Ragi Groundnut Laddu : ఈ ఒక్క లడ్డుని తినండి…ఎన్నో రకాల ఆరోగ్యాల సమస్యలకు చెక్ పెట్టండి…!2024

Ragi Groundnut Laddu : ఈ ఒక్క లడ్డుని తినండి…ఎన్నో రకాల ఆరోగ్యాల సమస్యలకు చెక్ పెట్టండి…!

Ragi Groundnut Laddu : ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో చాల వరకు ఆహార అలవాట్లు మారుతు ఉన్నాయి. వాటివల్ల మనం ఎన్నో రకాల సమస్యల బారిన పడుతు ఉన్నం. వయసుతో సమందం లేకుండా అనేక రోగాల బారిన పడుతున్నారు నేటి జనాలు. మరి అలంటి ఆరోగ్య సమస్యలు మొదలైనవి షుగర్, హెయిర్ ప్రాబ్లమ్స్ , స్కిన్ ప్రాబ్లమ్స్ , అధిక బరువు, మోకాళ్ల నొప్పులు సమస్యల నుంచి ఈ లడ్డుని తినడం ద్వారా నయం చేసుకోవచ్చు.

వివిధ న్యూట్రిషనిస్టులు రాగి వేరుశనగల లడ్డులను క్రమంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తున్నారు. రాగి వేరుశనగల లడ్డులలో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ మరియు అంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మరి ఇన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన రాగి వేరుశెనగ లడ్డులని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

  • రాగి పిండి : ఒక కప్పు
  • నెయ్యి : 4లుగు స్పూన్లు
  • వేరుశెనగలు : ఒకటిన్నర కప్పు
  • బెల్లం : ఒక కప్పు (తరిగి పెట్టుకోవాలి )
  • యాలకుల పౌడర్ : ఒక సగం చెంచా
  • నీరు : కొద్దిగా

రాగి వేరుశనగల లడ్డు తయారీ కోసం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసి దాని పై పాత్రని పెట్టుకోవాలి, అందులో నెయ్యి వేసి,కాస్త వేడి అయ్యాక ఒక కప్పు రాగి పిండిని వేసి, దానిని వేయించాలి పొడిగా అయేదాకా వేయించాలి అది మాడకుండా చూసుకోవాలి, పిండి కాబ్బటి తొందరగా మడిపోయే అవకాశాలు ఎక్కువ.వేయించుకున్నాక ఆ మిశ్రమాన్ని వేరే పాత్రలోకి తీసుకోని పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో ఒకటిన్నర కప్పు పల్లీలను వేసి అవి మంచిగా వేయించుకోవాలి, తర్వాత వాటిని పొట్టు తీసి, పొడిని చేసి పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు పక్కం పెట్టుకోవడానికి మీరు ఎంచుకున్న పాత్రలో ఒక కప్పు బెల్లం వేసి, పాకానికి సరిపడా నీళ్ళని అందులో పొయ్యాలి…పాకం బాగా మరిగి తీగా పాకం రాగానే అందులో రాగి పిండి, వేరుశెనగ పొడిని, యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి చిక్కపడ్డాక స్టవ్ బంద్ చేసుకోవాలి, ఆ తరువాత ఆ మిశ్రమం గట్టిగా కాకముందే చిన్న చిన్న లడ్డులాగా గుండ్రంగా చేసుకోవాలి..మిశ్రమం వేడిగా ఉంటుంది కాబ్బట్టి చేతులకి కాస్త నెయ్యి ని రాస్కొని చేస్తే లడ్డులు స్మూత్ గ వస్తాయి.

  • రాగి లో కాల్షియమ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబ్బట్టి మోకాళ్ల సమందిత నొప్పుల నుంచి దూరంగా ఉండొచ్చు.ఇది ఎముకలను బలోపితం చెయ్యడంలో తోడ్పడుతుంది.
  • అదే విధంగా రాగి వేరుశనగల లడ్డు రోజు తీసుకుంటే రక్త హీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఈ లడ్డులో వేరుశెగలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.
  • రోజు ఈ లడ్డుని తినడం వల్ల జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది. డైయాబెటిక్ వచ్చే సూచనలను తాగిస్తుంది.
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me