పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు – తెలంగాణ, AP ,లో ఖాళీల వివరాలు మరియు చివరి తేదీ ఎప్పుడంటే..? Postal Recruitment 2024.
Postal Recruitment 2024. పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దింట్లో భాగంగానే, AP , తెలంగాణలో కూడా ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తు అప్లై చేసేందుకు October 31ని చివరి తేదీగా నిర్ణయించారు. https://ibpsonline.ibps.in/ippblsep24/ ఈ లింక్ పై క్లిక్ చేసి,అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 31 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు Indian Postal Payment Bank నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణల్లో మొత్తం 23 పోస్టులు..
ఎగ్జిక్యూటివ్ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Postal Recruitment 2024. ఈ పోస్టులకు గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) ఉద్యోగం చేస్తున్నవారు, అలాగే ఏదైనా గ్రాడ్యూషన్ (రెగ్యూలర్, డిస్టెన్స్) అర్హత కలిగిన రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థికి విజిలెన్స్, ప్రవర్తనకి సంబంధించిన ఎటువంటి కేసులు పెండింగ్‌లో ఉండకూడదు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే, 2024 October 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్ల వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు ఐదేళ్ల, OBC అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం…జీతభత్యాలు…
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగానే డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు రూ.30,000 వేతనం లభిస్తుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయడంతో ఎటువంటి ఇతర బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు చేసే విధానం…
Postal Recruitment 2024.దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. Online లో రూ.750 Fees చెల్లించి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అప్లై చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ link https://ibpsonline.ibps.in/ippblsep24/ అందుబాటులో ఉంది. ఈ డైరెక్ట్ లింక్‌లోకి వెళ్లి దరఖాస్తును చేసుకోవచ్చు.