పుదీనా ఆకులతో ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా..? Pudina in Telugu : 2024 Mint Leaves in Telugu

పుదీనా ఆకులతో ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా..? Pudina in Telugu : 2024 Mint Leaves in Telugu

Pudina in Telugu : ప్రకృతి ప్రసాదించిన వాటిలో పుదీనా కూడా ఒకటి. తాజాదనాన్ని ఇచ్చే మరియు ఎన్నోరకాల ఆరోగ్య సుగుణాలు ఉన్నటువంటి ఆకు ఈ పుదీనా . పుదీనాను మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడానికి పుదీనా వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. మంచి రుచితో పాటు దాని మంచి సువాసన కూడా కలిగి ఉండే పుదీనా జ్యూస్ ను తీసుకోవడం వల్ల, మరియు పుదీనా ను టీ చేసుకుని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Pudina in Telugu : మన తెలుగింటి ప్రత్యేకమైన వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే. ఇక పుదీనా గురించి చెప్పాలంటే , తేనీటి నుంచి మొదలు పెడితే ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగన జరుగుతుంది . చాలా సలాడ్స్‌లో, డెజర్ట్స్‌లో కూడా పుదీనాను వాడుతారు. ఇక చాలా మంది ఫేవరైట్ అయిన బిర్యానీల వంటకాలలో ఈ పుదీనా బాగా వాడుతారు. నాన్ వెజ్ వంటకాల్లో చాలా వరకు పుదీనా వాడతారు. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ పుదీనాలో ఏముంది? పుదీనా అంటే అంత స్పెషల్. ముందుగా పుదీనా ఆకుల్లో ఉండే పోషకాలను తెలుసుకుందా.

ప్రతి 100 గ్రాముల పుదీనాలో ఉండే పోషక విలువలు:

  • క్యాలరీలు 70
  • టోటల్ ఫ్యాట్ – 0.9 గ్రాములు
  • శాచ్యురేటెడ్ ఫ్యాట్ — 0.2 గ్రాములు
  • సోడియం – 31 మి.గ్రా.
  • పొటాషియం – 569 మి.గ్రా.
  • కార్బొహైడ్రేట్లు — 15 గ్రా.
  • డైటరీ ఫైబర్ – 8 గ్రాములు
  • ప్రోటీన్ – 3.8 గ్రాములు

పుదీనాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

Pudina in Telugu : ఇక ఇందులో విటమిన్ A , విటమిన్ C, ఐరన్ మెండుగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B 6, మాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి.

=> కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ A పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

=> పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడడంతో పాటు . ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది.

=> పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి IBS అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అకస్మాత్తుగా నొప్పితో కలిగేటువంటి విరేచనాలు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండే క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని ఆ అధ్యయనాల్లో తేలిందని,చెప్పారు.

mint leaves in telugu :

=> పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీగా చెప్పవచ్చు. భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ ఒక దారికొస్తాయన్నట్టే… బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి అని ఈ పుదీనాని వేయడం జరుగుతుంది.

=> చిన్నారులకు చనుబాలు పట్టే తల్లులు చనుమొనలు పగిలినప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా రసం రాస్తే అది నయం అవుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది.

=> Pudina in Telugu : జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది. ముక్కు నుంచి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో పుదీనా డీకంజెస్టెంట్‌గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా కూడా ఉపశమనం లభిస్తుంది.

=> నోట్లో ఉన్న బ్యాక్టీరియాను మట్టుబెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా పని తీరు బాగా పనిచేస్తుంది.

=> పుదీనాలో ఉండే విటమిన్లు, యాంటాక్సిడెంట్ల మీ ఇమ్మ్యూనిటీ పవర్ ను పెంపొందిస్తాయి.

=> పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ యాసిడ్, విటమిన్ A కారణంగా మొటిమలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇదొక క్లెన్సర్‌గా, మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.

=> పుదీనా ఆకుల్లో ఉండే కెరోటీన్, యాంటాక్సిడంట్లు మీ జుట్టు పెరగడంలో సాయపడడంతోపాటు, జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పేలను, చుండ్రు సమస్యలను తొలగిస్తాయి.

Disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me