ఎంత తొలగించినా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? – ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక! Refrigerator in Telugu.
రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం – ఈ చిట్కాలు పాటించారంటే ఆ సమస్య నుండి పరిష్కారం దొరికినట్లే.!
Friz ఫ్రీజర్‌లో ఐస్ ఏర్పడడం సహజమే ! కానీ.. కొన్ని రిఫ్రిజిరేటర్లలో ఇది అసాధారణంగా ఫామ్ అవుతుంటుంది. తరచూ తొలగించినా ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డల్లాగా ఏర్పడుతూ.. ఆ ప్లేస్ మొత్తం ఆక్రమిస్తుంటుంది. అయితే, దీన్ని అలాగే వదిలేస్త్ అందులో స్టోర్ చేసుకునేటువంటి ఆహార పదార్థాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నారు నిపుణులు.
Refrigerator in Telugu : ముఖ్యంగా మనం పెట్టే ,పదార్థాల్లోని తేమను తొలగించి. వాటిని పొడిగా, గట్టిగా మారి,అవి రంగు-రుచి , వాసనను కోల్పోయేలా చేస్తుందంటున్నారు.
అంతేకాకుండా,ఫ్రీజర్‌లో ఈ విధంగా అధిక మొత్తంలో ఐస్ అనేది పేరుకుపోవడం రిఫ్రిజిరేటర్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. మీ ఇంట్లో ఇలాంటి సమస్యనే ఉంటే, కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ఇటు ఫ్రీజర్‌ను క్లీన్‌గా ఉంచుకుంటూనే.. అటు రిఫ్రిజిరేటర్ పనితీరునూ పెంచుకోవచ్చంటున్నారు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొంతమంది చీటికిమాటికి ఫ్రిజ్ తలుపులు ఓపెన్ చేస్తుంటారు. ఇంకొందరు డోర్ ఎక్కువసేపు తెరిచి ఉంచుతుంటారు. అలాకాకుండా అవసరమున్నప్పుడే ఫ్రిజ్ డోర్ తీయడం, వెంటనే మూయడం మంచిదంటున్నారు నిపుణులు.
Refrigerator in Telugu : అదేవిధంగా.. తలుపులకు ఉన్న రబ్బర్ సీలింగ్ గ్యాస్కెట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు. లేదంటే,వీటిని మీ ఫ్రిజ్ కంపెనీని బట్టి 2-5 సంవత్సరాల మధ్య కాలంలో చేంజ్ చేసుకోవడం బెటర్. దీనివల్ల ఫ్రీజర్/ఫ్రిజ్ పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
అలాగే మీ Refrigerator మోడల్‌ని బట్టి,మాన్యువల్‌లో పొందుపరిచినట్లుగా Freezer thermostat లో సంబంధిత సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల కూడా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
కొన్నిRefrigerator లలో ఆటో డీఫ్రాస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది.మరికొన్నింటిలో ఈ ఆప్షన్ ఉండదు. అలాంటి సందర్భాల్లో కూలింగ్ సిస్టమ్‌తో సంబంధం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో మనమే Defrost బటన్ నొక్కాలనే విషయం గుర్తుంచుకోవాలి. దాని ద్వారా అప్పటిదాకా ఫ్రీజ్ లో పేరుకున్న ఐస్ అంతా కరిగిపోయి,ఫ్రీజర్‌లో ఎక్కువ మొత్తంలో ice పేరుకోకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.
మనం ఆహార పదార్థాలు, కూరగాయలను స్టోర్ చేసుకునే క్రమంలో కొన్నిసార్లు వాటి అవశేషాలు, ద్రావణాలు, ఐస్‌క్రీమ్.వంటివి ఫ్రీజర్‌లో పడిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆయా డస్ట్ ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిదంటున్నారు. అలాగే, నియమించిన వ్యవధుల్లో ఫ్రిజ్/ఫ్రీజర్‌ను బేకింగ్ సోడా మిశ్రమంతో క్లీన్ చేసుకోవడం వల్ల రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసనలు రాకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.
అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రీజర్‌లో అవసరమైన వస్తువులే ఉంచేలా చూసుకోవాలి. అంతేకానీ,ఖాళీ లేకుండా అన్నీ అందులో పెట్టేయకూడదు. ఈ విధంగా ఫ్రీజ్ ఎంత ఖాళీగా ఉంటే,అంత అధిక మొత్తంలో ఐస్ పేరుకుపోకుండా ఉంటుందని,ఇలా ఫ్రిజ్ శుభ్రంగానూ ఉంటుందంటున్నారు.
అలాగే.. ఫ్రిజ్/ఫ్రీజర్‌ను కిటికీలు, వేడి ఉత్పత్తి చేసే వస్తువులకు దూరంగా ఉంచడం బెటర్. ఎందుకంటే.. ఇది కూడా ఫ్రీజర్‌లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోకుండా చేస్తుందని చెబుతున్నారు.
Refrigerator in Telugu : ఇకపోతే.. చాలామంది రిపేర్‌కొచ్చే దాకా కానీ రిఫ్రిజిరేటర్ గురించి పట్టించుకోరు. అలాకాకుండా సంవత్సరానికి ఒకసారి అయినా కనీసం ఫ్రిజ్ కాయిల్స్‌ని శుభ్రం చేయించడం, వాటర్ ఫిల్టర్స్‌ని చేంజ్ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇది కూడా ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నేలా, ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోకుండా ఉండడానికి తోడ్పడుతుందంటున్నారు.