Heart Touching Life Quotes in Telugu
” నీకు వచ్చిన కష్టమే నీకు జీవిత పాఠం నేర్పిస్తుంది.. నీకు వచ్చిన కష్టాన్ని చూసి దగ్గరయ్యే వారు ఎవరు దూరం అయ్యేవారు అనేది అప్పుడే తెలుస్తుంది “
“ధనాన్ని చూసి దరి చేరే బంధువులు .. అందాన్ని చూసి కలిగే ప్రేమ … అవసరం కోసం కలుపుకునే స్నేహం … ఎప్పటికి శాశ్వతం కావు”
“మన మాటలు నచ్చనపుడు “మౌనం ” మంచిది .. మనం నచ్చనపుడు “దూరం” మంచిది … మనతో బంధం నచ్చనపుడు “ముగింపు ” మంచిది .”
“ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత భాద ఉంటుంది అయినా సరే బ్రతుకుతారు ఎందుకో తెలుసా ?రేపటి రోజున ఖచ్చితంగా సంతోషం వస్తుందనే ఆశతో .”
“అడగడం చేతకానప్పుడు ఆశించకు .. ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు …”
” జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు నిన్ను నువ్వు రూపు దిద్దుకోవడం”
“అక్కరకు రాని చుట్టం .. కష్టం వచ్చినపుడు లేని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ..”
“జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం”
“మీ సమస్యలని పరిష్కరించగలిగే ఒకరి కోడం వెతకకండి మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కొనివ్వని వారికోసం వెతకండి.”
“అన్నం లేకపోతే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే పేదరికం”
“మనిషి గొప్పదనం నమ్మకంలోనో నమ్మించడంలోనో ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది.”
“అర్ధం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నింటికీ విమర్శించేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు”
“నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నీ వాళ్ళే అని మోసపోకు ఒకసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది .”
“చచ్చాక వచ్చి మట్టి వేసే బందాలకన్నా , బ్రతికున్నపుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి ..”
“తిన్నది కడుపు నుంచి వెళ్ళిపోతుంది కానీ .. అన్నది మాత్రం మనసులో ఎప్పటికి ఉండిపోతుంది .. అందుకే తొందరపడి నోరు జారకూడదు.”
“నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు భాదపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది..”
“మోసేది .. బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది .. బాధ్యతనుకుంటే మోయాలనిపిస్తుంది ..”
“కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది .. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది.”
“బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు.”
“జీవితం ఒక ప్రయాణం… అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు .. ఎన్నో భాదలు .. ఎన్నో పరిచయాలు .. అన్ని కలిస్తేనే జీవితం .”
“విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు.. విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు..”
“పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు.”