Pradhan Mantri Mudra Loan : సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ఒక వరం..2024

Pradhan Mantri Mudra Loan : సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ఒక వరం..

Pradhan Mantri Mudra Loan:ఎలాంటి ష్యూరిటీ లేకుండా లోన్ కోసం చూస్తున్నారా… ఐతే ప్రధాన్ మంత్రి ముద్ర లోన్ మీకోసమే… ఇందులో మీరు ఎలాంటి ష్యూరిటీ రూ. 10లక్షల వరకూ రుణం పొందవచ్చు.. సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ స్కీం ఒక వరం..

ఒకరి దగ్గర పని చేయడం కాదు.. మీరే ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి.. ఇదే నేటి యువత నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు . ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశo లో యువతలో ప్రతిభకు అస్సలు కొదువులేదనేది అందరూ ఒప్పుకుంటున్ననిజం.మరి అయితే వారికి కావాల్సిందల్లా సరైన ప్రోత్సాహమే మరియు పెట్టుబడికి తగిన డబ్బులు. ఆ సమస్యనుంచి బయట పడేసి వారికీ చేయుతని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు యువత ప్రారంభించేలా ప్రోత్సాహన్ని ఈ పథకం ద్వారా అందిస్తోంది. బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన ప్రారంభ నిధిని పలు లోన్ల రూపంలో యువతకు అందిస్తోంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) ఒకటి. వ్యవసాయ మరియు ఇతర రంగాల్లో రాణించాలి అభిషలించే వారికి రుణాలిచ్చి ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా లక్షల కోట మేరు రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి, చేస్తున్నాయి కూడా . మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఔత్సాహికులు దీని ద్వారా లబ్ధిపొందారు.

Pradhan Mantri Mudra Loan ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వమే తెలియజేసింది. అయితే ఈ స్కీం ని ఎలా వినియోగించుకోవాలో చాలా మందికి ఇప్పటికీ తెలీదు. మీరు ఒకవేళ ఎదైనా చిన్న బిజినెస్ ప్రారంభించలి అనుకుంటే ..ఆ బిజినెస్ కి ఆయె పెట్టుబడి మీ దగ్గర లేకపోతే.. ఈ ముద్ర యోజన స్కీం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ లోన్ అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకుందాం….

రూ. 10లక్షల వరకూ రుణం పొందవచ్చు…..

ప్రధాన మంత్రి ముద్ర యోజనను 2015, ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. తయారీరంగం, ట్రేడింగ్, సర్వీసెస్ వంటి అనేక మొదలైన రంగాల్లో భారతదేశ యువత ఎవరైనా దీనిలో రుణం తీసుకోవచ్చు. ఎటువంటి ష్యూరిటీ, తనఖా అవసరం లేకుండా రూ. 10లక్షల వరకూ రుణం ఈ పథకం ద్వారా మంజూరు చేస్తారు.

Pradhan Mantri Mudra Loan కొత్త వారికి కూడా..


మీరు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే .. అందుకు తగిన పెట్టుబడి నిధి మీ వద్ద లేకుంటే మీరు ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇప్పటికే మీరు ఏదైనా చిరు వ్యాపారం చేస్తున్నట్లు అయితే దానిని విస్తరించేందుకు కూడా ఈ స్కీం సహాయపడుతుంది. ఈ పథకం లో ఎటువంటి ష్యూరిటీ అవసరం లేదు. అలాగే ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం కూడా లేదు .

ముద్ర రుణాల్లో రకాలు..

పీఎం ముద్ర యోజనలో మూడు రకాల రుణాలు తీసుకోవచ్చు. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విధాలుగా రుణాలని అందజేస్తురు. శిశు రుణాలు అంటే రూ. 50వేలు, కిశోర్ లోన్ క్రింద మీరు రూ. 50,001 నుంచి రూ. 5లక్షల వరకూ ఋణం పొందవచ్చు, తరుణ్ లోన్ క్రింద మీరు రూ. 5,00,001 నుంచి రూ. 10లక్షల వరకూ రుణం తీసుకొవచ్చు. వ్యక్తులు వారి అవసరాన్ని బట్టి వీటిల్లో ఏదైనా స్కీం ని ఎంపిక చేసుకోవచ్చు.

పథకాన్ని ఎవరిస్తారు..


ఈ ముద్ర రుణాలను వివిధ బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వీటిని ఇస్తున్నాయి. మీరు దీనికి దరఖాస్తు చేసుకుంటే.. ఎంత మొత్తం కావాలని మీరు దరఖాస్తు చేసుకున్నారో దానిలో 10% మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 90% రుణంగా మీరు శాఖలను ఎంచుకున్నారో వారు మంజూరు చేస్తారు.

పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి..


Pradhan Mantri Mudra Loan ముద్ర లోన్ కోసం మీరు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://www.udyamimitra.in/ వెబ్ సైట్లో కి వెళ్లి, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇతర బిజినెస్ పత్రాలు(బ్యాంక్ స్టేట్ మెంట్, ఐటీఆర్, పాన్ కార్డు వంటివి) బ్యాంకులో అందించాల్సి ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!