Telangana 6 Guarantees ప్రజా పాలన అంటే ఏమిటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ నోట విన్నా Telangana 6 Guarantees ప్రజా పాలన దరఖాస్తు అని వినబడుతుంది అసలు ఈ ప్రజా పాలన దరఖాస్తు అంటే ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వారి యొక్క మేనిఫెస్టోలో ఆరు పథకాలు ( Telangana 6 Guarantees గ్యారంటీ లు) ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి డిసెంబర్ 7 తారీకున ముఖ్యమంత్రి మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజున డిసెంబర్ 9 తారీకునా మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు తెలంగాణలోని ఏ ప్రాంతానికైన ఫ్రీగా tsrtc బస్సుల్లో ప్రయాణించే సదుపాయం తో పాటు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని 10 లక్షలకు పెంపు పథకాలకు ఆమోద ముద్ర వేసి అమలు చేయడం జరిగింది.

ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ ప్రకారం మిగితా 5 గ్యారంటీలను అమలు చేయడం కోసం ప్రజా పాలన అనే దరఖాస్తు ఫారం లో మిగిత ఐదు గ్యారంటీ లను అప్లై చేసుకునే సదుపాయాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన డిసెంబర్ 28 వ తేదీ నుండి జనవరి 6 ఎవరు ఏ పథకానికి అరుహులో ఆ పథకానికి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ప్రజాపాలన ఫామ్ లో ఈ విధంగా అప్లై చేసుకోండి మొదటగా దరఖాస్తు దారుని పూర్తి వివరాలు సమర్పించాలి స్త్రీ లేదా పురుషుడు ఏం కులానికి చెందిన వారు, పుట్టిన, తేది ఆధార్ నంబర్ , రేషన్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, దరఖాస్తు ధారుని వృత్తి రాయాలి క్రింది పట్టికలో కుటుంబ సభ్యుల పేరు దరఖాస్తు దారునితో సంబంధం పుట్టిన తేది ఆధార్ నంబర్ వంటి వివరాలు రాసి దరఖాస్తు దారునీ పూర్తి అడ్రస్ రాయాలి

1) మొదటిది మహాలక్ష్మి పథకం లో బాగంగా అర్హులైన మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్ ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారు కంపెనీ పేరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది

2) రెండవది రైతు భరోసా ఎకరానికి ఏడాదికి 15000 ల చొప్పున పొందేవారు రైతుల లేదా కౌలు రైతుల పట్టాదారు పాస్ బుక్ నంబర్ పంట వివరాలు సర్వే నంబర్ ఇవ్వాలి వ్యవసాయ భూమి లేకపోతే వ్యవసాయ కూలీలు ఏడాదికి 12000 ఆర్థిక సహాయం కోసం జాబ్ కార్డు నంబర్ రాయాలి

4 ) గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం మీరు ఎన్ని యూనిట్లు కరెంట్ వాడుతారు మీయొక్క మీటర్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి

5 )చేయూత పథకం ద్వారా దివ్యాంగులకు నెలకు 6000 కోసం సదరం సర్టిఫికేట్ నంబర్ వెయ్యాలి 4000 రూపాయల పెన్షన్ కోసం 1)వృద్ధాప్య 2)గీత కార్మికులు 3) డయాలసిస్ బాధితులు 4) బీడికార్మికులు 4)ఒంటరి మహిళ జీవన బృతి 5) ఒంటరి మహిళ 6)వితంతు 7)చేనేత కార్మికులు 8)ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 9)ఫైలేరియా బాధితులు 10) బీడీ టేకేదర్లు అప్లై చేసుకోవాలి

ఈ ఐదు పథకాలకు అప్లై చేసుకునేవారు తమ ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ జత పరచాలి

Read More Articles

ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన ఆటగాడు ఇతనే IPL 2024 Players Acution

BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ : 107 రూ లకే 35 రోజుల వాలిడిటీ కాల్స్ , డేటా కూడా BSNL New Prepaid Plan

లక్షద్వీప్ కి చేరుకోవాలంటే ఇలా వెళ్ళండి | How to reach lakshadweep | Maldives బొప్పాయి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? | Health Benefits of Papaya ఈ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడ కనబడ్డా వదలరు Mulberry Fruits టీ త్రాగే ముందు వాటర్ తాగకుంటే మీ బాడీ లో ఏం జరుగుతుందో తెలుసా ? చియా సీడ్స్ ( సబ్జా గింజల ) ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు