కరివే పాకు లో చాల రకాల విటమిన్స్ A ,B ,E మరియు B6 వీటితో పటు మినరల్స్, కాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
దక్షిణ భారతీయ వంటకాలలో ప్రధానమైనది మరియు వివిధ కూరలకు విలక్షణమైన రుచి మరియు సువాసనను జోడించడానికి తరచుగా ఉపయోగిస్తారు.
కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చుసుకోవచ్చు. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. క్రమంగా జుట్టు పెరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే… కొన్ని రోజులు కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకుని చూడండి.
కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫినాలిక్ సమ్మేళనాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటిపై కరివేపాకు అమోఘంగా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి వాటిపై రాసి కట్టు కట్టాలి.