Business Ideas in Telugu : ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? ఐతే అద్భుతమైన,ఈ బిజినెస్ ఐడియాలతో ఇంట్లో ఉంటూనే వేలకు వేలు డబ్బులు సంపాదించుకొండీ…2024

Business Ideas in Telugu : ఇంట్లో వుంటు డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? ఐతే ఈ బిజినెస్ ఐడియాలతో ఇంట్లో వుండే వేలకు వేలు డబ్బులు సంపాదించుకొండీ…

Business Ideas in Telugu : ఇంట్లో వుంటు డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు కాస్త సృజనాత్మకత మరియు ఓపిక ఉంటే, మీకోసం అనేక మార్గాలు ఇక్కడ తెలియజేసాం. ముఖ్యంగా మహిళలకు ఇంట్లో పనుల విధులు నిర్వహించుకుంటు, ఒక వైపు పిల్లల్ని చూసుకుంటు వారి రోజు జీవితం గడిచిపోతుంది, బైటకి వెళ్లి జాబ్స్ చేసే పరిస్థితి వారికీ ఉండదు..అలంటి సమయం లో ప్రతి మహిళా తాను ఏదో ఒక బిజినెస్ ని మొదలు పెట్టి అందులో రాణించాలి అనుకుంటుంది..ఇంట్లో వుంట డబ్బులు సంపాదించాలి అనుకునే వారికీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన బిజినెస్ ఐడియాస్ తెలియజేయడం జరిగింది.

ఇపుడున్న ఆధునిక ప్రపంచంలో మనం ఏది చేసిన సోషల్ మీడియా వెబ్సైటు ను వాడుకొని, అందులో మనం తయ్యారు చేసిన ప్రొడెక్టులను పెట్టి మంచి సంపాదన ని పొందొచ్చు. ఐతే ఇలా సోషల్ మార్కెటింగ్ చెయ్యాలి అనుకున్న మహిళలు ముందుగా పూర్తి అవగాహనా డిజిటల్ మార్కెటింగ్ పైన తెలిసి ఉండాలి..

ఇపుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ మార్కెటింగ్ కి పెద్ద పిటా ఉందనే చెప్పాలి.మీకు ఎందులో ఇష్టం ఉంటే, వాటి గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్ మంచి అవకాశం అనే చెప్పాలి…ఐతే ఈ ప్రాసెస్ అంత కూడా మీ ఓపిక పైన ఆధారపడి ఉంటుంది…అలాగే మీకు ఏవైనా కొత్తగా చేసే సమర్థం మరియు కాస్త కొత్తగా ఆలోచించే తెలివితేటలు మీద ఆధారపడి ఉంటుంది …ఇవన్నీ పరిస్థితులు దాటి మీరు ఏదన్న బిజినెస్ చేయాలి అనుకుంటే, ఇక్కడ మీకోసం మంచి బిజినెస్ ఐడియాస్ మా teluguvanam.com తెలియజేసాం క్రింద చూసేయండి..!


Business Ideas in Telugu :టెర్రాకోట మట్టితో ఈ నగలు తయారు చేయడం జరుగుతుంది.మట్టితో చేస్తారు కదా అని ఇవి నాణ్యత లేకుండా వుండవు,మంచి మట్టితో తో చేస్తారు కాబ్బటి చాల దృడత్వం తో ఈ నగలు ఉంటాయి. వీటితో చేసిన చిన్న పాటి చెవి దుద్దుల ధర ఎంత లేదన్న 200 నుంచి మొదలై ఒక పెద్ద నెక్‌లేస్ సెట్ల ధర 10,000 దాకా కూడా ఉంటుంది. కెంపులు, స్టోన్స్, బీడ్స్, మంచి రంగుల్లో వీటిని తయారు చేసి, వాటికీ వివిధ ఆకారాల డిజైన్లను తయారు చేసి అమ్ముతున్నారు. మామూలుగా ఐతే వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా కాకుండా వీటిని మనకు నచ్చిన మరియు మనం ఎంచుకున్న రంగుల కాంబినేషన్లో మనకోసం అలాగే వీటిని కస్టమర్ల కోసం ఎలా అనుకుంటే అలాగే తయారు చేయొచ్చు.

పెళ్లిళ్లకు కూడా వేసుకునేంత అద్భుతమైన మరియు భారీ డిజైన్లు కలిగిన నగలు కూడా ఈ టెర్రాకోట మట్టితో తయారు చేయొచ్చు. ఈ డిజైన్ ప్రణాలికను నేర్చుకునేందుకు ఆన్‌లైన్ లో కోర్సులు అందుబాటులో ఉంటాయి. మీరు దీనిని ఒక్కసారి నేర్చుకూనారంటే ఇన్‌స్టాగ్రామ్వా మరియు ట్సాప్ లో పేజీ మొదలుపెట్టి వీటిని అమ్మడం మొదలుపెట్టొచ్చు.మీ సృజనాత్మకత దీనిని జోడిస్తే మంచి సంపాదన


Business Ideas in Telugu : మాములుగా ఉన్ని దారం అంటే మనకు ఎంతగానో ఇంట్లో వాడుకలో వుండే ఒక ధరం.కానీ మనం ఈ దారం ఉపయోగించుకొని , చెవి కమ్మలు, స్టడ్స్, చేతి రింగులు, కార్లో తగిలించుకునే బొమ్మలు, డెకొరేటివ్ ఐటమ్స్ , పిల్లల అట వస్తువులు బొమ్మలు , వ్యాలెట్లు.. మొదలైనవి చాలా మన టాలెంట్ ని బట్టి చేయొచ్చు.

ఇవి చూడ్డానికి కూడా ఎంతో కొత్తగా, ట్రెండీగా చూడటానికి అందంగా ఉంటాయి. ఈ జ్యువెలరీని ఎలా తయారు చేయాలో చెప్పే క్లాసులు యూట్యూబ్‌లో అనేక చానెల్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని చూసి మీరు ఇంట్లోనే నేర్చుకోవచ్చు.క్రోషెట్ జ్యువెలరీ ని చాల తక్కువ మంది చేస్తారు కాబ్బట్టి వీటికి డిమాండ్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి


Business Ideas in Telugu : కరిగించిన రెజిన్ చూడటానికి పారదర్శకంగా ఉండే మైనం లాగా ఉంటుంది. దీన్నివివిధ అచ్చుల్లో పోసి కళాత్మకమైన వస్తువులు తయారు చేయొచ్చు. పెండెట్లు, చెవిపోగులు, ఉంగరాలు.. ఒక్కటేమిటి ఇలా మొదలైనవి చాలా చేయొచ్చు. ఈ జ్యువెలరీ కేవలం సాంప్రదాయ దుస్తులకే కాకుండా, ఆధునిక దుస్తులకి జీన్స్, కుర్తాలకు కూడా చాల చక్కగా నప్పుతుంది, అలాగే చూడటానికి చాల ట్రెండీగా కనిపిస్తారు.

ఈ జ్యువెలరీ ని మీరు కాస్త కళాత్మకంగా చేస్తే, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎదుకంటే ఇవి జీన్స్ మోడెర్న్ డ్రెసెస్ అన్నిటికి బాగా సెట్ అవుతాయి,అలాగే అందరిచేత ఆకర్షించబడతాయి. ఈ మెటీరియల్ తో మీరు వివిధ రకాలుగా కీచైన్లు కూడా తయ్యారు చేయొచ్చు, ఇంకా కీచైన్ వాడకల గురించి చెప్పాల్సిన అవసారేమే లేదు విరివిగా అందరు బాగా వీటిని వాడుతూ వుంటారు.రెజిన్ జ్యువెలరీ యొక్క దార 600 రూపాయలకు తగ్గి ఉండదు, ఇంకా వీటి రేట్లు మీ కళను బట్టి మేరె డిసైడ్ చేయొచ్చు.


Business Ideas in Telugu : మీకు కాస్త ఓపిక మరియు కొంచం టైం వీటికి కేటాయిస్తే చాలు వీటిని ఎలాంటి ప్రత్యేకమైన కోర్సు అవసరం లేకుండా మీ సృజనాత్మకతతో వీటిని తయారు చేసేయొచ్చు. మనం వేసుకున్న డ్రెస్ కి మంచి మ్యాచింగ్ జ్వెలరీ కావాలని ప్రతి మహిళా అనుకుంటుంది. ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఆలా డ్రెస్ మాచింగ్ కి మంచి ఎంపిక అని చెపొచ్చు. ఐతే ఈ జ్యువెలరీ ఫాబ్రిక్ తో తయ్యారు చేస్తారు కాబ్బటి మీరు ఎంచుకునే ఫాబ్రిక్ బట్టి జ్యువెలరీ లుక్ వస్తుంది.

ఫాబ్రిక్ కి పూసలు, స్టోన్స్ అతికించి కళాత్మకంగా వీటిని వివిధ ఫ్లవర్స్ లేదా పెండెంట్ రూపాలలో వీటిని తయారు చేయోచ్చు. ఇప్పటికే ఈ జ్యువెలరీ హల్దీ మరియు మెహేంది ఫంక్షన్స్ లో బాగా వాడుతున్నారు, మీ కళను యూస్ చేసి వీటిని మీ స్టైల్ లో, వాటికీ కొంత నైపుణ్యతను జోడించి అందంగా తయ్యారు చేయోచ్చు.ఈ ఫాబ్రిక్ జ్యువెలరీని ఎక్కువ ఖర్చు లేకుండా తయారు చేయొచ్చు.

Business Ideas in Telugu చివరి మాటలు : పైన వెలువడించిన అన్ని ఐడియాస్ ని మీరు ఇంట్లో ఉండి, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్,యూట్యూబ్ చానెల్స్ , ట్విటర్, పిన్ట్రెస్టు, ఫెసుబూక్, లింక్.ఇన్ ఇలా మొదలైన అప్స్ లో మీ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవచ్చు, ఐతే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ని బట్టి మీ యొక్క అమ్మకాలు జారుతాయి. ఇవే కాకుండా మీ సొంతంగా వెబ్సైటు లలో కూడా వీటిని అమ్మవచ్చు, ఇలా చెయ్యడం వల్ల మీ ప్రొడక్ట్స్ కి మంచి బ్రాండ్ నేమ్ కూడా మార్కెట్ లో పొందొచ్చు.ఇలా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకునే మరిన్ని ఐడియాస్ కోసం మా teluguvanam.com ని సంప్రదించండి…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me