TGSRTC Jobs 2024: తెలంగాణ RTC లో 3035 ఉద్యోగాల భర్తీకి సన్నాహాల సంసిద్ధం ….. అత్యధికంగా ఉన్న 2000 డ్రైవర్ పోస్టులు…. !
TGSRTC Jobs 2024 Recruitment : తెలంగాణలో నిరుద్యోగులకు state government Good news చెప్పింది. TGSRTC లో అతి త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం Green signal ఇచ్చింది. వీటిలో 2000 Driver ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవె కాకుండా Deputy Superintendent-Mechanic, Traffic, Mechanical Engineer, Medical Officer, Section Officer, Accounts Officer ఇలా తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను పూర్తిస్థాయి వివరాలతో త్వరలో విడుదల కానుంది. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు .
TGSRTC Jobs 2024 Recruitment : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC )లో సుమారుగా 3,035 పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి TGRTC ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి Green signal రాగానే నియామక ప్రక్రియను ప్రారంబించడం జరగనుంది. ఈ TGSRTC సంస్థలో కారుణ్య నియామకాలు మినహా, గత 10 సంత్సరాలలో పోస్టుల భర్తీ లేకపోవడం.. ప్రతి ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండడంతో ఉన్నటు వంటి సిబ్బందిపై పనిభారం పెరగండం జరుగుతుంది . దీంతో తక్షణమే నియామకాలు చేపట్టాలని RTC అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే RTC లో 43 వేల మంది పని చేస్తుండగా .. గత 10 సంత్సరాలగా సంస్థలో కొత్త నియామకాలు లేవని, CM సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
విభాగాల వారీగా ఖాళీల వివరాలివే :
పోస్టులు | ఖాళీలు |
డ్రైవర్ | 2000 |
శ్రామిక్ | 743 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) | 114 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) | 84 |
డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ | 40 |
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) | 23 |
మెడికల్ ఆఫీసర్ | 14 |
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) | 11 |
అకౌంట్స్ ఆఫీసర్ | 6 |
TGSRTC Jobs 2024: అయితే.. ఈ నియామకాల ప్రక్రియకు సంబంధించి 2 నెలల తర్వాతా తాజాగా కసరత్తు మొదలైంది. RTC లో ప్రస్తుతం ఇప్పుడు 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో Drivers 14,747 మంది కాగా.. conductors 17,410 మంది ఉండటం విశేషం. రాష్ట్రంలో కొత్తగా 1325 డీజిల్ బస్సులు మరియు 1050 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా వాడకంలోకి రాబోతున్నాయి. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయయని అన్నారు వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు : మంత్రి పొన్నం
తెలంగాణ ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, BC సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు TGSRTC లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని.. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయన పేర్కొన్నారు.