Non stick Pan : నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా….! అయితే క్యాన్సర్ ని కొని తెచ్చుకున్నట్లే….! 2024

Non stick Pan: ప్రతి ఒక ఇంటి kitchen లో బాగా కనిపించేటువంటి వస్తువు ఈ నాన్ స్టిక్ పాన్స్ అనే చెప్పాలి . ఇందులో వండిన కూరలు అడుగు అంటకుండా మరియు మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయని, వీటిలో ఆయిల్ కూడ తక్కువ పడుతుందని, వీటిని ఎక్కువ మంది గృహిణులు ఉపయోగిస్తారు. . కానీ వాటి Cleaning విషయానికి వస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. గరుకుగా ఉండే Scrub తో తోమడం, Steel గరిటెలు పెట్టి గీరడం వల్ల వాటి మీద గీతలు పడటంతో ,వాటి పై పెయింట్ పోవడం జరుగుతుంది. అయితే ఏమైందిలే బాగానే పని చేస్తుంది కదా, అని మార్చకుండా వాడుతూ ఉంటారు. కానీ దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, Indian American Doctor Poonam Desai హెచ్చరిస్తున్నారు. గీతలు పడిన నాన్ స్టిక్ లేదా సిరామిక్ పాన్ ఎందుకు వాడకూడదు అని, వివరిస్తూ ఆమె ఇటీవల social media వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.

Nonstick Pan:

గీతలు పడిన pan మీద మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్ ఉంటాయని, అవి ఆహారంలోకి చాలా సులభంగా చేరడం జరుగుతాయి. మైక్రోప్లాస్టిక్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు అని అర్థం. ఇవి 5 millimeter ల కంటే చిన్నగా ఉంటాయి. కంటికి కనిపించవు. ఈ Plastic particles మన శరీరం లోకి దుస్తులు, గృహోపకరణాల ద్వారా ఇవి ఎక్కువగా చేరతాయి. మనకు తెలిసో, తెలియకనో అవి శరీరంలో చేరి ఆరోగ్యానికి చెడుని కలిగిస్తున్నాయి. అందుకే వంటల కోసం తను కాస్ట్ ఐరన్ లేదా Stainless steel పాత్రలు ఉపయోగిస్తున్నట్టు ఆమె చెప్తున్నారు.

Non stick Pan:

ఈ నాన్‌స్టిక్ తవా లేదా కడాయిలు కిచెన్‌లో ముఖ్య వస్తువులగా మారిపోయాయి. వీటిని ఎక్కువగా restaurant లలో కూడా దోశలు క్రిస్పీగా, మృదువుగా వచ్చేందుకు వాడతారు. అయితే, వీటిని వాడడం వరకూ ok కానీ, కొన్ని రోజులకి వాటిపై ఉన్న లేయర్ పోయి చూడ్డానికి కూడా బాగోవు. అలాంటి pans ని వాడకపోవడమే మంచిది. అలా లేయర్ పోకుండా , ఇవి ఎక్కువ రోజులు ఉపగోగపడాలంటే కొన్ని tips పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడాన్ని చాలా మంది ఇంట్లో ఇది చాలా Common అయిపోయింది. అయితే, వీటిని శుబ్రపరిచేటప్పుడు మాత్రం చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర గిన్నెల్లాగా వీటిని క్లీన్ చేయకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే వాటిపైన ఉన్న కోటింగ్ అనేది ఎగిరి పోతుంది. కాబట్టి అలా కాకుండాఆ కోటింగ్ వెళ్లిపోకుండా కొన్ని Tips ని ఫాలో అవ్వండి.

నాన్ స్టిక్ use చేసేటప్పుడు నూనెను వాడొద్దొని చెబుతారు. కానీ, మీరు కొద్ది మొత్తంలో ఆయిల్ ని వాడొచ్చు. కొంచెం ఆయిల్ తీసుకుని అన్ని వైపులా రుద్దాలి . ఆ తర్వాత cloth తీసుకుని బాగా తుడిచిన తర్వాత దోశను వేసి , దాని కాల్చండమే. అంతే క్రిస్పీగా డోస్ రెడీ అవుతుంది.

వీటిని వాడేటప్పుడు మెటల్ స్పూన్స్, కత్తులని వాడొద్దు. షార్ప్ గా ఉండేటువంటి కత్తులని వాడడం వల్ల నాన్ స్టిక్ తవాపై లేయర్ పోతుంది. కాబట్టి, ఈ ప్యాన్స్‌పై చెక్క స్పూన్లు లేదా సిలికాన్ spoons ని వాడండి.

అదే విధంగా నాన్ స్టిక్ తవా కొనుక్కొని వాడేటప్పుడు దానిని సబ్బు నీటితో శుభ్రం చేయాలి. . తర్వాత మెత్తని స్పాంజితో క్లీన్ చేయండి. ఇది మొత్తం ఆరిన తర్వాత శుబ్రపరచాలి. చేలి. Non stick pans తక్కువ మరియు medium వేడికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ వేడి సెగ మీద ఉంచడం సరి కాదు.

అదే విధంగా ఈ ప్యాన్స్ లలో టమాటలు, నిమ్మకాయల వంటి పుల్లటి ఆహారాలు వండకపోవడమే మంచిది. ఇవి నాన్ స్టిక్ తవా బేస్‌ని నాశనం చేస్తాయి. నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో అధికంగా ఉండేటువంటి ఆమ్లాలు గల ఆహార పదార్థాలను వండకపోవడమే మంచిది. ఎందుకంటే, అవి Cookingware Enamel ని తొలగిస్తాయి.

అంతే కాకుండా వంట గదిలో లో ఈ పాత్రలని ఉంచే చేసే స్థలం కూడా సరిగ్గా ఉండాలి. పదునైన అంచులు ఉన్న కంటెయినర్ మధ్యలో వీటిని పెట్టొద్దు. వీటన్నింటి సపరేట్ ప్లేస్‌లో పెట్టండి. ఇవి నాన్ స్టిక్ ప్యాన్స్‌పై గీతలు పడకుండా చేస్తుంది.

అదే విధంగా వీటిని వండిన వెంటనే నీటిలో వేయొద్దు. ఇది వేడి తగ్గి చల్లగా అయినా తర్వాత అందులో నీరు పోసి ,శుభ్రపరచుకోవాలి. . ఇలా చేస్తే ఆ ప్యాన్ కోట్ పోదు. ఎక్కువ రోజులు ఉంటుంది.

Non stick Pan:

Microplastics are endocrine disruptors, అనే హార్మోన్ అసమతుల్యత, సంతానోత్పత్తి సంబందించిన సమస్యల్ని కలిగిస్తాయి. cancer ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సిరామిక్ పాన్ అడుగున Aluminum layer ఉంటుంది. ఇది ఆహారంలోకి చేరుతుంది . అందుకే సిరామిక్ పాన్ లో వంట చేయకపోవడమే మంచిది. . పాన్ మీద గీతలు, Paint పోయినట్టు అనిపిస్తే వెంటనే వాటిని ఉపయోగించకూడదని డాక్టర్స్ సూచిస్తున్నారు. వంట కోసం ఎప్పుడు Stainless స్టీల్ లేదా Cast iron pan లు ఉపయోగించడం ఉత్తమమైన మార్గం.ఇవి ఆహారంలోని పోషకాలని నిలుపుతాయి.

Non stick Pan:

వంట చేసేటప్పుడు ఆహారం సరిగా ఉడికడానికి pan కు టెఫ్లాన్ తో పూత పూస్తారు. నాన్ స్టిక్ లేయర్ కోసం Heat proof cells are per and polyfluorinated పదార్థాలు ఉపయోగిస్తారు. ఇవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరిపోతాయి. దీని వల్ల Endocrine వ్యవస్థ దెబ్బతింటుంది. Endocrine అనేది శరీరం అంతటా గ్రంథులు సరిగా పని చేసేలా చేస్తుంది. hormone ల విడుదల ద్వారా శరీరాక విధుల్ని సరిగా చేస్తుంది. కానీ ఈ Microplastics చేరడం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ pan లు ఉపయోగించడం వల్ల Liver cancer వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గతంలోనే హెచ్చరించారు.


ఈ నాన్ స్టిక్ పాన్ లయొక్క ధరలు కూడా కొంచం ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో కంపెనీ ని బట్టి కూడా price లు ఉంటాయి. వీటిని ఎక్కువ నాణ్యత వున్నవే కొనుక్కోవాలి . కాబట్టి మంచి కంపెనీవి ఎన్నుకొని కొనుక్కోవడం మంచిది.

పలు అధ్యయనాలు, పరిశోధనలు, Health Journals నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం మాత్రమే ఇక్కడ యథావిధిగా అందచేయడం జరిగింది . ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు తప్పక డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు మా Teluguvanam.com ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me