Custard Apple : 2024 ఆరోగ్యానికి శ్రీరామ రక్షలాగ సీతాఫలం… రోజూ తింటే ఎన్నో బెనిఫిట్స్.. కానీ, ఎక్కువైతే..
Custard Apple
మీకు అందరికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఈ సీతాఫలాల కోసం అందరు అడవిలోకి, బావిదగ్గరి మరియు పంట చేన్లలోకి వెలుతూ ఉండే వాళ్లం. మన ఊరికి బయట ఈ చెట్లు లు ఉన్నాయని తెలిస్తే.., చాలు అందరం కలిసి ఓ సంచులు తీసుకుని, సెర్చ్ చేసేవాళ్లం. అక్కడ ఆ చెట్లకు ఈ పండ్లు దొరికినపుడు ఆ ఆనందమే వేరే లెవెల్ ఉండేది. ఈ పండ్లను తింటే అబ్బా ఆ టెస్టే వేరు.ఈ పండ్లు మనకు వినాయక చవితి నుండి స్టార్ట్ అవుతాయి. చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలం పండ్లకు అంత demand ఉంటుంది మరి. వీటితో మనకు చాల రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాస్తవానికి Seasonal వచ్చే ఎటువంటి పండ్లుఅయినా తింటే, చాలా రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు. ఈ Custard Apple వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
![](https://teluguvanam.com/wp-content/uploads/2024/07/Custard-Apple1-1024x576.png)
రకాలు:
ఈ పండులో రకాలు కూడా ఉంటాయి. సీతాఫలము /రామాఫలము అని. ఇవి కొంచము ఆకారంలో ,రుచిలో స్వల్ప తేడాలతో మాత్రమే ఉంటాయి.దీని యొక్క శాస్త్రీయ నామం : Annona Reticulata
Custard Apple
ఈ సీతాఫలం పండులో మానవ శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా Vitamin B, Vitamin C, Potassium, Magnesium వంటి పోషకాలు Nutrients పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను ఈ పండు వాల్ల అందుతాయి.
High oxidative stress, Cancer, heart సమస్యల వంటి Chronic diseases లకు దారితీస్తుంది. సీతాఫలంలో Kaurinoic acid, vitamin C, flavonoids, carotenoids వంటి శక్తివంతమైన Compounds ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
Custard Apple
ఈ సీతాఫలం పండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అవి రక్త నాళాలలో ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇడే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తన వంతు సహాయపడుతుంది. అధికంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. Paralysis వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
![](https://teluguvanam.com/wp-content/uploads/2024/07/Custard-Apple4-1024x576.png)
సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది Constipation, diarrhea వంటి Digestive problems ను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండులోని Fatty acids జీర్ణాశయాన్ని మంట మండేటువంటి వంటి వ్యాధుల నుంచి కాపాడి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.
Cholesterol స్థాయి అనవసరంగా పెరిగితే దాని వలన ఆరోగ్యానికి హానికరం. సమతుల్య Cholesterol స్థాయిని నిర్వహించడంలో సీతాఫలం సహాయపడుతుంది. ఇందులో Vitamin Niacin ఉంటుంది. నియాసిన్ విటమిన్ వినియోగం Cholesterol స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా Heart disease, stroke, heart attack నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
Custard Apple
ఈ పండ్లు తినడం వలన రక్తహీనతను నివారిస్తాయి.Folate లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. ఫోలేట్-రిచ్ పుడ్ తీసుకోవడం వలన వచ్చేది ఫోలేట్ లోపం, రక్తహీనత ప్రమాదాన్ని నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. వైద్యులు ప్రకారం, ఈ సీతాఫలంలో Vitamin C ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆహారంలో ఇతర ఆహార పదార్థాలతో పాటు ఈ సీతాఫలంను కూడా చేర్చుకుంటే, ఇతర ఆహార పదార్థాల నుండి వచ్చేటువంటి ఇనుమును శరీరం గ్రహించే విషయంలో సహాయపడుతుంది.
Asthmaతో బాధపడేవారు ఈ సీతాఫలం పండును తింటే కొంత ఉపశమనం లభిస్తుంది. ఇది అద్భుతమైన Anti-inflammatory గుణాలు కలిగిన పండు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, శోథ నిరోధక చర్య వలన వచ్చేటువంటి ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
![](https://teluguvanam.com/wp-content/uploads/2024/07/Custard-Apple5-1024x576.png)
మానసిక స్థితి (state of mind) మెరుగుపడుతుంది:
October రాగానే చాలా మందిలో మానసిక స్థితికి సంబంధించి సమస్యలు పెరుగుతూ ఉంటాయి.వింటర్ ప్రారంభంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక మరియు ఆరోగ్య సమస్యలు, మానసిక కల్లోలం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మీరు కూడా దీని బారిన పడిన వారైతే వారానికి 2,3 సార్లు సీతాఫలాన్ని తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం చెప్పబడింది. ఒక కప్పు సీతాఫలం తినడం ద్వారా ఒక వ్యక్తిలో 24% vitamin -B6 లభిస్తుంది. ఒక కప్పు సీతాఫలంలో 160 గ్రాముల విటమిన్-బి6 ఉంటుంది.కాబట్టి ఇది ఉల్లాసకరమైన హార్మోన్లు Serotonin, dopamine స్రావాన్ని పెంచుతుంద. ఇది మానసిక స్థితిని బాగా ఉంచడంలో సహాయపడుతుంది.
Custard Apple
అనేక వ్యాధుల నుంచి రక్షణ.
సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా మంచి మొత్తంలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో Flavonoids, carotenoids, chirolic acid, vitamin-C ఉంటాయి. ఇది గొప్ప Antioxidant గా చేస్తుంది. సీతాఫలం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టం నుండి చర్మాన్ని కాపాడుతుంది . Heart మరియు eyes ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందినుంచడంలో సహాయపడుతుంది. .
కంటి చూపును మెరుగుపరుస్తుంది..
దీనిలో ఉండేటువంటి పోషకాలు, అనేక రకాలైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంపై పనిచేయడమే కాకుండా, అవి మన శరీరంలోని కొన్ని అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. . కళ్ళకు కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్ లుటీన్ గా పనిచేస్తుంది. అందుకే కళ్లకు కూడా చూసే సామర్థ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మానవ శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణం ఎక్కువగా పెరిగినట్లయితే అవి దృష్టిని కూడా దెబ్బతీసెల చేస్తాయి. దీనితో పాటు,Age పెరగడం లేదా తెరపై ఎక్కువ సమయం గడపడం వల్ల, దృష్టి కూడా దెబ్బతినాదం జరుగుతుంది . ఈ పరిస్థితులను నివారించడానికి, Lutein స్థాయిని నిర్వహించడం చాలా అవసరం.
![](https://teluguvanam.com/wp-content/uploads/2024/07/Custard-Apple21-1024x576.png)
Custard Apple
అధిక రక్తపోటు నుంచి ఉపశమనం..
పనుల వలన ఒత్తిడితో, పనిభారంతో నిండినటువంటి ఇప్పటి జీవితాళలో అధిక రక్తపోటు అనేది సాధారణ సమస్యగా మారిపోయింది . అయితే ఈ సీతాఫలం వంటి పండ్లను తింటూ ఉండడం ద్వారా అధిక రక్తపోటు సమస్యను control లో ఉంచుకోవచ్చు. సీతాఫలంలో చాలా Potassium పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు సీతాఫలం రోజువారీ అవసరాలలో 10% Potassium, 6% Magnesium ను అందిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం. ఒక వ్యక్తికి కనీసం ప్రతిరోజూ 4,700 mg Potassium అవసరం. కానీ Potassium అవసరాన్ని తీర్చడానికి సీతాఫలాన్ని తినడం మంచిదంటున్నారు.కానీ ఎక్కువ తినడం కూడా అనర్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండును రోజుకు ఒకటికి బదులు, ఒక వీక్ కి కి 2 నుంచి 3 పండ్లను తింటే మంచిదంటున్నారు.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని లేదా వైద్యులని సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.