Anjeer Fruit :అంజీర పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలు :

Anjeer fruit : అంజీర పండు ఒక అద్వితీయమైన ఫలము. ఇది వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ మధురమైన ఫలము దాని యొక్క మధుర రుచికే కాకుండా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనకాలను కలిగి ఉంది. అంజీర పండు యొక్క శాస్త్రీయ నామం ఫైకాస్ కరికా (Ficus Carica )అంజీర పండు యొక్క పళ్ళు,ఆకులు,బెరడు మరియు వేరులు చాలా ఉపయోగపడుతాయి. అంజీర చెట్టు ఆకురాల్చే చెట్టు. ఇది సంవత్సరానికి ఒకసారి ఆకులు రాల్చును. ఇది Ficus ప్రజాతికి చెందినది. అంజీర చెట్టు ఇండియా చైనా మరియు ఆఫ్రికా యొక్క ఉష్ణ మండలాలు మరియు ఉప ఉష్ణ మండలాలలో పెరుగును. టర్కీ (Tarki )ప్రపంచంలోనే అతిపెద్ద అంజీర పండ్ల ఉత్పత్తి కేంద్రంగా పిలువబడుతుంది. ఈ అంజీర చల్లదనాన్ని కలిగి ఉండును. అంజీర పండ్లు మనలో చాల మందికి తిలిసిన పండ్లే ఇవి. వీటిని ఎండబెట్టి Dry Fruits లోకి మార్చిన అంజీర పండ్లు మనకు మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అంజీర పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకోవాలి.

ఎముకలు శరీర నిర్మాణానికి ప్రాథమిక మద్దతును ఇస్తాయి. అంజీరలో ఉన్న సహజమైన కాల్షియం మూలకాలు మన ఎముకలకు మరియు పళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. ఇది కాల్షియం తో పాటు అంజీర మెగ్నేషియం పాస్పరస్ ను అందిస్తుంది.

ఆయుర్వేదంలో అంజీర ఆకులు ఆంటీపైరెటిక్ (Antipyretic) అనగా శరీర ఉష్ణాన్ని తగ్గించడం ద్వారా జ్వరం అనేది సాధారణ స్థాయికి చేరుతుంది. జ్వరంగా ఉన్నపుడు అంజీర పండ్లను తీసుకోవడం చాల మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అంజీర పండ్లను తీసుకోవాలి. చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంజీర్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ Dry Fruit ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలపడి రోగాలకు దూరంగా ఉంటారు. అంజీర్ పండ్లలో కరిగే Fiber ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల షుగర్ పేషెంట్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

అంజీర పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అంజీర్ రక్తపోటును నియంత్రిస్తుంది. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అత్తి పండ్లలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.ఫినాల్, ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎండిన అత్తి పండ్లలో ఉంటాయి, ఇవి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.

బరువు పెరిగిన వారు ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తింటారు. అత్తి పండ్లలో Fiber పుష్కలంగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అది తిన్నాక ఎక్కువ సేపు తినాలనే కోరిక ఉండదు.

అంజీరాలు సహజంగా మూత్ర విసర్జన అంటే శరీరంలో ఉన్న విషతుల్య పదార్థాలను తొలగించడానికి మరియు అధికంగా ఉన్ననీటిని మూత్రపిండాల నుండి వేరు చేయడానికి,తద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా శరీరాన్ని విషపదార్థాల రహితంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతాయి.


అంజీర పండ్లలో గల పోషక మరియు యాంటీ – ఆక్సిడెంట్ ప్రభావం నెత్తి సమస్యలకే కాకుండా జుట్టు రాలుట లో కూడా సహాయపడుతాయి. అంజీర విత్తనాల నూనెను సముచితంగా వాడడం వల్ల జుట్టు కి సమపాళ్లలో Vitamin e మరియు Vitamin K ఇస్తుంది. ఇది జుట్టుకి మెరుపుని మరియు జుట్టు రాలుట నివారణకు ఎంతో ముఖ్యమైనది.

ఈ అంజీర పండ్లు సాంప్రదాయ మరియు జానపద ఔషధ విధానాలలో వాడడం జరుగుతుంది. దీనిని చర్మ వ్యాధులు సోరియాసిస్,మొటిమలు మరియు తామర వంటి వ్యాధులు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా పులిపిరుల నివారణకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

అంజీర పండ్లలో అధిక మోతాదులో ఉన్న అమైనో ఆమ్లాలు,ట్రిప్టోఫాన్ స్థాయిలు పెరిగి సమయానుకుల మొలాటిను ను విడుదలకు ప్రేరేపించుచున్నవి అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కావున ఇది నిజంగా “Sleep Harmone ” ను విడుదల చేస్తుంది.

అంజీర పండ్లు vitamin A నకు మంచి మూలకాలు. Vitamin A కంటిచూపు మెరుగుదలకు మరియు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజు అంజీర పండ్లని సేవించడం వల్ల కళ్ళ కు మాత్రమే కాకుండా వయస్సు పరంగా వచ్చు కంటి సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.

అంజీర పండ్లలో చాలా అధిక మోతాదులో ఆహార పీచు పదార్దములు కలిగి ఉండడం వలన మలము సులభంగా శరీరం నుండి బయటకు వెల్లిపోవును.


Note : ఈ అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనప్పటికిని అపరిమితంగా దేనిని తీసుకోకూడదు. ముందుగా దీని గురించి నిపుణుల దగ్గర సలహాలు,సూచనలు తీసుకోవడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me