Corn Tomato Recipe కార్న్ టమాటో : ఎంతో రుచికరమైన కార్న్  టమాటో తయ్యారి విధానాన్ని ఇక్కడ చూసేయండి ! 2024

Corn Tomato Recipe కార్న్ టమాటో : ఎంతో రుచికరమైన కార్న్  టమాటో తయ్యారి విధానాన్ని ఇక్కడ చూసేయండి !

కార్న్ టమాటో తయారీ విడనాంకి కావాల్సిన పధార్థాలు

  • స్వీట్ కార్న్ :    ఒక కప్పు
  • ఉల్లిపాయ :  ఒకటి
  • టొమాటో గుజ్జు : అరకప్పు
  • టొమాటో : ఒకటి
  • అల్లంవెల్లులి పేస్టు : రెండు చెంచాలు
  • జీడిపప్పు పేస్ట్ : టేబుల్ స్పూన్
  • పచ్చి మిర్చి : మూడు
  • కారం : రెండు చెంచాలు
  • ఉప్పు : తగినంత
  • నూనె : రెండు టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క
  • లవంగాలు : రెండు
  • యాలకులు : రెండు
  • జీలకర్ర : ఒక చెంచా
  • కొత్తిమీరా తరుగు :  పావుకప్పు

Corn Tomato Recipe తయ్యారి విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి అయినా లేదా వేరే మీరు  యెంచుకున్న పాత్ర పెట్టి…నూనె వేసి అది కాస్త వేడి అయ్యాక అందులో….జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు, యలకుల్ని వేసి అవి వేయించుకోవాలి, ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు ముక్కలు వెయ్యాలి. అవి వేగుతునప్పుడు

అందులో టొమాటో తరుగు, అల్లంవెల్లులి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత కారంపొడి, గరం మసాలా, హల్దీ, కసూరి మెంతి, మిశ్రమానికి తగినంత సాల్ట్, టొమాటో గుజ్జు వేసి కలపాలి . ఈ మిశ్రమాన్ని కాస్త మగ్గుతున్న సమయంలో కార్న్ వేసి అందులో అలాగే కప్పు నీళ్లు పోసి కాసేపు మూత పెటేసేయ్యాలి . కాసేపటికి మూత తీసి అది ఉడికి… దగ్గరకు అయ్యే సమయంలో కాస్త వెన్న, కొత్తిమీర  వేసి కలిపి దింపెయ్యాలి..తర్వాత ఆ కర్రీని మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు.. అంతే ఎంతో రుచికరమైన టేస్టీ కార్న్ టొమాటో రెడీ…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!