Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ … భారీగా ధరలు తగ్గిన వస్తువులు ఇవే….

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ … భారీగా ధరలు తగ్గిన వస్తువులు ఇవే….

Union Budget 2024 : ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ (union Budget 2024-2025) లో పలు కాన్సర్ ఔషధాలు, Mobile Phones పై customs సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లుగా కేంద్రమంత్రిగా Nirmala Sitharaman ప్రకటించారు. దీనితో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్ వస్తువులు, సీఫుడ్ వంటివి చాలా చౌకగా లభించనున్నాయి. పలు వస్తువులపై ఎక్సయిజ్ సుంకం పెంపు/తగ్గింపు /మినహాయింపు ప్రతిపాదనలతో మార్కెట్లో ధరల విషయానికొస్తే తగ్గే మరియు పెరిగే అవకాశం ఉన్న కొన్ని వస్తువుల యొక్క వివరాల్ని పరిశీలిస్తే…

ధరలు తగ్గే వస్తువులు ఇవే…….


➽ Mobile Phones , మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBA ), చార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాని (BCD ) తగ్గించడంతో వివినియోగదారులకు Smart Phones ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యను మేడిన్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి గుడ్ న్యుస్ గా పేర్కొంటున్నారు. గత 6 సంవత్సరాలలో Mobile Phones దేశీయ ఉత్పత్తి , ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ,ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది.


కాన్సర్ డ్రగ్స్: కాన్సర్ రోగులకు ఊరటగా వారికి ఉపశమనం కలిగించేలా , వారి చికిత్స కు అవసరమైన 3 రకాల కాన్సర్ మెడిసిన్ లు అయిన Trastuzumab Deruxtecan ,Osmertinib ,Durvalumab పై కస్టమ్స్ పన్ను కేంద్రం మినహాయించింది. దింతో పలు రకాల మెడిసిన్ల యొక్క ధరలు తగ్గనున్నాయి.


బంగారం, వెండి : వీటిపై కూడా కస్టమ్స్ పన్నుని 6% కి తగ్గించారు. ఈ ప్రక్రియతో Retail డిమాండ్ పెరుగుతుందని ,దాని ద్వారా Smugglingను అరికట్టడంలో సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


➽ ప్లాటినం పైన 6.5 శాతం కస్టమ్స్ పన్నుని తగ్గిస్తూ , నిర్మల సీతారామన్ Budget లో ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై బేసిక్ కస్టమ్స్ పన్ను తగ్గించాలంటూ, ఎప్పటినుంచో జేమ్స్ అండ్ జ్యువెలరీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.


సీ ఫుడ్ : రొయ్యలు , చేపల ఆహారంపై బేసిక్ కస్టమ్స్ పన్నును 5% కి తగ్గించారు.


సోలార్ ఎనర్జీ భాగాలు : సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై పన్ను ని పొడగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది.

ఫుట్ వేర్ : లెదర్ , foot wear పై ఎగుమతుల దిగుమతుల పన్ను తగ్గించడంతో పాటు ఫెర్రోనికేల్ , బ్లిస్టర్ కాపర్ వంటి మినరల్స్ పై ఎగుమతుల దిగుమతుల పన్ను ని తగ్గిస్తూ ప్రతిపాదించారు.


Union Budget 2024 : Medical , Surgical,Dental X -Rey యంతాల తయారీకి వినియోగించే ఎక్స్రే ట్యూబ్ లు ,ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై 15% నుంచి 5% శాతానికి BCD ని తగ్గించారు.


➽ అణు , పునరుత్పాదక ఇంధనం , అంతరిక్షం ,రక్షణ , Telecommunication , హైటెక్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ముఖ్యమైనటువంటి Lithium, Copper , Cobalt వంటి ఇరవై ఐదు అరుదైన ఖనిజాలపై ఎగుమతుల దిగుమతుల పన్ను పూర్తిగా మినహాయింపు లేదా తగ్గింపునకు నిర్మల సీతారామన్ Budgetలో ప్రతిపాదించారు.

మరింత ప్రియం అయ్యే వస్తువులు ఇవే …


టెలికం పరికరాలు : Mother Board లపై 5% దిగుమతి పన్నుని పెంచాలని కేంద్రం Budget లో ప్రతిపాదించింది. దింతో కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

➽ అమ్మోనియం నైట్రేట్ , నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పై కస్టమ్స్ పన్నుని 10% కి పెంచారు. దీనితో కూడా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.


➽ దిగుమతి చేసుకున్న గార్డెన్ అంబరీల్లాలు ,లేబొరేటరీల్లో ఉపయోగించే రసాయనాలపై Basic Customs Duty (BCD ) పెంచడంతో వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి.


➽పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) ఫ్లెక్స్ Film లపై BCD ని పెంచారు. ప్లెక్స్ బ్యానర్లు ,ప్లెక్స్ షీట్లతో పర్యావరణం , ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నందున వీటిపై 10 శాతంగా ఉన్నటువంటి పన్నుని 25% కి పెంచారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me