Chicken Curry : చికెన్ తో వెరైటీగా…. ఇలా ట్రై చేయండి. అస్సలు వదలరు.ఎగ్ తో చికెన్ కర్రీ.
Chicken Curry : ముందుగా బాయిల్డ్ ఎగ్ తో చికెన్ కర్రీ ని తాయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని ఇక్కడ చూసేద్దాం.
కావలసిన పదార్థాలు :
Chicken Curry : చికెన్ అర కేజీ ,ఉడికించిన గుడ్లు రెండు, ఆరు తర్భుజా గింజలు , ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నూనె ,పావుకప్పు ఉల్లిపాయ పేస్టూ, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటాలు రెండు (పేస్టులా చేసుకోవాలి.) , పసుపు అరా చెంచా , ధనియాలపొడి రెండు చెంచాలు , కాసురీమేథీ చెంచా, క్రీమ్ రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసుకునే విధానం :
Chicken Curry : ముందుగా చికెన్ ను ఉడికించుకొని ఆ తరువాత ఫోర్క్ తో చీలికల్లా చేసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు ,తర్భుజా గింజల్ని అరగంట ముందు నానబెట్టుకొని, పెరుగుతో కలిపి మెత్తగా చేసుకోవాలి . స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి, ఉల్లిపాయపేస్టును వేయాలి. అది వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక టమాటో పేస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టాలి.
ఈ మిశ్రమం మగ్గుతున్నప్పుడు పసుపు , తగినంత ఉప్పు ,కారం మరియు ధనియాల పొడి ,కసూరి మేథీ , చికెన్ ముక్కలు వేసి అన్నింటిని కలిపి , అరకప్పు వాటర్ ని పోసి, ఇది ఉడుకుతున్నప్పుడు జీడిపప్పు పేస్ట్ ,చిన్నగా కట్ చేసిన గుడ్డు ముక్కలు , క్రీమ్ వేసి బాగా కలిపి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఎగ్ చికెన్ కర్రీ రెడీ….