వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయిజనాలు తెలిస్తే ఈ రోజే తినడం మొదలు పెడతారు Walnuts in Telugu

వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయిజనాలు తెలిస్తే ఈ రోజే తినడం మొదలు పెడతారు Walnuts in Telugu

వాల్ నట్స్ వీటిని తెలుగు లోఆక్రోట్స్ అని కూడా అంటారు: నేటి బిజీ లైఫ్ లో చాలా మందికి తమ ఆరోగ్యం పైన శ్రద్ద వహించడం కుదరడం లేదు దాని వల్ల మనకు అనేకమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది . అయితే మనం కొంచెం మన ఆరోగ్యం మీద శ్రద్ద వహిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది . అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు మనం సొంతం చేసుకోవచ్చు , అందులో వాల్ నట్స్ చాల ముఖ్యమైనవి అని చెప్పాల్సిందే . వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది . వాల్ నట్స్ మన ఆహారంలో భాగంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా హెల్తీ గా ఉండవచ్చు . వాల్ నట్స్ లో మనకు లభించే అనేక రకమైన ఉపయోగాలవల్ల వీటిని డ్రై ఫ్రూప్ట్స్ లో “రారాజు” అని కూడా పిలుస్తారు వాల్ నట్స్ ని మనం రాత్రంతా నానబెట్టి ప్రొద్దున కాళీ కడుపుతో తినడం వాళ్ళ మనకు చాల వరకు ఉపయోగాలు ఉన్నాయి .

వాల్ నట్స్ వినియోగం వాళ్ళ మనకు అనేక రకమైన సమస్యలు తొలగిపోతాయి వాల్ నట్స్ మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది . వాల్ నట్స్ లో చాలా రకాల విటమిన్లు ఖనిజాలు ఫైబర్ అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి .
అలాగే వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు , ఆంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉండే పోషకమైన గింజలు.
— వాల్ నట్స్ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి


వాల్ నట్స్ లో అధిక స్థాయిలో ఆల్ఫా లీనో లెనిక్ ఆసిడ్ ( ALA ) , ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది గుండె వాపుని తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది . ఇవి అంటి ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిలో పోరాడటానికి సహాయపడతాయి అలాగే ఇవి గుండె జబ్బులతో ఉన్నవారికి కోలుకోవడంతో సహాయం చేస్తాయి.

వాల్ నట్స్ లోని ఒమేగా – 3, ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు అభిజ్ఞ పని తీరుని మెరుగు పరుస్తాయి అవి న్యూరో డై జెనరేటివ్ వ్యాధులు రాకుండా ఉండడానికి రక్షిస్తుంది .

క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాల్ నట్స్ వాటి యొక్క అధిక ప్రోటీన్ ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల కారణంగా బరువు తగ్గడంతో ఉపయోగపడతాయి ఇది మీకు పూర్తి మరియి సంపృప్తిని కలిగించడంలో సహాయ పడుతుంది.

వాల్ నట్స్ లో ఫాలీ ఫెనాల్స్ తో సహా ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి , ఇవి ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి .

వాల్ నట్స్ లోని ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు మరియు ఆంటీ ఆక్సిడెంట్లు , Anti Inflammatory ప్రభావాలను కలిగి ఉంటాయి ఇవి గుండె జబ్బులు కాన్సర్ మరియు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించగలవు .

కొన్ని అధ్యయనాలు వాల్ నట్స్ లు రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరచడంలో మరియు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి , ఇది మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రయోజనకారిగా ఉంటుంది. వీటిని ముందునుంచే మన డైట్ లో చేర్చుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.

వాల్నుట్స్ లో ఫైబర్ మరియు పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు మద్దతు ఇస్తాయి.ఇది జీర్ణ క్రియ మరియు మొత్తం ఆరోగ్యానికి అవసరం.

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు, ప్రోటీన్ ఫైబర్, విటమిన్లు (విటమిన్ -E ,విటమిన్-B ) వంటివి మరియు మినరల్స్ (మెగ్నీషియం మరియు పాస్పరస్ వంటివి)ని బాగా కలిగి ఉంటాయి.

వాల్నట్స్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని డాక్టర్లు మరియు నిపుణులు చెప్తూ ఉంటారు.వాల్నట్స్ లో అనేకరకమైన పోషకాలు విలువలు కలిగి ఉంటుంది. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండడం వలన తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి చాల అవసరం. అంతే కాకుండా వాల్నట్స్ లో మంచి మొత్తంలో ఫోలేట్ (folate) ఉండడం వల్ల పిల్లలలో న్యూరల్ ట్యూబ్ లోపాలని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే వీటిని ప్రెగ్నెన్సీ మొదటి వరం నుంచే తీసుకోవడం మంచిది.

వాల్నట్స్ వల్ల జుట్టు సమస్యలు మొదలగు డాండ్రఫ్ ,జుట్టు ఊడిపోవడం , పొడిబారిన జుట్టు,మరియు పల్చబడిన జుట్టు వంటి వాటికీ వాడటం వాళ్ళ మంచి రిసల్ట్ పొందవచ్చు. జుట్టు తొందరగ తెల్లబడే సమస్యల నుంచి కూడా వాల్నట్స్ వాడటం వాలా నయం చేసుకోవచ్చు. అలాగే వాల్నట్స్ ని రోజు తినడం వాలా జుట్టు సమస్యల బారిన పడకుండా తపించుకోవచ్చు.

డార్క్ సర్కిల్స్, చర్మ ముడతలు, పొడిబారిన చర్మం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వాల్నట్స్ ని నానబెట్టి వాటిని మెత్తగా నూరి మన చర్మం పైన అప్ప్లయ్ చేసుకోవడం ద్వారా మంచి రిసల్ట్ పొందవచ్చు. చర్మ బాక్టీరియా నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. వాల్నట్స్ లో విటమిన్-E ద్వారా మన చర్మం కి అనేక లాభాలు పొందవచ్చు.


మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ వున్న వాల్నట్స్ ని రోజు మన ఆహారంలో తూచా తప్పకుండా తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం. వాల్నట్స్ తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. మరియు బరువు తగ్గడంలో కూడా ఉపకరిస్తుంది. వీటిని రోజువారి దినచర్యలో భాగంగా తీసుకోమని నిపుణులు చెపుతువుంటారు.
వాల్నట్స్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి, వాటిలో వుండే అధిక క్యాలరీలు కంటెంట్ కరణంగా అధిక పరిమాణంలో కాకుండా సమతూల్య పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సిఫారెస్ చెయ్యడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me