Pradhan Mantri Awas Yojana 2024 : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం… ఉచితంగా సొంత ఇంటి కల నెరవేర్చుకొండి…!

Pradhan Mantri Awas Yojana 2024 : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం… ఉచితంగా సొంత ఇంటి కల నెరవేర్చుకొండి…!

Budget 2024 PMAY Allocation : ప్రధానమంత్రి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి బడ్జెట్‌‌లో భారీగా కేటాయింపులు జారీ చేశారు. రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశలో ప్రకటించారు.
ఆర్థిక మంత్రి ఐనా నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ 2024-2025 ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) స్కీం క్రింద పట్టణ ప్రజలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు గృహనిర్మాణంపై దృష్టిని అనుసరించి రూ. 10 లక్షల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ‘Pradhan Mantri Awas Yojana 2024 (PMAY) అర్బన్ 2.0 క్రింద ఒక కోటి పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల గృహ అవసరాలకు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో పరిష్కరిస్తాం.’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లను కొనుగోలు చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం మీకు భారీగా గృహ రుణ రాయితీలు అందిస్తోంది. తక్కువ సంపాదన ఉన్నవారు, పట్టణ పేదలు, గ్రామీణ పేద ప్రజలకు సరసమైన ఇండ్లను అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు.

అందరికీ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో వడ్డీ రాయితీ పైన కొంత ఉపశమనం కూడా అందించాలని యోచిస్తున్నారు. Pradhan Mantri Awas Yojana 2024 క్రింద భారతదేశంలోని గ్రామీణ, పట్టణ నగరాలలో 3 కోట్ల అదనపు ఇండ్లను ప్రకటించారు. అందుకు అవసరమైన కేటాయింపులు జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
Pradhan Mantri Awas Yojana 2024 : మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం(PMAY) ఒక్కటి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కార్యక్రమం క్రింద కోటి మంది పేద పట్టణ, మధ్య తరగతి కుటుంబాల ఇండ్ల నిర్మాణ అవసరాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది.

Pradhan Mantri Awas Yojana 2024 : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం… ఉచితంగా సొంత ఇంటి కల నెరవేర్చుకొండి…! 2015లో ఈ పథకనన్ని ప్రారంభించడం జరిగింది. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఇంకా చేరేలేదు. ప్రభుత్వం ప్రకారం PMAY స్కీం (PMAY-U) క్రింద 118.64 లక్షల గృహాలు జారీ చేసింది. ఇప్పటివరకు 86.04 లక్షల ఇండ్లను పూర్తి చేసి ప్రజలకు అప్పగించారు అన్న రికార్డులు వున్నాయి. ప్రభుత్వం 2016లో (PMAY-G) స్కీం ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క లక్ష్యంతో గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, March 2024 నాటికి 2.95 కోట్ల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నది. 2024 february నాటికి 2.94 కోట్ల గృహాలను మంజూరు చేశామని, అందులో 2.55 కోట్ల గృహాలను 2024 february నాటికి పూర్తి చేశామని పేర్కొంది.
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్ళు ప్రకటించారు. దీనికి అవసరమైన కేటాయింపులు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు బడ్జెట్ 2024 సమావేషాల్లో తెలియజేసారు.

త్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీం జూన్ 25 2015లో ఈ పథకనన్ని ప్రారంభించడం జరిగింది. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం క్రింద గృహం లేని వారికీ .. ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలను కల్పించింది. ఐతే ఈ పథకం పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. మీకు ఆ అర్హతలు ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ లో కనుగొనవచ్చు. లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో తెరిచి చూడవచ్చు. ఈ స్కీం కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ పథకం ద్వారా మీరు ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలను కల్పించింది. కాబట్టి మీ సొంత ఇంటి కళను ఈ స్కీం ద్వారా మీరు నిజం చేసుకోవచ్చు.

  • గృహం లేని కుటుంబం అయివుండాలి. ఒకటి లేదా రెండు గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు ఈ స్కీం కి అప్లై చేసుకోవచ్చు.
  • 25 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం. →16 నుండి 59 సంవత్సరాల వయస్సులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం అయి ఉండాలి.
  • సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు, మరియు వికలాంగ సభ్యులు ఉన్నవారు.
  • జగ భూమిలేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం తీస్కుంటున్నవారు.
  • షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు కులాలు.
  • దరఖాస్తు చేసుకునేందుకు మీరు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే వ్యక్తికి శాశ్వత ఇల్లు ఉండకూడదు.
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని దాటేసి ఉండాలి.
  • దరఖాస్తుదారుడి సంవత్సర ఆదాయం రూ.03 లక్షల నుంచి రూ.06 లక్షల మధ్య ఉండాలి.
  • దరఖాస్తుదారుడి పేరు పైన రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితా కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారుడు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండాలి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే దేశీయ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
  • ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్
  • మీ ఫొటో
  • లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నంబర్
  • బ్యాంకు ఖాతా బుక్
  • స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) యొక్క నమోదు సంఖ్య
  • మొబైల్ నంబర్

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గరే ఉండి, ఆన్‌లైన్‌లో దరఖాస్తును చేసుకోలేకపోతే, మీరు దగరలో ఏదైనా ప్రజా సేవా కేంద్రానికీ లేదా మీసేవా కేంద్రానికీ లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి పైన ఇచ్చిన అన్ని ఫార్మలాతో వెళ్లవచ్చు. మీరు గృహ స్కీమ్ అసిస్టెంట్‌ దాగరకు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ క్రింద వివరించిన విధంగా ఉంటుంది.

ముందుగా మీరు Pradhan Mantri Awas Yojana 2024 అధికారిక వెబ్‌సైట్‌ (https://pmaymis.gov.in)ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత, వెబ్‌సైట్ లో మొదటి పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెనూ బార్‌లో ఉన్న మూడు ఫైలు కనిపిస్తాయి, దానిపై క్లిక్ చేయాలి, ఆ తరువాత అక్కడ కొన్ని ఆప్షన్లు జాబితా రూపంలో మీ ముందు కనిపిస్తాయి. వాటిలో మీరు “Awaassoft”పై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ ఐతుంది. అందులో మీరు “డేటా ఎంట్రీ”పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత, ఒక పేజీ మీ ముందు తెరుచుకుంటుంది. అందులో మీరు “DATA ENTRY FOR AWAAS”ను ఎంచుకొని దానిపై క్లిక్ చేయాలి.

అప్పుడు మీరు మీ రాష్ట్రం మరియు జిల్లాను ఎంచుకుని, “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయండి.

ఆపై ఆప్షన్ లో మీ వినియోగదారుని పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా (captcha)ను ఎంటర్ చేసి, “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత “బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం” మీ ముందు తెరుచుకుంటుంది.

అందులో మీరు మొదటి విభాగంలో మీ “వ్యక్తిగత వివరాల”కి సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

అప్పుడు మీరు రెండవ విభాగంలో “బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు” పూరించాలి.

తర్వాత 3వ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ్ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్ (SBM నంబర్) వంటి “బెనిఫిషియరీ కన్వర్జెన్స్ వివరాల” సమాచారం ఎంటర్ చేయాలి.

బ్లాక్ ద్వారా పూరించే 4వ విభాగంలో, మీరు “కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరాలు”కి సంబంధించిన సమాచారాన్ని పెట్టాలి.

ఈ విధంగా మీరు బ్లాక్ మరియు పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా Pradhan Mantri Awas Yojana 2024 ఫారమ్‌ను పూరించవచ్చు. ఆ తర్వాత లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చూసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me