Plum Fruit In Telugu : ఈ పండ్లతో ఎలాంటి జ్వరం ఐనా పారిపోవాల్సిందే..!
Plum Fruit In Telugu : పుల్లగా ఉండే అల్ బుకరా పండ్లతో అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం.. వెంటనే మీ ఆహారంలో దీనిని కూడా చేర్చుకోండి.వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో అల్ బుకరా పండ్లు ఒకటి. ఇవి మనందరికీ బాగా పరిచయం వున్న పండు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడగానే తినాలనించేలా ఉండే ఈ పండ్లు తియ్యగా, పుల్లటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ పండ్ల పోషకాల గని అని అనవచ్చు. ఈ పండ్లలో విటమిన్ A , విటమిన్ B6, విటమిన్ C , విటమిన్ డిలతోపాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ ఎన్నో ఏ పండులో ఉంటాయి. అల్ బుకరా పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Plum Fruit In Telugu వర్షాకాలంలో అల్ బుకరా పండ్లు బాగా ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో ఇమ్మ్యూనిటీ లెవెల్స్ శక్తినీ అలాగే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. మన శరీరంలో ఉండే విష పదార్దాలను బయటకు పంపించడంలో ఈ పండ్లు సహాయపడతాయి.
ఆల్‌బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి ఇమ్యూనిటీని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఐరన్ శాతంను బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం .
అల్బుకార లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్‌సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో వాపును తగ్గిచేందుకు తోడ్పడతాయి. ఇవి రక్త కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి . జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు మోతాదులో ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా ఉంటుంది.
రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో సహాయపడతాయి. విటమిన్ A , బీటా కెరోటిన్‌లూ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అల్బుకార లో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా సహాయపడతాయి.
Plum Fruit In Telugu ఈ పండు శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంచడంలో కాపాడుతుంది. ఇందులోని విటమిన్ K ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఎండిన ఆల్‌బుకారాలను రోజుకు పది చొప్పున తీసుకుంటే ఎముకలు బాగ దృఢత్వంగా తయారై ఎముక విరుపు సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. దీని తో పాటు మోనోపాజ్ స్టేజ్ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారించడంలో సహాయపడతాయి.