Bal Jeevan Bima Yojana : మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారా ? ఐతే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం లో ఈరోజే ఇన్వెస్ట్ చేయండి…వారి జీవితానికి బంగారు బాట వేయండి…! అదిరి పోయే వడ్డీ రేట్లతో మీ రిటర్నులని పొందండి…2024

Bal Jeevan Bima Yojana : మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారా ? ఐతే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం లో ఈరోజే ఇన్వెస్ట్ చేయండి…వారి జీవితానికి బంగారు బాట వేయండి…! అదిరి పోయే వడ్డీ రేట్లతో మీ రిటర్నులని పొందండి…

Bal Jeevan Bima Yojana : తల్లిదండ్రులు కొంతమంది ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన పథకాలలో ఉన్న రాబడి మరియు రిస్క్ లేని పెట్టుబడులను పెట్టేందుకు ఇష్టపడతారు. పోస్ట్ ఆఫీస్ స్కీం మార్కెట్-లింక్ అవ్వవు. అలాగే హామీతో కూడిన రాబడిని అందిస్తాయి కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు వీటిలో పెట్టుబడికి మంచి మార్గంగా ఎంచుకున్నారు.ఐతే స్కీం అన్ని కూడా ఎక్కువ శాతం పెద్దవలకోసం నిర్మించబడతాయి, కొంత శాతం పిల్లల కోసం నిర్మించబడతాయి,ఐతే అలంటి పథకాలలో ఈ బల్ జీవన్ బీమా స్కీం మొదటి స్థానం లో ఉంటుంది. ఇది పోస్టాఫీసు పథకం. ఈ Bal Jeevan Bima Yojana పథకం పిల్లలకు జీవిత బీమా రక్షణను కూడా అందిస్తుంది. ఈ స్కీం బాల్ జీవన్ బీమా పథకం పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

Bal Jeevan Bima Yojana

ప్రతి ఒక కుటుంబంలో బిడ్డ పుడితే ఆ కుటుంబానికి ఉండే సంతోషo అస్సలు మాటలో చెప్పలేము. అదే సమయం లో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా వారి పోషణ, భవిష్యత్తు ఖర్చులు, చదువు, పెళ్లి ఖర్చుల గురించి, పిల్లలు పుటినప్పటి నుంచే ఆలోచిస్తారు. పిల్లల యొక్క బాధ్యతలను పూర్తి చేయడానికి తల్లితండ్రులకి చాలా డబ్బు అవసరం పడుతుంది. కేవలం వారికీ వచ్చే నెలవారీ సంపాదన ద్వారా వాటిని భరించడం చాలా కష్టం. అందుకే ఈ మధ్య కలం లో స్మార్ట్ పేరెంట్స్ పెట్టుబడులను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇదే.

తల్లిదండ్రులు కొంతమంది ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన పథకాలలో ఉన్న రాబడి మరియు రిస్క్ లేని పెట్టుబడులను పెట్టేందుకు ఇష్టపడతారు. పోస్ట్ ఆఫీస్ పథకాలు మార్కెట్-లింక్ అవ్వవు. అలాగే హామీతో కూడిన రాబడిని అందిస్తాయి కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు వీటిలో పెట్టుబడికి మంచి మార్గంగా ఎంచుకున్నారు. పిల్లల కోసం అలాంటి పోస్టాఫీసు స్కీమ్ ఒకటి ఉంది. ఇది పిల్లలకు జీవిత బీమా రక్షణను కూడా అందిస్తుంది. ఈ పథకం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద నడుస్తుంది. ఈ పథకంలో మెచ్యూరిటీపై రూ. 3 లక్షల వరకు హామీ మొత్తం లభిస్తుంది.

  • పోస్ట్ ఆఫీస్ చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను పిల్లల తల్లిదండ్రులు, తమ పిల్లలకోసం భవిష్యత్తు కోసం కొనుగోలు చేయవచ్చు.
  • ఈ స్కీం యొక్క ప్రయోజనం గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఇస్తారు.
  • ఇది 5-20 సంవత్సరాల వయస్సు పిల్లలకు కొనుగోలు చేయవచ్చు.
  • తమ పిల్లలకు ఈ బీమా పథకాన్ని కొనుగోలు చేయాలనుకునే తల్లిదండ్రులు, వారి వయస్సు 45 ఏళ్లు మించకూడదు.
  • ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ. 3 లక్షల వరకు హామీ మొత్తం తీసుకోవచ్చు. అయితే ఇందులో మీరు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) క్రింద ఈ పాలసీని తీసుకుంటే పాలసీదారు రూ. 1 లక్ష వరకు హామీ మొత్తాన్ని పొందుతారు.
  • ఈ పాలసీని మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఎండోమెంట్ పాలసీ లాగా ఇందులో కూడా బోనస్ని చేర్చారు.
  • మీరు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్రింద ఈ పాలసీని తీసుకుంటే రూ. 1000 హామీ మొత్తంపై మీకు ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ జత చేస్తారు .
  • పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్రింద ప్రతి ఏడాది రూ. 52 బోనస్ని ఇవ్వబడుతుంది.
  • ఐదు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా రెగ్యులర్ ప్రీమియం చెల్లించిన తర్వాత, ఈ పాలసీ చెల్లింపు పాలసీ అవుతుంది.
  • ఈ ప్లాన్‌లో ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించడం తల్లిదండ్రుల బాధ్యత, ఒకవేళ పాలసీ మెచ్యూరిటీకి రాకముందే ముందే వారు మరణిస్తే, పిల్లల ప్రీమియం మాఫీ అవుతుంది.
  • ఒకవేళ ఆ బిడ్డ ఆకస్మరణంగా చనిపోతే, నామినీకి బోనస్‌తో పాటు బీమా మొత్తం డబ్బులని చెల్లిస్తారు.
  • మీరు ఈ స్కీం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా పెట్టుబడిని ఎంచుకోవచ్చు.
  • అన్ని ఇతర పాలసీల మాదిరిగానే, ఈ స్కీంలో రుణ సౌకర్యం అందుబాటులో ఉండదు.
  • మీ పిల్లలకు ఈ పాలసీ తీసుకునేటప్పుడు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
  • పథకంలో పాలసీని సరెండర్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు.
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me