Ration Card KYC : రేషన్ కార్డు ఉన్న వారికి Alert… ఇలా చేస్తేనే ఇక నుంచి రేషన్ సరుకులు

Spread the love

Ration Card KYC : రేషన్ కార్డు ఉన్న వారికి Alert… ఇలా చేస్తేనే ఇక నుంచి రేషన్ సరుకులు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల యొక్క KYC ప్రక్రియ కొనసాగుతోంది . రేషన్ కార్డులో పేరు ఉన్న వారు అంతా మీకు సమీపంలోని రేషన్ షాప్ కి వెళ్లి వేలి ముద్రలు (Finger Print ) ఇచ్చి ఈ Ration Card KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను కింది కథనంలో చూద్దాం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపుల్లో ఈ KYC ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ కార్డు లో( Ration Card ) లో పేర్లు ఉన్న వారు అంతా మీకు దగ్గరలోని రేషన్ షాప్ ( Ration Shop ) కి వెళ్లి వేలిముద్రలు ( Finger Prints ) ఇచ్చి కేవైసీ ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ను పూర్తి చేసిన వారందరికీ రేషన్ డీలర్లు ( Ration Dealers ) రషీదు ( Receipt ) ఇస్తున్నారు . దానిపైన మీ పేరుతో పాటు ఆధార్ నంబర్ అలాగే రేషన్ కార్డు నంబర్ కూడా ఉంటాయి.

Ration Card KYC Advantages

తెలంగాణ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులు అలాగే అసలైన కార్డులు ఉన్న లబ్ధిదారులను గుర్తించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ రేషన్ కార్డు కేవైసీ ( KYC ) ప్రక్రియ ను మొదలు పెట్టింది . కొంతమంది చనిపోయిన వారి పేర్లను కూడా కుటుంబ సభ్యుల యొక్క రేషన్ కార్డు నుంచి తొలగించడం లేదు . అలాగే పెళ్లైన తరువాత వేరుపడిన వారు అలాగే వేరే ఊర్లకు వెళ్లి స్థిరపడిన వారికి వచ్చే రేషన్ ను కూడా తమ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు వెళ్లి తీసుకుంటున్నారు. దీంతో అసలు నిజమైన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు , అలాగే రేషన్ పంపిణీ యొక్క భారం తగ్గించుకునే అవకాశాలు ఏమైన ఉన్నాయా? అని తెలుసుకునేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించింది.

Ration Card KYC in Telangana

ప్రతి కుటుంబంలోని ఒక్కరు కచ్చితంగా కేవైసీ (KNOW YOUR CUSTOMER ) పూర్తి చేయాలి అని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఏ రేషన్ దుకాణానికి వెళ్లి అయినా e pass Machine ద్వారా వేలి ముద్ర ఇస్తే సరిపోతుందంటున్నారు . రేషన్ కార్డు కుటంబసభ్యులు అంతా ఒకేసారి వెళ్లాల్సిన అవసరం లేదని అలాగే ఎవరికి ఎప్పుడు వీలైతే వారు అప్పుడు వెళ్లి వేలిముద్ర ఇచ్చి కేవైసీ (KYC ) రషీదు తీసుకోవచ్చన్నారు . ఈ ప్రక్రియకు గాను రేషన్ కార్డు నంబర్ మాత్రం కచ్చితంగా ఉండాలన్నారు. లేకపోతే KYC చేయలేమని చెబుతున్నారు.

Ration Card KYC update Last Date

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి ( Village ) చెందినవారు అయినా సరే ఏ ప్రాంతంలో వీలు అయితే అక్కడి రేషన్ షాప్ కి వెళ్లి కేవైసీ ప్రక్రియని పూర్తి చేయవచ్చని రేషన్ డీలర్లు పేర్కొన్నారు . అయితే ఈ ప్రక్రియ ముగిసేందుకు కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు . ప్రభుత్వం ఇంకా అధికారికంగా డెడ్ లైన్ ( Dead Line ) విధించనట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా రేషన్ కార్డు ( Ration Card ) లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి , వీరంతా KYC ప్రక్రియ పూర్తి చేసేందుకు కచ్చితంగా సమయం పడుతుంది . అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి డెడ్ లైన్ ను ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటె కేవైసీ ప్రారంభించడానికి ముందు కొన్ని రకాల ఆందోళనలు వ్యక్తం అయ్యాయి . రేషన్ కార్డు ఉన్నటువంటి ఊరికే వెళ్లి ఈ KYC ని పూర్తి చేయాలని , కుటుంబసభ్యులు అంతా కూడా ఒకేసారి వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలని ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమి లేదని తెలంగాణ రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ కి అయినా వెళ్లి లబ్ధిదారులు కేవైసీ ( KYC ) పూర్తి చేయవచ్చని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రక్రియకు గాను కుటుంబ సభ్యులంతా ఒకేసారి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని , ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వేలిముద్ర ( Fingerprint ) ఇవ్వచ్చని తేల్చి చెప్పారు. ఈ కేవీసీ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోని రేషన్ కార్డు దారులు తమ వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం తెలిపింది. అసలైన రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు అనేది కూడా తేలిపోనుంది . ఇదిలా ఉంటె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు . కేవైసీ KYC ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశం ఉంది.

పెళ్లి రోజు శుభాకాంక్షలు – Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?