Pachi Pulusu : ఇంట్లో ఎం కూర లేనప్పుడు 10 నిమిషాల్లో పచ్చి పులుసు చేసుకోండి. ఇలా….! 2024

Pachi Pulusu : ఇంట్లో ఎం కూర లేనప్పుడు 10 నిమిషాల్లో పచ్చి పులుసు చేసుకోండి. ఇలా….! 2024

Pachi Pulusu :ఇంట్లో కొన్నిసార్లు కూరలు ఉండవు. కానీ ఆకలి మాత్రం భాగా వేస్తుంది. పచ్చడి వేసుకుని తిని తిని Bore కొడుతుంది. అలాంటి Time లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే పచ్చి పులుసు చేసేయెుచ్చు.ఇది చేయడం కూడా చాలా ఈజీ. పది నిమిషాల్లో చేసేసి, లాగించేయెుచ్చు. పచ్చి పులుసు తయారు చేసేందుకు కూడా పెద్దగా పదార్థాలు అవసరం లేదు. దీనిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేస్తుంటారు.


Pachi Pulusu :పచ్చిపులుసు తయారీ విధానం : చాలా మందికి అన్నంలోకి కర్రీతోపాటుగా పచ్చి పులుసు కంపల్సరీ. కరకరలాడే పచ్చి ఉల్లిపాయ ముక్కలతో.. నోటికి పుల్ల పుల్లని రుచి తగులుతూ ఉండే ఈ పచ్చిపులుసును.. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, లేదా మరేదైనా నా వంటకంతో కలుపుకుని తింటే ఉంటది నా సామిరంగా.. చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే! అంత గొప్ప రుచిగా ఉంటుంది. అందుకే, కొంత మంది ఇంట్లో ఎన్నిరకాల కూరలు వండినా కూడా ఒక చిన్న గిన్నెలో పచ్చిపులుసుని మాత్రం తప్పకుండా చేసుకుంటుంటారు. అయితే.,అందరికీ సూపర్ టేస్ట్​ రాదు. మరి.. అద్దిరిపోయే రుచికరమైన పచ్చిపులుసును ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Pachi Pulusu :తయారీకి కావాల్సిన పదార్థాలు :

పచ్చి మిర్చి – 5
కొత్తిమీర కొద్దిగా
చింతపండు – 50 గ్రాములు
1/2 టీస్పూన్- పసుపు పొడి
జీలకర్ర- టీ-స్పూన్
కరివేపాకు – నాలుగైదు రెమ్మలు
చిన్న టమాట
ఉల్లిపాయలు- రెండు
ఎండు మిర్చి – 3
ఉప్పు -సరిపడినంత

Pachi Pulusu :తయారీ విధానం :

ముందుగా సన్నని మంట మీద 5 పచ్చిమిర్చిలను బాగా మంచిగా కాల్చుకోండి. వీటివల్ల పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది.
తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి,ఎండుమిర్చి, ఒక టీస్పూన్‌ జీలకర్ర వేసి దోరగా అయ్యే వరకు వేయించండి.ఈ ఎండుమిర్చి, జీలకర్ర ఈ రెండింటిని వేడిగా ఉన్నప్పుడే రెండు మూడు వెల్లుల్లిని కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసిన దానికంటే.. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకుంటేనే పచ్చిపులుసు రుచి ఎక్కువగా ఉంటుంది.


ఇంకొక చిన్న గిన్నెలో కాల్చుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు , పచ్చి ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) వేసుకుని బాగా నలుపుకోండి.అలాగే ఒక పెద్ద గిన్నెలో చింత పండును 10 నిమిషాల సేపు నానబెట్టండి.నానబెట్టిన చింత పండుని బాగా మెదిపి రసాన్ని తీసుకొని వెస్ట్ పిప్పిని తీసేసి, అందులో మీ టేస్ట్‌కు సరిపోయేటట్టు పులుపును రుచి చూకుంటూ వాటర్ పోసుకోండి.తర్వాత ఈ రసంలో మెత్తగా నలిపిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకు, సన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి కూడా వేయండి.మీకు నచ్చితే చిన్న టమాట ముక్కలను కూడా పచ్చిపులుసులో వేసుకోవచ్చు.


తర్వాత ఇందులో అర టీస్పూన్‌ పసుపు, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, ఎండు మిర్చి మిశ్రమం వేసి.. చేతితోనే బాగా కలుపుకోండి.
పచ్చిపులుసులోని పదార్థాలన్నింటినీ చేతితో నలుపుతూ కలపడం వల్ల.. పులుసు చాలా రుచిగా ఉంటుంది.కొంత మంది కొంచం ఆయిల్ వేసి జీలకర్ర ,ఆవాలు,ఎండుమిర్చి మరియు కరివేపాకు ,ఇంగువ ,పసుపు వేసి పోప్ చేసి అందులో కలుపుకోవచ్చు.దీనిని వేడివేడి అన్నంలో Pachi Pulusu ని పోసుకుని తింటే అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే! మీరు కూడా ఈ సింపుల్‌ రెసిపీని ట్రై చేయండి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!