Masala omelette : మసాలా ఎగ్ ఆమ్లెట్ మార్నింగ్ ఈజీ అండ్ హీల్తి బ్రేక్ ఫాస్ట్…!2024

Masala omelette : మసాలా ఎగ్ ఆమ్లెట్ మార్నింగ్ ఈజీ అండ్ హీల్తి బ్రేక్ ఫాస్ట్…!

Masala omelette : ఉదయానే మనకి తొందరగా అయ్యేల అలాగే ప్రోటీన్ నిండిన గుడ్లతో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇది తినడం వల్ల రోజంతా మన శరీరానికి శక్తి చేకూరుతుంది. ఎంతో టేస్టీగా నోరూరించే విధంగా వుండే మసాలా ఎగ్ ఆమ్లెట్ ని ఈరోజు ఎలా తయ్యారు చేయాలో నేర్చుకుద్దాం.


Masala omelette: మన ఆరోగ్యానికి కోడిగుడ్లతో చేసిన ఆహార డిషెస్ ఎంతో మేలు అలాగే పోషకాలు అందెలా చేస్తాయి. అలా అని ఎప్పుడూ వాటిని ఒకే విధంగా ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ బుర్జీ వంటి వాటిని తినడం వల్ల బోర్ కొట్టేస్తుంది.కాబట్టి ఒకసారి డిఫరెంట్ గా మసాలా ఎగ్ ఆమ్లెట్ ట్రై చెయ్యండి.ఇది తింటుంటే చాలా రుచిగా అలాగే మరింత తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది.మసాలా ఎగ్ ఆమ్లెట్ని మనం ఏన్ని గుడ్లతో ఐనా వాటికీ సరిపడా ఇంగ్రిడిఎంట్స్ కలిపి చేసుకోవచ్చు.మసాలా ఎగ్ ఆమ్లెట్ కేవలం 5 నిమిషాల్లో తయ్యారు చేసుకోవచ్చు.మరి వాటికీ కావాల్సిన పదార్థాలు అలాగే దాని తయారీ చేయు విధానంని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Masala Egg omelette కావలసిన పదార్థాలు
15ml (1tbsp) పొద్దుతిరుగుడు లేదా మీరు వాడే నూనె
1 వెల్లుల్లి లవంగం, చూర్ణం
2 ఉల్లిపాయ కాడలు
1 మీడియం టమోటా
1/2 మీడియం పచ్చిమిర్చి
1 స్పూన్ మీడియం కరివేపాకు
1/2 స్పూన్ గరం మసాలా
2 గుడ్లు
1 టేబుల్ స్పూన్ తాజా కొత్తిమీర

Masala omelette తయారీ చేయు విధానము
ముందుగా మీ ఇంట్లో రెగ్యులర్గా వాడే పాత్ర లేదా నాన్‌స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌ని తీసుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి.దాని పైన పాత్రను పెట్టాక అందులో ఒక 1 టేబుల్‌స్పూన్ సన్‌ఫ్లవర్ లేదా వెజిటబుల్ ఆయిల్‌ను వేడి చేసి, 1 లవంగం పిండిచేసిన వెల్లుల్లి, 2 స్ప్రింగ్ ఆనియన్స్, 1 మీడియం టొమాటో మరియు 1/2 మీడియం పచ్చిమిర్చి వేసి వాటిని 2-3 నిమిషాలు వేగనివ్వాలి.
తరువాత 1 tsp మీడియం కరివేపాకు మరియు 1/2 tsp గరం మసాలా వేసి మరో నిమిషం వేయించాలి.
ఒక చిన్న గిన్నెలో 2 గుడ్లు కొట్టండి మరియు సీజన్ చేయండి. పాన్‌లో గుడ్డు మిశ్రమాన్ని వేసి, ఆమ్లెట్ మిశ్రమం కింద ఉడికినంత వరకు పాన్‌ను తిప్పండి.
ఆమ్లెట్‌ను జాగ్రత్తగా తిప్పండి మరియు బంగారు రంగు వచ్చేవరకు 1-2 నిమిషాలు ఉడికించాలి. 1 టేబుల్ స్పూన్ తాజా కొత్తిమీరతో చల్లి వెంటనే సర్వ్ చేయండి.అంతే ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ..

కోడిగుడ్డు పోషక విలువలు
కోడిగుడ్డుని మనం రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ఎన్నో దేశాల ప్రభుత్వాలు ప్రతిరోజూ NECC, కోడిగుడ్డును తినమని ప్రోత్సహిస్తున్నాయి. కోడి గుడ్లలో విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ప్రోటీన్స్ విటమిన్ ఇవన్నీ కూడా మన శరీరానికి మేలుచేస్థాయి.ప్రోదునే బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డుతో వండిన ఆహారాలు తినడం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా చురుగ్గా ఉంటారు. ఇది శరీరాన్ని బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.దీనిలో మంచి కొలెస్ట్రాల్ పెద్ద మొత్తంలో ఉంటుంది. మన శరీరానికి ఈ మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మంచి కొలెస్ట్రాల్మే ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి కోడిగుడ్డుని మీ ఆహారంలో వినియోగించుకోవడం మంచింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me