ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన ఆటగాడు ఇతనే IPL 2024 Players Acution

IPL 2024 Players Acution

క్రికెట్ లో ఎంతో మంది యువత టాలెంట్ ను బయటకు తీస్తున్న IPL 2024 Players Acution ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఈ మధ్య జరిగిన ఈ ఆక్షన్ లో ఆస్ట్రేలియా కు చెందిన మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధికంగా ధర పలికాడు మిచెల్ స్టార్క్ కోసం వేలం లో గుజరాత్ టైటాన్స్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్య తీవ్రంగా పోటీ నడిచింది చివరకు కలకత్తా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ ను (24.75 cr) ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదులక్షలకు కొనుగోలు చేసింది మిచెల్ స్టార్క్ తో సహా 2023 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ తీవ్రంగా పోటీ నడిచింది చివరిగా పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (20.5cr) ఇరవై కోట్ల యాభై లక్షలకు కొనుగోలు చేసింది.

2023 వరల్డ్ కప్ లో ఇండియా న్యూజీలాండ్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ లో చేజింగ్ లో పటిష్టమైన టీమ్ ఇండియా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేసిన డారీల్ మిచెల్ ని కొనుక్కోవడానికి అన్ని ప్రాంచైజీలూ పోటీ పడ్డాయి చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఈ డేంజరస్ బ్యాట్స్మన్ ను (14cr) పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది, ఇండియా ప్లేయర్లలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమ్ ఇండియా స్పీడ్ బౌలర్ హర్షల్ పటేల్ ని కింగ్స్ ఎలెవన పంజాబ్ జట్టు (11.75cr) పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల కు సొంతం చేసుకుంది ఇటు యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూనే సీనియర్ క్రికెటర్లకు బారి మొత్తం డబ్బులు వెచ్చించి ప్రపంచం లోనే నం 1 లీగ్ గా ఐపీఎల్ ముందుకు దూసుకుపోతుంది.

Conlusion

ఏది ఏమైనప్పటికి 2024 లో జరిగే IPL మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతోంది, అటు మొదటిసారిగా అవకాశం వచ్చిన ఆటగాళ్లు తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఎదురుచూడగా ఇటు IPL ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అలాగే వీరితో పాటు ఫ్రాంచైసీలు కూడా తాము కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారు అనే పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తుంది, మరి ఈ సారి IPL 2024 లో కప్పు ఏ జట్టు ఎగరేసుకుపోతుందో చూడాలి

Read More Articles

2024 లో రాబోతున్న కొత్త టాటా కార్లు : Upcoming Tata Cars in India in 2024

Calcium Rich Foods in telugu కాల్షియం ఎక్కువగా లభించే పదార్థాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!