Telangana Bonalu తెలంగాణ లో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు?

తెలంగాణ బోనాల ప్రాముఖ్యత :

బోనాలు ఒక హిందువుల పండుగగా చెప్పవచ్చు ఈ బోనాల పండుగ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాలూ అయినా హైదరాబాద్ & సికింద్రాబాద్ లో మరియు ఇతర ప్రాంతాలలో గ్రామాలలో జరుపుకుంటారు

ఈ బోనాల పండుగ సాధారణంగా జులై మరియు ఆగష్టు నెలలో వచ్చేటువంటి ఆషాడ మాసంలో జరుపుకుంటారు ఈ పండుగ మొదటి మరియు చివరి ఆదివారం రోజులలో అమ్మవారులైన ఉజ్జయిని మహంకాళి , బల్కంపేట ఎల్లమ్మ , పోచమ్మ , కట్ట మైసమ్మ , ముత్యాలమ్మ ఇలా అందరి అమ్మవార్ల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు ” బోనం” అంటే తెలుగులో భోజనం అని అర్ధం గా చెప్తారు. ఇది మాతృ దేవికి నైవేద్యం .
బోనం అనేది మట్టి కుండలో గాని ఇత్తడి కుండీలో గాని వండుతారు. ఈ నైవేద్యాన్ని పాలు, బెల్లం, బియ్యం తో కలిపి పరమాన్నాన్ని వండిన మట్టి కుండను లేదా ఇత్తడి పాత్రను పసుపు , కుంకుమ , గంధాలతో బొట్టు పెట్టి అమ్మవారి ప్రతిమను కూడా కుండపై దించి పూలతో , వేపాకులతో బోనాన్ని అలంకరించి,తర్వాత మహిళలు కూడా అలంకరణ చేసుకుని వారియొక్క కాళ్ళకి పసుపు రాసుకుని మొహానికి కాటుక , బొట్టు , గంధం , పూలని ధరించి,బోనం ని తలలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో, పోతురాజుల వీరంగంతో దేవాలయాలకు తీసుకెళ్లి అమ్మవారికి గాజులు , చీరలు , పూలతో మరియు ఒడి బియ్యాలతో టెంకాయలు కొట్టి ఈ బోనాలని వివిధ రూపాలలో ఉన్న అమ్మవార్లకు సమర్పిస్తారు.


ఈ పండగ యొక్క చరిత్ర 1813 వ సం..లో జంట నగరాలైన హైద్రాబాద్ & సికింద్రాబాద్ నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వెలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికి నియమించడం జరిగింది.మరియు హైద్రాబాద్ లో ప్లేగు వ్యాధి గురించి ఆందోళన చెందారు. సైనిక బెటాలియన్ను మద్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో మహంకాళి అమ్మవారైనా మాతృదేవతకు ప్రార్థనలు చేయడం జరిగింది. ప్రజలు ఈ అంటువ్యాధి నుండి విముక్తి పొందినట్లయితే వారు విగ్రహాన్ని వ్యవస్థాపించి,మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాం అని మ్రొక్కడం తో ఈ వ్యాధిని,ఆ మహంకాళి అమ్మవారు నిలిపివేయడంతో అప్పుడు అందరు ఆ అమ్మవారిని ప్రతిష్టించి,బోనాలను సమర్పించుకోవడం జరిగింది. ఇలా ఈ వ్యాధి వ్యాప్తి నిలిచిపోయినట్లు భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం.


బోనాలు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు.ఈ పండుగను ఆషాడం మొదటి ఆదివారం రోజున తొలి బోనం గా గోల్కొండ కోటవద్ద వున్నా జగదాంబిక అమ్మవారికి బంగారు బోనoతో తమ తమ కానుకలను,మ్రొక్కులను సమర్పించుకుంటూ ఈ బోనాలను మొదలు పెడుతూ ప్రారంభిస్తారు. తరువాత సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి, రెండవ ఆదివారం చిల్కలగూడలోని పోచమ్మ,కట్టమైసమ్మ మరియు లాల్ దర్వాజ ఆలయాలకు,జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో,హైద్రాబాద్ లోని ఓల్డ్ సిటీ హరీబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండలోని ముత్యాలమ్మఅమ్మవార్లకు మరియు గ్రామాలలో గ్రామదేవతలకు మరియు ఇతర దేవాలయాలకు ఈ బోనాలను ఒక్కో ఆదివారం చొప్పున సమర్పించుకుంటారు.


Telangana Bonalu సందర్బంగా ఆడపడుచులు మహిళలందరూ సాంప్రదాయ దుస్తులతో చీరలు,లంగాఓణీలతో,ఆభరణాలతో అలంకరణ చేసుకుంటారు. ఈ బోనాలని తలపై ఎత్తుకొని దేవత గౌరవార్థం శబ్దాలు చేస్తూ పూనకాలతో నృత్యం చేసుకుంటూ, ఈ బోనాలు మోసే స్త్రీలు మాతృదేవత యొక్క ఆత్మను కలిగి వున్నారని నమ్ముతారు.అలాగే తమ మ్రొక్కులలో భాగంగా అమ్మవారులకు మేకలను,పొట్టేళ్లను మరియు కోళ్లను కూడా బలిస్తారు.


పోతురాజు యొక్క వేషాధారణకు ఒక ప్రతేక్యమైన స్థానాన్ని కలిగి ఉంది. పోతురాజు మాతృదేవత యొక్క సోదరుడిగా పరిగణించబడుతాడు. ఆతను వేషధారణలో తన ఒంటికి పసుపు రాసుకొని నుదిటిన సింధూరాన్ని పెద్దదిగా పెట్టుకొని,కళ్ళకి కాటుకని ధరించి ఎర్రటి దోతిని కట్టుకొని మరియు కళ్ళకి గజ్జెల శబ్దంతో తన చేతిలో ఈరగోలతో ఫలహారం బండి (తోట్ల బండి ) ముందు అమ్మవారి ఊరేగింపులో నృత్యాలు చేస్తూ ఉంటారు.
విందు :
ఈ బోనాలు అనేవి హిందువుల ప్రత్యేకమైన పండగ కాబట్టి ఇక్కడ పెట్టె అమ్మవారి ప్రసాదాన్ని దైవప్రసాదంగా ప్రతీ యొక్క కుటుంబాలు తీసుకోవడమే కాకుండా వారి యొక్క అతిధులకు కూడా పంచుకుంటారు. పండగ మరుసటి రోజు జరిగే “రంగం” కార్యక్రమంలో అమ్మవారిని తనపైకి ఆహ్వానించుకునే ఆచారం ఉంటుంది. ఇలా అమ్మవారిని ఆహ్వానించుకున్న వ్యక్తి తన భక్తులకు తమ భవిష్యత్తు గురించి మరియు ఈ సంవత్సరంలో జరిగేవి, వచ్చే సంవత్సరంలో జరిగే ఫలితాల గురించి ముందుగానే భవిష్యవాణి వివరరంగా వివరిస్తుంది. ఈ భవిష్యవాణి చెప్పేటపుడు తను పచ్చికుండ పైన నిలుచోని చెప్తుంది.

ఇలా తెలంగాణ లో జరిగే Telangana Bonalu ఆషాఢమాసంలో ఎంతో ఘనంగా ఈ బోనాల పండగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు, ప్రతి సంవత్సరం ఈ పండగను విందు వినోదాలతో జరుపుకోవడం ఆనవాయితీ , ముందుగా ఈ బోనాల పండగను గోల్కొండ కోట నుండి మొదలుకుని చివరగా లాల్ దర్వాజా లో ముగుస్తుంది, ముఖ్యంగా ఈ బోనాల పండుగను ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ బాగుండాలని ఎటువంటి విపత్తులు జరగకూడదని అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండగని ముగిస్తారు .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me