NPS Pension Calculator : కేంద్రం ఇస్తున్న బెస్ట్ స్కీమ్.. నెలకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత ప్రతి నెలా రూ. 5 లక్షల పెన్షన్ మీ చేతిలో !

కేంద్రం ఇస్తున్న బెస్ట్ స్కీమ్.. నెలకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత ప్రతి నెలా రూ. 5 లక్షల పెన్షన్ మీ చేతిలో ! NPS Pension Calculator.

(National Pension System) NPS Pension Calculator: రిటైర్మెంట్ తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, నెల నెలా స్థిరాదాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. దీంట్లో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంది.

NPS Pension Calculator ముఖ్యంగా ఇది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్దేశించిన పథకం. అంటే రిటైర్మెంట్ ఫండ్స్ కోసం అన్నమాట. మీరు సంపాదించే వయసులోనే పెట్టుబడులు పెట్టుకుంటే,తర్వాత మీరు రిటైర్మెంట్ అయ్యే, వరకు పెద్ద మొత్తంలో అయితే,డబ్బును సమకూర్చుకోవచ్చు. ఇంకా ఆ మొత్తంలో కనీసం 40%తో Annuity కొనుగోలు చేయాలి. మిగతా మొత్తాన్ని కూడా ఇతర Mutual fund scheme ల్లో పెట్టుబడులు పెట్టడం. తర్వాత ప్రతి నెలా పెన్షన్ అందుకోవచ్చు.

ఇక్కడ వార్షిక ప్రాతిపదికన కనీసం రూ. 1000 చొప్పున కూడా పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. అంటే మీ సంపదను బట్టి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. మీరు ఎంత చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే ,మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి అంత పెద్ద మొత్తం చేతికి అందుతుందని చెప్పొచ్చు.

పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారా ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా eNPS వెబ్‌సైట్ ద్వారా చేరొచ్చు. ఇక్కడ ముఖ్యంగా గరిష్ట పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఆర్థిక సంవత్సరంలో దీంట్లో పెట్టుబడులపై రూ. 2 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి.. నెలకు రూ. 39 వేలను NPS పథకంలో ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. దీనిని అలాగే 65 సంవత్సరాల వరకు కొనసాగించాడు. అంటే అప్పుడు టోటల్ 35 సంవత్సరాల పాటు ప్రతి నెల డబ్బులు కట్టాలన్నమాట. ఇక్కడ సంవత్సరానికి 12% సగటు రిటర్న్స్ అంచనా వేసుకుంటే,40% Annuity పై సగటున 6% రాబడి అంచనా వేసినా, రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 5 లక్షల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు.

ఇదే విధంగా ఒకవేళ 40 సంవత్సరాల వయసులో,65సంవత్సరాలు వచ్చే సరికి నెలకు రూ. 1.35 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే ఇక్కడ కూడా 5 లక్షల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు. ఇలా చేరే వయసు పెరుగుతున్న కొద్దీ.. పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుందన్నమాట.

మెచ్యూరిటీలో మీకు అందే మొత్తం నగదులో 60% మొత్తాన్ని ఏదైనా ఈక్విటీ, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 40 శాతంతో యాన్యుటీ కొనాలి. ఇక్కడ సగటు రిటర్న్స్‌తో కూడా పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me