Telangana Lrs : LRS మల్లి మొదలు…..2024

Telangana Lrs : LRS మల్లి మొదలు…..2024

Telangana-Lrs

Telangana Lrs : తెలంగాణలో మళ్లీ లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇత‌ర ఉన్నతాధికారుల‌తోస‌మీక్షా స‌మావేశం నిర్వహించారు

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని అధికారులకు సూచించారు.

2020లో ఆగస్టు31 నుంచి అక్టోబర్31 వరకు రెండు నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు అందించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజ‌ల‌కు ఇబ్బందులు లేకుండా LRS ప్రత్యేక టీముల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

ద‌ర‌ఖాస్తులు వేగంగా ప‌రిష్కరించాల‌ని సూచ‌న‌లు చేశారు. అధికారుల‌తో మీటింగ్ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత ప‌టిష్టంగా Lay out రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమ‌వుతోందని తెలియజేశారు. ఎల్.ఆర్‌.ఎస్ విధివిధానాల‌పై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు నిర్వహించారు.

Telangana Lrs వ‌ల్ల ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఎల్ఆర్ఎస్ అనుమ‌తుల కోసం ప్రజలు చేసుకున్న ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా ప‌రిష్కరించాల‌ని ఉప ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచ‌న చేశారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక టీంను రూపొందించాల‌ని చెప్పారు. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డెప్యుటేష‌న్ తీసుకోవాలి అని ఆదేశాన్ని జారీ చేసారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ రామ‌కృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట అమ్రపాలి, గృహ‌నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యద‌ర్శి విపీ గౌత‌మ్ తదిత‌రులు పాల్గొన్నారు.

Telangana Lrs మరోవైపు తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు త్వరలోనే న‌గారా మోగ‌నుంది. రాబోయే మరికొన్ని రోజుల్లోనే ఎన్నిక‌ల ప్రణాలికను విడుద‌ల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను August మొదటి వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. పంచాయితీ రాజ్ ఎన్నికలు , కార్యాచరణపై Friday నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr.Br. Ambedkar ) స‌చివాల‌యంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. september లేదా October పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!