రోజూ ఒక గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తింటే..,ఈ సమస్యలు మీ దరి చేరవు…Uses of Sunflower Seeds in Telugu : 2024 రోజూ ఒక గుప్పెడు పొద్దుతిరుగుడు
Uses of Sunflower Seeds in Telugu: పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఇవి పొద్దుతిరుగుడు పూల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గింజల నుంచి తీసిన వంట నూనెను చాలా వరకు ఎక్కువ మంది తమ వంటలలో రోజూ వినియోగిస్తూ ఉంటాం . వీటిలో ఉండే అధిక పోషకాల కారణంగా ఇవి బాగా పాపులర్ అయ్యాయి అని చెప్పవచ్చు. పొద్దుతిరుగుడు గింజలను పచ్చిగా , లేదా వేయించి కూడా తినొచ్చు. కొన్ని రకాల వంటకాల్లో కూడా మనం జత చేసుక్కోవచ్చు.
Uses of Sunflower Seeds in Telugu: సన్‌ఫ్లవర్ సీడ్స్ మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతాయి. దీనిలో ఎన్నోరకాల పోషకాలు, కొవ్వులు, ఫైబర్ కంటెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని మంచి ఆరోగ్యకరమైన చిరుతిండిగా చెప్తుంటారు. మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే పోషక విలువలు:
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ B1, రైబోఫ్లావిన్ (విటమిన్ B2), నియాసిన్ (విటమిన్ B3), ఫాంటోథెనిక్ యాసిడ్ (విటమిన్ B5), విటమిన్ బీ6, విటమిన్ E , ఫోలేట్స్, ఇనుము , కాపర్, జింక్, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఒక పావు కప్పు వేయించిన సన్‌ఫ్లవర్ సీడ్స్ నుండి 205 క్యాలరీలు లభిస్తాయి. ప్రొటీన్ 5.7 గ్రాములు, కొవ్వు 18 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 7 గ్రాములు లభిస్తాయి. అలాగే 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:
Uses of Sunflower Seeds in Telugu: అధిక రక్త పోటు , హృదయ జబ్బులు వృద్ధి వ్యాప్తి చెందకుండా పొద్దుతిరుగుడు గింజలు కాపాడుతాయి. మీ యొక్క ఇమ్మ్యూనిటి పవెర్ ని పెంపొందించేందుకు, అలాగే మీ శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. సెలీనియం, జింక్ ఉండడం వలన మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గర్భం దాల్చాలని ప్రయత్నించే మహిళలలో మరియు గర్భం దాల్చిన వారికి కూడా ఇందులో ఉండే ఫొలేట్స్ చాలా మేలు చేస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను పుష్కలంగా విరివిగా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి దోయడపడుతుంది. ఇది వైరస్‌లతో పోరాడటానికి మన శరీరానికి అవసరమైన జింక్ ను కూడా అందిస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు హృదయారోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరంలో బాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు వంటి హృదయ జబ్బుల ప్రమాదము రాకుండా కృషి చేస్తాయి.
Uses of Sunflower Seeds in Telugu: ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి ఇన్ ఫ్లమ్మేషన్ అంటే కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి, అదేవిదంగా దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధుల భారిన పడకుండా కూడా తోడ్పడుతాయి.
ఈ గింజల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బరువు ఎక్కువగా ఉండి , బరువు తగ్గాలనుకునేవారు వీటిని ప్రతిరోజూ వారి యొక్క డైట్ లో చేర్చుకోవాలి. . ఇవి తీసుకోవడం వలన కడుపు త్వరగా నిండిన భావన కలిగేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ ఉండడం వలన ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గుతారు.
Uses of Sunflower Seeds in Telugu : పొద్దుతిరుగుడు విత్తనాలు మన చర్మంలో కొల్లాజెన్ అనే హార్మోన్ ఉత్పత్తి యొక్క పెరుగుదలను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి, చర్మం కాంతివంతంగా మారేలా చేయడమే కాకుండా యవ్వనంగా కూడా ఉండే విదంగా కూడా చేయడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో విటమిన్ E కూడా ఉంటుంది, ఇది అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండేందుకు తనవంతు సహాయాన్ని అందిస్తుంది. హానికరమైన యువి కిరణాల ప్రభావం మన చర్మంపై పడకుండా కూడా ఇది రక్షిస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాల ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. పొట్ట లేదా కడుపు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రేగు కదలికలను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
Uses of Sunflower Seeds in Telugu: మహిళల తో పటు పిల్లలు కూడా కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో సన్ ఫ్లవర్ సీడ్స్ ఒకటి అని చెప్పవచ్చు. ఇవి ఎముకలను లేదా బోన్స్ ని బలోపేతం చేయడానికి అంటే, వాటి దృఢత్వానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి ఎముకల యొక్క సాంద్రతను కూడా మెరుగుపరుస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా మంచి ఉపయోగకారిగా చెప్పవచ్చు.
రోజుకు గుప్పెడు సన్ ఫ్లవర్ సీడ్స్ ని అల్ఫాహార సమయంలో తినేందుకు ప్రయత్నించండి. లేదా సాయంత్రం స్నాక్ రూపంలో అయినా తినడానికి ప్రయత్నించండి. ఇలా తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో పోషకాలను అందించడమే కాకుండా మంచి ఆరోగ్యము తో పాటు అందమైన సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోనెలా చేస్తాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎంత మేర వరకు తినొచ్చు:
పొద్దు తిరుగుడు గింజలు పోషకాలతో పాటు అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారంగా చెప్పవచ్చు . అందువల్ల అధిక మొత్తంలో తినడం వల్ల కూడా బరువు పెరిగే ముప్పు ఉంటుంది. కాబట్టి రోజుకో పావు కప్పు వరకు తినడం సరిపోతుంది. వేయించినప్పుడు ఉప్పును కలపకపోవడం వలన మంచి మేలు చేస్తుంది. గింజలకు ఉండే పొర (షెల్) తొలగించుకొని తినేలా అలవాటు చేసుకోవాలి.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను సలాడ్స్‌లో, ఓట్స్ మీల్‌లో కలపడం ద్వారా కూడా వాటిని తినొచ్చు. అలాగే బర్గర్స్, బేకరీ ఫుడ్స్‌లో కలుపుకోవచ్చు. పీనట్ బటర్‌కు బదులుగా సన్‌ఫ్లవర్ సీడ్స్ నుండి తయారుచేసిన బటర్ ని వాడుకోచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ నుండి నూనె రూపంలోనూ కూడా వాటి పోషకాలను పొందవచ్చు.
గమనిక :
ఇందులోని అంశాలు కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే తీసుకోవడం జరిగింది. పై సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహాల సూచన మేరకు అందించడం జరుగింది. మీకు ఎటువంటి సమస్యలు , సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.