు తన తండ్రి చేతిని పట్టుకుని విసరకండి ఆగండి అని అన్నాడు.. నేను వారం రోజులు కష్టపడి తెచ్చిన డబ్బుతో కొన్న నాణెం అది అని అన్నాడు. అప్పుడు ముత్యాలరాజు చిరునవ్వు నవ్వుతూ… ఈ మాటకోసమే నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని అన్నాడు. ఇంతకుముందు నాణేలను విసిరినప్పుడు నువ్వు ఆపలేదు ఎందుకంటే అవి నువ్వు సంపాదించినవి కాదు కాబట్టి, ఇప్పుడు నీకు డబ్బు విలువ అర్ధం అయింది , కష్టం విలువ ఏంటో తెలిసింది. ఇకపైన నీ కాళ్ళపైన నువ్వు నిలబడగలుగుతావు , నీ భార్య పిల్లల్ని పోషించగలుగుతావు అనే నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు ముత్యాలరాజు..

నీతి : ఏ పని చేయని తన కొడుకుకి కష్టం విలువ ఏంటో తెలిసేలా చేసాడు తన తండ్రి.

Read More Articles

పెళ్లి రోజు శుభాకాంక్షలు – Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu

గుడ్ మార్నింగ్ ఫొటోస్ తెలుగు – Good Morning Images in Telugu

సి విటమిన్ లభించే పదార్థాలు వాటి ప్రయోజనాలు – C Vitamin Foods in Telugu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me